ఒక కుమారి జాలి కధ !
❤️పదారేళ్ల వయసులో జయలలిత ఇలానే కల కంది. ఓ మామూలు ఆడపిల్లలా కలల రాకుమారుడు వస్తాడని, పెళ్లి చేసుకుంటాడని, ఓ మంచి గృహిణిగా బతకాలనీ కోరుకుంది...! ♥️♦️"ఆజా సనమ్.. మధుర చాందినీ మె హమ్.. తుమ్ మిలే తో విరానే మే భీ ఆ జాయేగీ బహార్.. జూమే లగేగా ఆసమాన్..’ అంటూ ఇష్టంగా, తన్మయత్వంతో పాడేది. ♦️ఆ క్షణంలో... ఆ కళ్లల్లో గతం తాలూకు కలల మెరుపులు. బహుశా ఈ కల నిజమై, ఆమె కోరుకున్న మనిషితో పెళ్లి జరిగి, ఓ మంచి గృహిణిగా స్థిరపడి ఉంటే... భారత చరిత్రలో నిలిచిపోయే నాయకురాలు పుట్టేది కాదేమో! ‘♥️ప్రేమ మీద మీ అభిప్రాయం ఏంటి?’ అని అడిగితే ‘అన్‌కండిషనల్ లవ్ అనేదే నిజమైన ప్రేమ, ఎలాంటి షరతులు లేని ప్రేమ, అలాంటి ప్రేమ ఉందంటే నేను నమ్మను’ అని అంటారామె. ♦️ఎలాంటి నిజాన్నయినా చెప్పగలిగే ధైర్యం ఆమె సొంతం. ‘నారీ కాంట్రాక్టర్ అంటే నాకు ఇష్టం, అతన్ని చూడ్డం కోసమే మ్యాచ్‌లకి వెళ్లేదాన్ని. తర్వాత షమ్మీ కపూర్ మీద ఓ బలమైన ఆకర్షణ. జంగ్లీ సినిమాను ఎన్నిసార్లు చూశానో.. అన్ని పాటలు నోటికి వచ్చేవి అప్పట్లో’ అని జయలలిత చెప్పేవారు. ♦️‘అమ్మ నన్ను వదిలి వెళ్లిపోతుందేమో అని, ఆమె చీర చెంగుని నా చేతికిచుట్టేసుకుని పడుకునే దాన్ని.