💥సూర్య నమస్కార మంత్రాలూ:💥
💥సూర్య నమస్కార మంత్రాలూ:💥
ధ్యేయ: సదా సవిత్రు మండల మధ్య వర్తీ,
నారాయణ సరసిజానన సన్నివిష్ట:
కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటీ,
హరీ హిరణ్మయ వపు: ద్రుత శంఖ చక్ర:🙏
🔥సూర్య నమస్కార మంత్రాలూ:🔥
1. ఓం మిత్రాయ నమ:
2. ఓం రవయే నమ:
3. ఓం సూర్యాయ నమ:
4. ఓం భానవే నమ:
5. ఓం ఖగాయ నమ:
6. ఓం పూష్ణే నమ:
7. ఓం హిరణ్య గర్భాయ నమ:
8. ఓం మరీచయే నమ:
9. ఓం ఆదిత్యాయ నమ:
10. ఓం పవిత్రే నమ:
11. ఓం అర్కాయ నమ:
12. ఓం భాస్కరాయ నమ:
🚩🚩
ఈ మంత్రాలూ చదువుతూ సూర్య నమస్కారాలు చేసిన తరువాత ఈ క్రింది శ్లోకమును చదువ వలెను.
♥ఆదిత్యస్య నమస్కారం ఏ కుర్వన్తి దినే దినే
జన్మాంతర సహస్రేషు దారిద్ర్యం నోపజాయతే..
🚩
క్రింద చెప్పిన మంత్రమును చదువుతూ ముమ్మారు సూర్యునకు అర్ఘ్యము నీయవలెను.
॥ సూర్యార్ఘ్యమంత్రం ॥
ఏహి సూర్య సహస్రాంశో తేజోరాశే జగత్పతే ।
అనుకంపయ మాం భక్త్యా గృహాణార్ఘ్యం దివాకర ॥
సూర్య, సహస్రాంశో, తేజోరాశే, జగత్పతే, ఏహి. మాం అనుకంపయ. దివాకర, భక్త్యా అర్ఘ్యం గృహాణ ॥
సూర్య = ఓ సూర్యుడా
సహస్రాంశో = అనంతమైన కిరణాలుకలవాడా
తేజోరాశే = తేజస్సు యొక్క రాశి
జగత్పతే = ప్రపంచానికి అధిపతీ
ఏహి = రావయ్యా
మాం = నన్ను
అనుకంపయ = దయతో చూడు
దివాకర = ఓ సూర్యభగవాన్
భక్త్యా = భక్తి చేత
అర్ఘ్యం = అర్ఘ్యాన్ని
గృహాణ = తీసుకో
ఓ సూర్యుడా, అనంతమైన కిరణాలుకలవాడా, వెలుగుల రాశీ, ప్రపంచానికి అధిపతీ, రావయ్యా. నన్ను కరుణించు. ఓ దివాకరా, భక్తిచేత (నేను ఇచ్చే ఈ) అర్ఘ్యం తీసుకో.🙏🙏🙏
🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂
Comments
Post a Comment