🔻**సాలిగ్రామం, గండకీ కథ**🔻
#సాలిగ్రామం ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? ♦ఇది ఊరి పేరు కాదు. గ్రామం అస్సలే కాదు. విష్ణువు ఆకారంలో ఉండే చిన్నచిన్న రాళ్లనే సాలి గ్రామం అంటూ ఉంటారు. వాటిపై విష్ణువు రూపం ఉటుంది. అయితే ఇవన్నీ కూడా ఒక్క నదిలోనే ఎక్కువగా దొరుకుతాయి. గండకి నది గర్భంలోనే ఇలాంటి రాళ్లు ఎక్కువగా దొరుకుతాయి. వీటిని చాలా మంది పూజగదిలో ఉంచుకుని పూజిస్తుంటారు. వీటికి ఎంతో మహిమ ఉంటుందని భక్తుల నమ్మకం. ఇవన్నీ గుండ్రంగా నున్నగా ఉంటాయి. తాబేలు ఆకారంలో నోరు తెరుచుకుని ఉంటాయి. లోపల విష్ణువు కనపడతాడు. ఇంత ప్రత్యేకమైన సాలి గ్రామాలు గండకి నదిలోనే లభించడం వెనుక ఒక కథ ఉంది. ♦*పూర్వం గండకీ అనే అమ్మాయి ఉండేది. ఆమె అందానికి ఎవరైనా సరే దాసోహం కావాల్సిందే. శ్రావస్తి అనే నగరంలో ఈ గండకీ ఉండేది. గండకీ ఒక వేశ్య. ♦గండకీతో ఒక్కరాత్రి గడిపితే చాలు వాళ్ల తలరాతలు మారిపోయేవి. వాళ్ల అదృష్టాలు మారిపోయేవి. బాగా సంపన్నులుగా, గొప్పవాళ్లుగా మారిపోయేవారు. దీంతో చాలా మంది డబ్బు ఉన్న వాళ్లు కూడా ఆమెను అనుభవించాలనుకునేవారు. అయితే గండకీ మాత్రం అందరినీ తన దగ్గరకు రానిచ్చేది కాదు. ♦చెడ్డ వాళ్లతో అస్సలు గడిపేది కాదు. రోజుకు ఒక్క వ్యక్తితోనే గడిపేది. భర్తగా