♥🚩 మాయ లేడి - మాయ సీత కధ .🚩♥


 ♥🚩 మాయ  లేడి - మాయ  సీత  కధ .🚩♥

(ఇది కొన్ని రామాయణాల్లో వున్న పిట్టకథ_)

#సీతకోరగా మాయలేడిని పట్టుకోడానికి రాముడు వెళ్ళిన సమయంలో రామబాణానికి గురైన మారీచుడు(మాయలేడి)ప్రాణాలొదులుతూ

'హా సీతా హా లక్ష్మణా'అంటూ రాముని గొంతుతో అరవడం అదివిన్న సీతమ్మ రామునికేదో కీడువాటిల్లిందని తలచి కాపుగావున్న లక్ష్మణునిదుర్భాషలాడి  పంపడం.

ఆసమయంలో రావణుడు సన్యాసి వేషంలో వచ్చి మోసగించి అపహరించడం అన్ని రామాయణాల్లోనూ వుంది.తరువాత ఒంటరిగా సీతను వదిలి వచ్చినందుకు తమ్ముని తిట్టి సీతకనబడక రాముడు చెట్టుని పుట్టని అడుగుతూ అడివంతా తిరిగి 

ఏడవడం అన్నింటిలోవుంది.కొన్నింటిలోనే వున్నది_గగన విహారం చేస్తున్న పార్వతీ పరమేశ్వరులు_

ఏడుస్తున్న రాముని చూశారు పార్వతి భర్తనడిగింది.'మీరు నన్ను రోజూ చేయమనేది ఈరాముని జపాన్నేనా?పెళ్ళాం కనబడక పోతే ఓకాముకుడిలా ఏడిచే ఇతడి జపమా చేసేది?'అని.'నువ్వే వెళ్ళి సీతలా కనబడి కాముకుడో కాదో పరీక్షించు.'అన్నాడుశివుడు.పార్వతి అచ్చు సీతగామారి రామునికి కొంచెందూరంలో పువ్వులుకోస్తోంది.

రాముడొచ్చి దరిచేరితే పాఠంచెబ్దామనుకుంది.రాముడుదూరంనించే 

'ఏమ్మా చెల్లాయ్ పార్వతీ బావగారినొదిలి ఒంటరిగా వచ్చావేం?'అనేసరికీ హతాశురాలైంది.గ్రహించిన రాముడు'చూడమ్మా మానవుడిగా పుట్టినందుకు భార్యవియోగం బాధాకరమని ఆచరించిచూపుతున్నాను.సీత ఎక్కడుందో నాకుతెలుసు.సీతకీనాసంగతి తెలుసు.ఇదినాటకం.'

అన్న రాముడితో 'క్షమించు అన్నా క్షణం అజ్ఞానం ఆవరించి అలా ప్రవర్తించాను.'అంది పార్వతి.'పరవాలేదులే తెలుసుకున్నావుకదా!వెళ్ళమ్మా వెళ్ళు.బావగారు నీకోసం ఎదురు చూస్తున్నారు.'అన్న రామునికి నమస్కరించి అంతర్ధానమై శివుని చేరింది.నాటినుండి మరింతభక్తిగా రామనామంజపించడం మొదలెట్టింది.

♥శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |

సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే ||♥

🚩🚩వాల్మీకిఈకథ ఎందుకురాయలేదంటే రావణుని చంపడానికి మానవావతారంఎత్తినరాముని దివ్యత్వంతెలియకూడదని.ఈకథపార్వతీ పరమేశ్వరులుచెప్పుకున్న అధ్యాత్మరామాయణంలోనేవుంది.

(Courtesy -R S Hymavathi garu .)

👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🚩🚩

Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩