🚩🚩🚩❤నటదిగ్గజం- "బళ్ళారి రాఘవ".❤🚩🚩🚩



♦బళ్ళారి రాఘవ (ఆగష్టు 2, 1880 - ఏప్రిల్ 16, 1946) తెలుగు నాటకరంగ ప్రముఖులు. 

ప్రముఖ న్యాయవాది అయినా నాటకాలలో ప్రత్యేకాభిమానం, ప్రతిభతో రాణించాడు. 

తన సమయాన్ని, సంపదను నాటక రంగ పురోగతికోసం వెచ్చించిన 1946, ఏప్రిల్ 16 న మరణించాడు.

♦అతని పూర్తిపేరు తాడిపత్రి రాఘవాచార్యులు. తండ్రి నరసింహాచారి, తల్లి శేషమ్మ. రాఘవ తల్లిదండ్రులకు లేకలేక పుట్టిన బిడ్డ.  వారిది శ్రీవైష్ణవ శాఖకు చెందిన బ్రాహ్మణ కుటుంబం. తండ్రి తాడిపత్రి పురపాలక సంఘ పాఠశాలలో తెలుగు పండితునిగా పనిచేసేవాడు

♦రాఘవకు బాల్యం నుంచే నటనలో, నాటకాల్లో ఆసక్తి ఉండేది. 

అది మరింత వికసించి మద్రాసులో చదివే రోజుల్లో అనేక నాటకాల్లో నటించి అనుభవం గడించేలా ఉపకరించింది.

♦బళ్ళారి ఉన్నత పాఠశాల చేరి మెట్రక్ పూర్తి చేసి, మద్రాసులోని క్రిష్టియన్ కాలేజీలో న్యాయశాస్త్రం చదవడానికి చేరాడు. న్యాయశాస్త్రంలో 1905లో ఉత్తీర్ణత పొందాక, మద్రాసులో న్యాయశాస్త్రాన్ని ప్రాక్టీసు చేయడం ప్రారంభించారు.

కొద్దికాలంలోనే రాఘవ న్యాయవాదిగా, ముఖ్యంగా క్రిమినల్ కేసులు వాదించడంలో, ప్రసిద్ధి చెందాడు. ధనికుడయ్యాడు. ఆయన ప్రతిభను గుర్తించి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించింది. "రావు బహద్దూర్" అన్న బిరుదు కూడా ఇచ్చింది.

♦కానీ ఆయనకు నాటకాలలో ప్రత్యేకాభిమానం, ప్రతిభ ఉన్నాయి. బళ్ళారి రాఘవ నాటక ప్రదర్శనను చూడడం ఒక అద్భుతమైన అనుభూతి అని అప్పట్లో కళాప్రియులు చెప్పుకొనేవారు. 

♦1919 జనవరిలో బెంగుళూరులో జరిగిన ఫెస్టివల్ ఆప్ పైన్ ఆర్ట్ లో రఘవ పఠాన్ రుస్తుంగా ప్రదర్శించిన అభినయాన్ని రవీంద్ర నాథ్ టాగూర్ ఎంతగానో మెచ్చుకున్నారు.

♦1927 గాంధిజీ బెంగుళూరు సమీపంలోని నందీ హిల్స్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు. పండిత్ తారానాథ్ (రాఘవ ఆధ్యాత్మిక గురువు) రచించిన హిందీ నాటకం 'దీన బంధు కభీర్ ' నాటకాన్ని చూడ వలసిదిగ, గాంధీజీని బెంగుళూరుకు ఆహ్వానించారు. 

కొన్ని నిముషాల చూద్దామను కొన్నాడు గాంధీజీ. గంట అయినా నాటకాన్ని చూస్తూనె వున్నాడు గాంధీజీ. కార్య దర్శిగా వుండిన రాజాజి, 'ప్రార్థనకు వేళైంది ' అని గుర్తు చేశాడు. "మనం ప్రార్థనలోనే వున్నాం కదా?" అంటూ గాంధీజీ రాఘవ నటన అద్భుతం అన్నాడు. రాఘవ మహరాజ్ కీ జై అన్నాడు గాంధీజీ.

♦తెలుగు వారి పుణ్యంపు పంట బళ్ళారి రాఘవ.రామదాసు వే

సినా, రావణునిగా నటించినా, హిరణ్యకశిపుని పాత్రలో కనిపించినా, పేదరైతుగా అభినయించినా ఆ పాత్ర స్వభావాన్ని కళ్ళముందు సాక్షాత్కరింపచేసే నటనా చక్రవర్తి బళ్ళారి రాఘవ.తెలుగు నాటకరంగం పేరు చెబితే తొలిగా మదిలో మెదిలే పేరు బళ్ళారి రాఘవేనంటే ఎంతమాత్రమూ అతిశయోక్తి కాదు.

♦ప్లీడరు వృత్తి చేస్తూ నటభారతికి నవ్యనీరాజనమిచ్చిన మహనీయ నటనాసార్వభౌముడు బళ్ళారి రాఘవ. స్త్రీ పాత్రలను స్త్రీలే పోషించాలని ఎంతో మంది మహిళలకు అవకాశమిచ్చిన సంస్కర్త ఆయన.

♦1928 మే 8 న రాఘవ ఇంగ్లాండుకు బయలు దేరాడు. 

లండన్లో పెక్కు నాటకాలను చూచి, ఆంగ్ల నటుల పరిచయం సంపాదించు కొన్నాడు. విఖ్యాత నాటక కర్త, కళావిమర్శకుడు జార్జి బెర్నార్డ్ షాతో రాఘవ కళల గురించి విశ్లేషణ జరిపాడు. కళల గురించి తెలుసు కోవడానికి మీరు ఇక్కడి కెందుకు వచ్చారు? మేమే ప్రాచ్య దేశాలకు రావాలి. అన్నాడు షా. 

"మీరు దురదృష్టం కొద్ది భార దేశలో పుట్టారు. ఇంగ్లాండులో పుట్టి వుంటే షేక్సియర్ అంత గొప్ప వరై వుండే వారు అన్నాడు. 

♦రాఘవ రైతుబిడ్డ లాంటి సినిమా లలో నటించినా ఆయనకు సినీరంగం నచ్చకపోవడంతో తన మాతృగృహం రంగస్థలం పైకి తిరిగి వచ్చేశాడు.

♦తన సమయాన్ని, సంపదను నాటక రంగ పురోగతికోసం 

ధారాళంగా వెచ్చించాడు. 1946, ఏప్రిల్ 16 న రాఘవ మరణించాడు

♦ఆయన స్మృత్యర్ధం 'బళ్ళారి రాఘవ పురస్కారం' స్థాపించబడింది.

🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐