💥🔥-ప్రపంచం సాగుతూనే ఉన్నాది.-🔥💥 ( 1850 లో రావి శాస్త్రి గారు రాసిన స్కెచ్..)
-
💥🔥-ప్రపంచం సాగుతూనే ఉన్నాది.-🔥💥
( 1850 లో రావి శాస్త్రి గారు రాసిన స్కెచ్..)
🚩🚩కాశీ నగరం. గంగానది ఒడ్డు!
.#దుర్యోధన మహారాజు హతుడై పోయాట్ట. అధర్మం లో యుద్ధం ముగిసింది! ' చారుదత్తుడు అంటాడు'ధర్మాధర్మాల .మాటేమిటి? నీకూ, నాకూ కాదు, ప్రపంచానికే అంత్యకాలం ఆసంనమయినట్టుంది'. దేవదత్తుడు వాపోతాడు.'హర హర మాహాదేవ శంభో' ప్రతివైపు నుండి వినిపిస్తూంది. ఇద్దరూ విశ్వేశ్వరాలయం వైపు మళ్లేరు. *
...
🚩🚩సంఘారామం. సాయం !
#సమయం.'ఈ శంకరాచార్యుడు శివుడి అవతారమాట ' అన్నాడు ఉపాలి.'ఇంతకాలం తథాగతుడికి తలలోగ్గిన బ్రాహ్మణులు, తిరిగి తంత్రాలతో తలలేట్టుతున్నారన్న మాట.'' తిరిగి కులభేదాలేర్పడి ప్రజలు చెడిపోతార ఆనందా! 'అంతకన్నా ప్రమాదకరం: పరమాత్మకీ జీవాత్మకీ భేదం లేదట. నేనే అతడూ, అతడే నేనూ అనే సూత్రం గ్రహిస్తేయ్ అజ్ఞానాంధకారం లోంచి బైట పడ్డట్టే'ఇటువంటి దుష్ప్రచారాలకి ప్రపంచం లోబడితే అంతా ఆఖరి దశకి వచ్చినట్టే!' ఉపాలి నిట్టూరుస్తాడు.**
🚩🚩తాజమహల్ బయట.
#సాయంకాలం.'ఔరంగజేబ్ పాదుషా చనిపోయాడని పుకారు, విన్నావా? . కాఫర్లింక మనల్ని బతకనివ్వరు. ' హుసేన్.అన్నాడు'నానా భీభత్సం జరుగుతుంది. ప్రపంచంలో ఇంక 'శాంతి' అనేది ఉండదు. మొగల సామ్రాజ్యానికి ఆఖర్రోజులోచ్చేయి' అంటాడు రెహమాన్.'అంటే.. మహా ప్రపంచానికే ఆఖరి దశ వచ్చిందన్న మాట'***
🚩🚩1947 ఆగస్ట్ 15. క్లబ్బు బయట.
#జయజయ ధ్వనులు.'ఈనాడింత కోలాహలం చేస్తున్న జనం కొద్ది కాలంలో గోరీల్లోనూ, శ్మశానాల్లో నూ ఉంటారు' అన్నాడు రిచర్డ్.'ప్రపంచమంతా కుక్కల నక్కల పాలవుతుంది. మన బ్రిటిష్ సామ్రాజ్యం ఇలా నీళ్ళ కలిసి పోతోందా! చూస్తూ ఉంటే ప్రపంచానికి ఆఖరి దశ సమీపించినట్టుంది' అంటాడు చార్లెస్.
ప్రపంచం సాగుతూనే ఉన్నాది.. ఇన్ని వేల సంవత్సరాల నుంచీ!
..
వ్యాఖ్యానం అవసరం లేని ఈ కథ (కుదించబడింది)ను రాసింది
దార్శనిక కథకుడు రావి శాస్త్రి. 1950 లో వచ్చిన దీన్ని పునర్ముద్రించిన
శాయి 'కారణాలు ఏవైనా ఒక స్థితిలో మనిషిలో ఏర్పడిన నిరాశావాదం, భవిష్యత్తులో ఆశావాదాన్ని నెలకొల్పుతుందని ఏఏ కథ చెప్పకనే చెప్తుంది' అన్నారు.
---
🚩🚩🚩♥ఇప్పుడు కరోనా కధ కూడా అంతే ♥🚩🚩🚩
👌👌👌👌ఆణిముత్యం లాటి మాట!👌👌👌👌
Comments
Post a Comment