🚩🚩 ఆంగ్లము నుండి మక్కీకి, మక్కీ ఆంద్రీకరణ,!! ♦ఉమాపతి సెల్ మోగుతోంది.


 🚩🚩 ఆంగ్లము నుండి మక్కీకి, మక్కీ ఆంద్రీకరణ,!!

♦ఉమాపతి సెల్ మోగుతోంది.

అతను అది ఎక్కడ వుందో కనపడక వెతుకుతూ నా చరవాణి ఎక్కడ?చరవాణీ ఎక్కడున్నావే అని గట్టిగఅరుస్తూ వుంటే,కిచన్ లో కిచిడీ చేస్తున్న భార్య కనకం కోపంగా చరవాణా అదెవత్తీ? అంటూనడ్డి మీద చేతులు పెట్టుకొని చేతిలో 

గరిటతో సహా వచ్చింది.

♦అదేనే కనకం నా సెల్ ఫోను. .

అలా అఘోరించ వచ్చుగా అని మీ చొక్కా జేబులో వుంది. అని చెప్పి వెళ్లి పోయింది.

♦వెంటనే తెచ్చు కొని ఆకుపచ్చ మీట నొక్కి ఎవరూ అన్నాడు?

నేను బావా రమాపతిని.మా అబ్బాయి గణపతి కి కి ఈ నెల పదో తేదీన ఉపనయనం చేస్తున్నాము. మీరూ,చెల్లి తప్పక రావాలి. ఏ ట్రైన్ కి వస్తారో చెప్తే స్టేషన్ కి కారు పంపిస్తాను.

సరే వస్తాం లే బావా అని సెల్ పెట్టేసి భార్యను 

♦కనకం యిటు రావోయ్ అని పిలిచాడు. మీ అన్న కొడుకు ఉపనయనం అట.తప్పక రమ్మన్నాడు.

.అంచేత దరిద్ర రథం లో రెండు శయనాలు పుస్తకం చెయ్యమని సంతోషకర ప్రయాణాల 

వాడికి నీ చరవాణి లో చేప్పేయ్.అన్నాడు.

♦కనకం నెత్తి కొట్టుకుంటూ మీ భార్య నైన పాపానికి దరిద్ర రథం అంటే గరీబ్ రథ్ అనీ శయనాలు అంటే బెర్త్స్ అనీ అర్థ మయింది

.ఆ పుస్తకం చెయ్యడమేమి టో,ఆ సంతోష ప్రయాణాల వాడెవడో మీరే వివరించండి.

♦.అదేనే మన వెనక వీధిలో ఆనంద్ ట్రావెల్స్ వాడికి బుక్ చెయ్యమని చెప్పు.

అధికార భాషా చైర్మన్ గారూ మీకో దండం అని రెండు చేతులూ శబ్దం వచ్చేలాకొట్టింది కనకం !

దోవకి పూరీ కూరా చేసుకొని బయల్దేరారు.

♦ట్రైన్ ఎక్కి సర్దుకొని కూచున్న తర్వాత .కనకం అసలే నీది ద్విగవాక్ష శయనం,మెళ్ళో నగలూ గట్రా జాగ్రత్త.అన్నాడు ఉమాపతి..ఈ ద్విగవాక్ష శయనం ఏమిటండీ ? అంటే సైడ్ లోయర్ బెర్త్.వివరించాడు. ..కనకం నిట్టూర్చి నా రవలగాజులూ, చంద్ర హారం పక్కింటి పంకజం దగ్గర జాగ్రత్త చెయ్యమని ఇచ్చి వచ్చాను,మిగతావి నా బాగు లో జాగ్రత్తగా వున్నాయి లెండి. అయ్యో ఏ లెక్కా పత్రం 

లేకుండా వాళ్ళింట్లో ఎందుకు పెట్టావే? రేప్పొద్దున ఆవిడ నా దగ్గర పెట్టలేదంటే ఏమి చేస్తావే?అసలే ఆమె మొగుడు మన్మథరావు పానబోతూ,పరిభ్రమణ బోతూ నూ.

.♦పానబోతూ,పరిభ్రమణ బోతూ ఏమిటండీ? .అంటే తాగుబోతూ,తిరుగు బోతూ అని 

.వివరించాడు ఉమాపతి. మహానుభావా! యింగ్లీషు పదాలకే అనుకున్నా తెలుగు పదాలకు కూడా పర్యాయ పదాలు కనిపెడు తున్నారా?అని తల బాదుకుంది. అది సరే కానీ మనకు ఆ తెలుగు ఖాతా కార్యాలయం లో తాళపేటిక ఒకటి విలపించింది కదా!

అందులో పెట్టి రావలిసింది. కాసేపు ఆలోచించి ఓహోఆంధ్రాబ్యాంక్ లో లాకర్ ఒకటి ఏడిచింది కదా! అని అర్థం చేసుకొని మీరే పెట్టి వచ్చి ఉండవచ్చు కదా!అని దబాయించే సరికి నోరు మూసుకొని పడుకున్నాడు. పొద్దున్నే హైదరాబాద్ చేరారు. 

♦మీ అన్న చతుశ్చక్ర వాహనం(కారు) పంపిస్తానన్నాడు పంప లేదు చూశావా?అని సరే ఈ త్రిశ్చక్ర వాహనం లో వెడదదాం అంటూ (ఆటో)మాట్లాడాడు.ఫంక్షన్ హాల్ దగ్గర దిగి లోపలికి వెళ్లి 

దరిద్ర రథం లో వస్తానని దూరవాణి లో చెప్పాను కదా!

చతుశ్చక్ర వాహనం పంపలేదేమిటీ? అని బావ మరిదిని నిలదీశాడు. రమాపతి తెల్లబోయి చూస్తూ వుంటే కనకం వివరించింది. 

సారీ బావా!మా అబ్బాయి కారు తీసుకొని వెళ్ళాడు .సమయానికి కారు యింట్లో లేదు .అన్నాడు రమాపతి .లోపల తమకిచ్చిన గదిలో సామాను సర్దేసి కనకం త్వరగా స్నానం చేసి కనకాంబరం పట్టుచీర కట్టుకొని ముస్తాబై నేను పెళ్లి మండపం లోకి 

వెళ్తున్నాను త్వరగా తయారై వెళ్ళిపోయింది. ఉమాపతి తయారై అరే నా 

♦ఉపలోచానాలు(కళ్ళజోడు) ఎక్కడ??అని కళ్ళజోడు కోసం వెతికాడు.కనపడ లేదు.అలాగే 

తడుముకుంటూ మండపం లోకి వెళ్ళాడు.అంతా మసక మసక గావుంది ఎవరూ సరిగ్గా కనపడడం లేదు.భార్య కోసం వెతుకుతున్నాడు. కనకం ఎక్కడుందీ అనుకుంటూంటే అక్కడే కనకంబరం చీర కనపడింది. అదిగో కనకం యిక్కడే వుంది అనుకుంటూ వెళ్లి కొంగు పట్టుకొని లాగాడు. ఆవిడ తిరిగి చూసి ఉమాపతి గూబ గుయ్యిమని పించింది. .ఏమిటీ తిక్క తిక్కగా వుందా?అని అంటే, ఏమైందంటే నా ఉపనయనాలు కనపడ లేదు అనిఉమాపతి ఏదో చెప్పబోతూంటే ఆవిడ భర్త వచ్చి కాలర్ పట్టుకొని ఉపనయనానికి వచ్చి ఉపనయనాలు కనబడ లేదంటా వేమిటి?అంటూ కొట్టబోతుంటే కనకం చూసి 

పరిగెత్తుకొచ్చి ఆపి అన్నయ్యగారూ! ఆయన మా ఆయనండీ క్షమించండి ఏదో పొరబాటు

అయింది.అంటూ ఏమిటండీ ఇదీ అంటే కనకం నీవు కనకాంబరం చీర కదా కట్టుకుంది చీర ఎప్పుడు మార్చావు? నా ఉపనయనాలు కనపడక నేను చస్తుంటే? అబ్బా ఫంక్షన్ లో గంట కొక చీర మారుస్తాము ఇంతకీ ఉపనయనాలేమిటి? అంది నా కళ్ళజోడు కనపడ లేదు అన్నాడు.ఉమాపతి. నెత్తి బాదుకొని నిన్నరాత్రి రైల్లో నా బాగు లో పెట్టారు కదా!

అని తీసి కళ్ళకు తగిలించి అందరికీ సారీ లు చెప్పి వెళ్ళింది.

 ♦వూరికి బయల్దేరి వెళ్ళేటప్పుడు, రమాపతి బావ గారిని ఆట పట్టిస్తూ బావా ఈ సారి వచ్చేటప్పుడు ఉప ఉపనయనాలు దగ్గరుంచుకో.అంటే అర్థం కాలేదా?స్పేర్ కళ్ళజోడుఅన్నమాట అన్నాడు. .🚩🚩

🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂


Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐