
🚩🚩'‘పుష్కరాల రేవులో పుల్లట్లు’🚩🚩 (బి.వి.ఎస్. రామారావు) సేకరణ -ఆంధ్రజ్యోతి (దీపావళి) సంచిక నుండి - #వెన్న కాచినప్పుడు గోకుడు వస్తుంది. ఆ గోకుడిని గోదావరిఅంటారు. ఆ గోదావరికి వుండే రుచే... ఈ గోదావరి కథలకూ వుంది. అలాంటి కథలలో పెద్ద కథ.. పుల్లట్లంత రుచికరమైన కథ... అల్లం పచ్చడిలా జుర్రుకోవాలనిపించేంతగానోరూరించే కథ #పుష్కరాల రేవులో పుల్లట్లు’ కథ. అయితే... ఈ కథలో పుల్లమ్మ పాత్ర చిత్రణఅణగారిన వర్గ నేపథ్యమే అయినా మనసుకు హత్తుకొంటుంది. ఇది పుల్లమ్మ ప్రేమ కథ. ఆడది ఒకసారిమనసారా ప్రేమిస్తే... తాను ప్రేమించినోడి కోసం, తన ప్రేమను సాకారం చేసుకోడం కోసం ఎంతటిత్యాగానికైనా వెనుదీయదని చెప్పడానికి పుల్లమ్మే ఉదాహరణ. తాను ఏ నేపథ్యం నుంచి వచ్చినా.. తనవ్యక్తిత్వాన్ని, అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం తుదివరకూ పోరాటం చేస్తుంది. “ప్రవాహంలో తరంగాల్లా ఎన్నో జీవితాలు కాలప్రవాహంలో సాగిపోతుంటాయి. తరంగానికిదిగువ మనకి కనపడని మరొక తరంగం ఉంటుంది, ఆ తరంగ శక్తే మనం చూస్తున్న తరంగాన్నినడిపిస్తుంది. అలాగే మనమెరిగిన వ్యక్తుల జీవితాల వెనుక మనమెరుగని ఎన్నో బాధలూ కథలూ దాగిఉంటాయి. ....