🔴 🚩🙏 దశావతారము ల లో బుద్ధ అవతారం.🙏 🚩 🔴


♦#పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధుపరిరక్షణకొఱకు, దుష్టశిక్షణ కొఱకు ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరిస్తాడు. 

♦అలాంటి అవతారాలలో 21దశావతారాలలో బుద్ధావతారానికి 

ఎంతో విశిష్టత వుంది. రాక్షస జాతిలోని హింసా ప్రవృత్తిని నిర్మూలించి ... 

అది వారి బలహీనతగా మారిన సమయంలో పరమాత్ముడు వారిని సంహరించాడు. తారకాసురుడు కుమారులైన విద్యున్మాలి ... తారకాక్షుడు ... కమలాక్షుడు వరబల గర్వంతో అటు దేవతలను ఇటు సాధుజనులను నానాకష్టాలు పెట్టసాగారు. దాంతో

 ♦బ్రహ్మదేవుడు ... శ్రీ మహా విష్ణువు ఆవు - దూడగా రాక్షస రాజ్యంలోకి అడుగుపెట్టారు. అక్కడి తటాకంలోకి దిగి అవి దాహం తీర్చుకుంటుండగా తారకాసురుడి కుమారులు చూశారు. దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతున్న ఆవుదూడలను బంధించడానికి ఆ తటాకంలోకి దిగారు. దాంతో ఒక్కసారిగా ఆ తటాకంలోని నీరంతా తాగేసి బ్రహ్మదేవుడు అదృశ్యమయ్యాడు. దూడగా వున్న విష్ణువు బుద్ధుడిగా వారి ఎదుట ప్రత్యక్ష్య మయ్యాడు.

♦జరిగిన మాయ గురించి వాళ్లు ప్రశ్నించగా అందుకు సమాధానం చెబుతూనే, అహింసా మార్గంలోని గొప్పదనాన్ని గురించి వారికి ఉపదేశించాడు. బుద్ధుని బోధనలు ఆకట్టుకోవడంతో వారు తమ దూకుడును తగ్గించుకున్నారు. అదే అదనుగా భావించిన శ్రీ మహా విష్ణువు తనని ఆయుధంగా చేసుకుని వారిని సంహరించవలసిందిగా పరమశివుడితో చెప్పాడు. 

♦అలా ముక్కంటి చేతిలో అస్త్రమై లోక కల్యానార్థం శ్రీ మహా విష్ణువు 

ఆ రాక్షస వీరులను సంహరింబుద్ధ అవతారము: కలియుగాది 

సమయంలో కీకటదేశంలో బుద్ధనామంతో జన్మించి జనులకు జ్ఞానాన్ని ఉపదేశించాడు. (బుద్ధుడు, బలరాముడు విష్ణువు యొక్క అవతారములని ప్రతీతి. ఉత్తర భారత సాంప్రదాయం ప్రకారం బుద్ధుడు అవతారమైతే, దక్షిణ భారత సాంప్రదాయం ప్రకారం బలరాముడు విష్ణువు అవతారంగా పరిగణిస్తారు.)

♦భగవద్గీతలో శ్రీకృష్ణుని సందేశం

యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత

అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్

పరిత్రాణాయ సాధూనామ్ వినాశాయ చ దుష్కృతామ్

ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే

అర్జునా! ధర్మమునకు హాని కలిగినప్పుడును, ఆధర్మము పెచ్చుపెరిగి పోవుచున్నప్పుడును (జన్మ కర్మ రహితుడనైనప్పటికిని) నన్ను నేను సృజించు కొందును. సత్పురుషులను పరి రక్షించుటకును, దుష్టులను రూపు మాపుటకును, ధర్మమును సుస్థిర మొనర్చుటకును నేను ప్రతి యుగమునందును అవతరించుచుందును.

♦భగవద్గీత నాల్గవ అధ్యాయము - జ్ఙాన, కర్మ సన్యాస యోగముల లోని ఈ రెండు శ్లోకములు ప్రసిద్ధములు. హిందూ విశ్వాసముల ప్రకారము లోకపాలకుడైన శ్రీ మహా విష్ణువు అనేక అవతారములు దాల్చును. అందు కొన్ని అంశావతారములు (ఉదా: వ్యాసుడు). కొన్ని పూర్ణావతారములు (ఉదా: నరసింహుడు). కొన్ని అర్చావతారములు (ఉదా: తిరుపతి వేంకటేశ్వరుడు).

♦పూర్ణావతారములు

పూర్ణావతారములలో దశావతారములు ముఖ్యమైనవి. అవి:

మత్స్యావతారము

కూర్మావతారము

వరాహావతారము

నృసింహావతారము లేదా నరసింహావతారము

వామనావతారము

పరశురామావతారము

రామావతారము

కృష్ణావతారము

బుద్దావతారము లేదా బలరామావతారము

కల్క్యావతారము

♦బలరాముడు స్థానంలో బుద్దుని శంకరాచార్యులు తీసుకుని వచ్చినట్లు 

ఒక ప్రతీతి. కానీ వెంకటేశ్వరస్వామి ఈ దశావతారాలలోని వాడు కాదు.

♦చాలాకాలము నుండి విష్ణువు అవతారాలలో పది ముఖ్యమైనవి అని చెప్పుచున్నప్పటికీ. ఆ పది అవతారాలు ఏవి అన్న అంశంపై ఏకాభిప్రాయం లేదు. హరివంశమునందు నారాయణ, విష్ణు, వరాహ, నారసింహ, వామన, దత్తాత్రేయ, జమదగ్న్య, రామ, కృష్ణ, కల్కి అవతారములు పది ప్రధానావతారాలని పేర్కొనబడింది (హరి వంశం పూర్వ 1.42). ఇందులో మత్స్య, కూర్మ, బుద్ధ, బలరామావతారాలు లేవు. మహాభారతమునందు శాంతిపర్వములో చెప్పబడిన అవతారములలో బుద్ధావతారం లేదు 

(శాంతి పర్వం అ.339). మత్స్య పురాణంలో ధర్మ, నరసింహ, వామనావతారములు సంభూత్యవతారములని, దత్తాత్రేయ, మాంధాతృ, పరశురామ, రామ, వేదవ్యాస, బుద్ధ, కల్కి అవతారాలు మానుషావతారములని దశావతారాలను ఏకరువు పెట్టినది.

🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔

Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩