❤️🙂చక్రపాణి (సినిమా)🙂❤️



 ❤️🙂చక్రపాణి (సినిమా)🙂❤️

🚩అర్ధాంతరంగా తననుమిస్సమ్మ నుండి తప్పించినందుకు 

ప్రతిగా సొంత బ్యానరు మీద ‘చక్రపాణి’ అనే సినిమాను పేరడిగా

 తీసి, చక్కన్నను (చక్రపాణి గారు.)ఒక లోభిగా చూపిస్తూ (ఆ పాత్రలో సి.ఎస్‌.ఆర్‌ నటించారు) 

🚩 మిస్సమ్మ సినిమా కన్నా ముందే (19-03-1954) దాన్ని విడుదల చేసి కసి తీర్చుకుంది. 

🚩అంతేకాదు ‘రంభా చక్రపాణీయం’ (అంటే సావిత్రి చక్రపాణి )పేరుతో ఒక వ్యంగ్య రచనను కూడా పాఠకుల మీదకు వదిలింది.

🚩

🚩చక్రపాణి మంచి హాస్యభరితమైన తెలుగు సినిమా. దీనిని భరణీ పిక్చర్స్ పతాకంపై భానుమతీ రామకృష్ణారావులు నిర్మాతలుగా నిర్మించారు. ప్రధాన పాత్రల్ని అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి పోషించారు.

🚩చిత్రకథ

చక్రపాణి (సి.ఎస్.ఆర్.) కి ఒక మనవడు, ముగ్గురు మనవరాళ్ళు. మనవడు ఎప్పుడో ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. పెళ్ళైన ఇద్దరు మనవరాళ్ళలో ఎవరు ముందుగా మనవణ్ణి ఇస్తే వారికి లక్ష రూపాయలు ఇస్తానని చక్రపాణి ప్రకటిస్తాడు. అతని మొదటి మనవరాలికి ఆడపిల్ల. రెండవ మనవరాలు మాలతి (భానుమతి), ఆమె భర్త చలం (అక్కినేని). మాలతి ఎలాగైనా లక్ష రూపాయలు సంపాదించాలని స్నేహితురాలు మనోరమ (సూర్యకాంతం) సలహాపై ఎదురింట్లో ఉన్న బాబును తీసుకొచ్చి తాతకు తన కొడుకుగా చెబుతుంది. భర్త పొరుగూరు వెళ్ళి తిరిగి వచ్చేలోగా మరొకర్ని (అమర్ నాథ్) భర్తగా కుదురుస్తుంది. అసలు భర్త చలం వచ్చాక అతన్ని వంటవానిగా పరిచయం చేస్తుంది. ఇద్దరు భర్తలకు మధ్య గందరగోళం, ఘర్షణ మూలంగా లక్ష కోసం కొంతకాలం ఓర్చుకోమని చలాన్ని కోరుతుంది. ఇంతలో చక్రపాణికి ఆ పసివాడు ఆమె కొడుకు కాదని, ఏనాడో దూరమైన తన మనవడి సంతానం అని తెలుస్తుంది. కథంతా కామెడీగా కొనసాగుతుంది.

🚩పాటలు

మీనాక్షీ మే ముదం దేహి - పి. భానుమతి

🚩మెల్లమెల్లగా చల్లచల్లగా రావే నిదుర హాయిగ - పి. భానుమతి

🚩నన్నుజూచి ఇంత జాలి ఏలనమ్మ మాలతి - పి. భానుమతి

🚩ఓ ప్రియురాల ఓ జవరాల పలుకవేలనే - ఎ. ఎమ్. రాజా

🚩ప్రక్కల నిలబడి కొలిచేవు జాడ బాగా - పి. భానుమతి

🚩ఉయ్యాల జంపాల లూగరావయా - పి. భానుమతి

*************************************************

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐