Posts

Showing posts from November, 2022

 🚩మంచీ -చెడు .(నవల .) (శారద .)

Image
      🚩మంచీ -చెడు .(నవల .)             (శారద .)                  వింజమూరి(9) ♦️ తెలుగు సాహితీ వీధుల్లో ఎప్పటికీ చెరిగిపోని తన పాద ముద్రలు విడిచి వెళ్ళిపోయిన తెలుగు వాడు కాని తెలుగు రచయిత ఎస్. నటరాజన్ (శారద). శారద రాసిన మంచి చెడు ,అపస్వరాలు , ఆంధ్ర పత్రికలో సిరయాలుగా వచ్చేవి .. ♦️1924లో తమిళునాడులో పేద బ్రహ్మణ కుటుంబంలో పుట్టి, పొట్ట కూటికై 12 వ ఏట తెనాలి వచ్చి, హొటల్‌లో సర్వర్‌గా జీవితం మొదలు పెట్టాడు. మొదట తెలుగు మాట్లాడడం నేర్చుకొని, 13వ ఏట తెలుగు వ్రాయడం, చదవడం నేర్చుకొని , 22వ ఏట తెలుగులో స్వంతంగా రచనలు చేసాడు. మూర్చరోగంతో బాధ పడుతూ, రోజంతా గొడ్డు చకిరి చేస్తూ, రాత్రి గుడ్డి కిరసనాయిల్ దీపం వెలుతురులో తెలుగులో రచనలు చేసాడు. ♦️100 దాకా సాంఘిక, డిటెక్టివ్ కధలు, మంచీ-చెడు, అపస్వరాలు వంటి ఒక డజన్ నవలలు, ఇంకా నాటికలు, వ్యంగ్య రచనలు చేసి, కొడవటిగంటి, చలం, గోపిచంద్, శ్రీశ్రీ వంటి లబ్దప్రతిష్టుల మన్ననలు పొందాడు.  తొలిసారిగా ఆయన వ్రాసిన వ్యంగ్య రచన 'ప్రపంచానికి జబ్బుచేసింది'. ఇది 1946 లో ప్రజాశక్తి పత్రికలో ప్రచురించబడింది. ఆ రచన వారి సొంత పేరైన యస్.నటరాజన్ పేరు మీదే అచ్చయింది. ♦️

❤సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు!

Image
  ❤సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు! ♦చేయదలచిన మహత్కార్యము మోయజాలని భారమైతే... పొందగోరినదందలేని నిరాశలో అణగారి పోతే.... బుసలు కొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక.... ఓటమిని ఓడించగలిగిన ఓరిమే కూర్మమన్నది... క్షీర సాగర మధన మర్మం.! - ♦కూర్మావతారం ద్వారా మనిషి నేర్చు కోవలసిన ముఖ్యమైన లక్షణాలు పట్టుదల, ఓర్పు , సహనం అని సీతారామ శాస్త్రి గారు వివరించిన విధానం నిజంగా అమొఘం.. ♦మనం ఏమైనా గొప్ప గొప్ప ఘనకార్యాలు తలపెట్టేటప్పుడు ఆ పని భారం మంధర పర్వతం లాగ చాలా బరువుగా అనిపించి ఒకొక్కసారి వొదిలెయ్యాలనిపిస్తుంది.. ♦దానికి తోడు తనను తాడు లాగా ఉపయోగిస్తున్న వాసుకి సర్పం బుసలు కొట్టే విషపూరితమైన అసహనపు నిట్టూర్పు సెగలు పరిస్థితులను ఇంకా తీవ్రతరం చేసినా కానీ పొందవలసినదందలేదని నిరాశ నిస్పృహలతో నీరశించకుండా ఓర్పుతోను, పట్టుదలతోను నొప్పిని సహిస్తూ అడుగు ముందుకెస్తే ఓటమిని కూడా ఓడించగలిగే అవకాశం ఉంటుందని, విజయం వరించడం ఖాయమని కూర్మావతారమర్మం అంటూ అయిదు వాక్యాలతో అద్భుతంగా తెలియజేసారు . 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

🚩🚩-బలిపీఠం (నవల)--🚩🚩 (రంగనాయకమ్మ.)

Image
  🚩🚩-బలిపీఠం (నవల)--🚩🚩            (రంగనాయకమ్మ.)                                  (వింజమూరి 😎 ♦️♦️తెలుగు ఆధునిక అభ్యుదయ సాహిత్యంలో చలం తరువాత తన అభిప్రాయాలను భావాలను నిర్భయంగా వెల్లడించి ఎందరో స్త్రీలను ప్రభావితం చేసి రచయిత్రిగా ఒక చెరగని ముద్రవేసిన ముప్పాళ్ళ రంగనాయకమ్మ ఒక సంచలన సాహితీ మూర్తిగా పేర్కొనవచ్చు. చలం తరవాత తన అభిప్రాయాలను హృదయానికి హత్తుకునేలా రాయగల రచయిత్రి ఆవిడే. వివహవ్యవస్థలో స్త్రీని అన్నిరకాల దోపిడీకి గురి చేసే సంప్రడాయాలపై ధ్వజమెత్తి స్త్రీ వాద ఉద్యమాన్ని ప్రభావితం చేశారు. ♦️బలిపీఠం బహుళ ప్రచారం పొందిన తెలుగు నవల. దీనిని రంగనాయకమ్మ రచించారు. ఇది 1962-63 ప్రాంతంలో ఆంధ్రప్రభ వారపత్రికలో ధారావాహికగఅ వచ్చింది. వింజమూరి 😎 ♦️♦️కథా సారాంశం! విశాఖపట్నంలో అనాథలు, అభాగ్యుల సేవకు అంకితమైన "కరుణ సమాజం" అనే సేవాసంస్థ కార్యదర్శి భాస్కరరావు. అట్టడుగు కులంలో పుట్టినా గొప్ప సంస్కారం, సొంత వ్యక్తిత్వం, స్వతమ్త్ర ఆలోచనాశక్తి, సంఘసేవా దీక్షాదక్షతలు గలిగిన వ్యక్తి అతడు. కరుణ సమాజానికి మూలపురుషుడైన మహర్షికి సంఘసేవే సర్వస్వం. అతడికి సంసారం లేదు. భాస్కరరావుకి ఆయనే తండ్రి, గురు

 🚩🚩-వేయిపడగలు-నవల ( విశ్వనాథ సత్యనారాయణ.)

Image
 🚩🚩-వేయిపడగలు-నవల                ( విశ్వనాథ సత్యనారాయణ.)                              (వింజమూరి .7.) ✍️✍️ఈ నవలను విశ్వనాధ సత్యనారాయణ ఆశువుగా చెబుతుండగా అతని తమ్ముడు వేంకటేశ్వర్లు వ్రాశారు. 1934లో సరిగ్గా 29 రోజుల్లో 999 అరటావుల మీద వ్రాశాడు. ఆనాడు ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు ప్రకటించిన పోటీ కోసం వ్రాయబడి బహుమతినందుకుంది. 1937-38లలో ఆంధ్రపత్రిక సచిత్ర వార పత్రికలో ధారావాహికగా ప్రచురింపబడింది. స్వర్ణోత్సవ సందర్భంగా తిరిగి 1987-88లో ఆంధ్ర పత్రికలోనే ప్రచురించారు. ♦️గుంటూరు ఏ.సి. కాలేజిలో మత సంబంధమైన ఒక వ్యాఖ్యకు సంబంధించిన వివాదంలో విశ్వనాధ తన ఉద్యోగాన్ని వదులుకోవలసివచ్చింది. ఆ ఉద్యోగం పోయి మరొక ఉద్యోగంలో చేరని దశలో ఈ నవల వ్రాయబడింది. నవలలో చెప్పబడిన ధార్మిక సాహిత్య వాద ప్రతివాదాలు విశ్వనాధ జీవితంలో ఇతరులతో జరిగిన విభేదాలను చాలావరకు ప్రతిబింబిస్తాయి. ♦️ఈ నవల విశ్వనాధ స్వీయానుభవాల సారాంశం అని, అందులోని పాత్రలలో ఆయన కుటుంబం, దగ్గరి సమాజం ఛాయలు గోచరిస్తున్నాయని పలువురు పరిశీలకులు అభిప్రాయపడ్డారు. ♦️స్థలాల స్వారూప్యం ఇలా చెబుతారు [- (వింజమూరి .7.) సుబ్బన్నపేట - నందమూరు, తోట్లవల్లూరు; వేణుగోపా

🚩🚩-కాలాతీత వ్యక్తులు.!! (డా. పి. శ్రీదేవి .)

Image
  🚩🚩-కాలాతీత వ్యక్తులు.!!           (డా. పి. శ్రీదేవి .)                              (వింజమూరి .6.)       ♦️కాలాతీత వ్యక్తులు డా. పి. శ్రీదేవి రచించిన తెలుగు నవల. ఈనాటి కాలంలో అనవసరమైన నియమాలను నిరసిస్తూ, పురుషాధిక్యతను ప్రతిఘటిస్తూ, తమపై అనేక రూపాల్లో జరుగుతున్న సామాజిక అత్యాచారాలపై పోరాడుతున స్త్రీశక్తి యొక్క ప్రారంభదశను 6వ దశాబ్దంలో రచయిత ఈ నవలలో ప్రదర్శించారు. ఇది తెలుగు స్వతంత్ర మాసపత్రికలో 7-9-1957 నుండి 25-1-1958 వరకు 21 వారాలు ధారావాహికగా వెలువడింది. ♦️ఈ నవల చదువుతుంటే తొలుత ఒక్కటే అనిపించింది. 1957 లో కూడా మనుషుల మనస్తత్వాలు.. ఇంత విచిత్రంగా ఉన్నాయా..? అన్నది మొదటి ప్రశ్న. అందుకేనేమో వారు కాలాతీత వ్యక్తులు అయ్యారు. రచయిత్రి పి. శ్రీదేవి గారు విశాఖపట్నంలో ఎంబీబీఎస్ చేశారు. డాక్టరుగా ప్రాక్టీసు చేశారు. బహుశా విభిన్న మనస్తత్వం కలిగిన ఓ స్నేహితురాలిని చాలా దగ్గరగా చూసైనా ఈ నవల రాసుండాలి లేదా పురుషాధిక్యత సమాజాన్ని ప్రశ్నించడం కోసమే కావాలనే ఇందిర పాత్రను తీర్చిదిద్ది ఉండాలి. ♦️అసలు ఎవరీ ఇందిర ? ఆమె ఆధునిక స్త్రీకి ఉదాహరణ అని మనం చెప్పగలమా. ఆమె పొగరు, మొండితనం, మొక్కవోని పట్టుదల,

🚩 🚩-రామదాసు కీర్తన.(2) #ఇక్ష్వాకు కులతిలక ఇకనైన పలుకవె..!

Image
  పల్లవి: ❤️♦️ఇక్ష్వాకు కులతిలక ఇకనైన పలుకవె రామచంద్రా నన్ను రక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్రా ఇ.. చరణము(లు): ♦️చుట్టుప్రాకారములు సొంపుగ చేయిస్తి రామచంద్రా ఆ ప్రాకారమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా ఇ.. గోపురమంటపాలు కుదురుగ గట్టిస్తి రామచంద్రా నను క్రొత్తగ జూడక నిత్తరిబ్రోవుము రామచంద్రా ఇ.. ♦️భరతునకు చేయిస్తి పచ్చలపతకము రామచంద్రా ఆ పతకమునకుబట్టె పదివేల వరహాలు రామచంద్రా ఇ.. ♦️శత్రుఘ్నునకు నేను చేయిస్తి మొలత్రాడు రామచంద్రా ఆ మొలత్రాడునకు బట్టె మొహరీలు పదివేలు రామచంద్రా ఇ.. ♦️లక్ష్మణునకు జేయిస్తి ముత్యాలపతకము రామచంద్రా ఆ పతకమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా ఇ.. ♦️సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్రా ఆ పతకమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా ఇ.. ♦️వాహనములు మీకు వరుసతో జేయిస్తి రామచంద్రా జగ న్మోహన సంకెళ్ళు వేసిరి కాళ్ళకు రామచంద్రా ఇ.. ♦️కలికితురాయి నీకు పొలుపుగ జేయిస్తి రామచంద్రా నీవు కులుకుచు దిరిగెద వెవరబ్బసొమ్మని రామచంద్రా ఇ.. ♦️మీ తండ్రి దశరథమహారాజు పెట్టెనా రామచంద్రా లేక మీమామ జనకమహారాజు పంపెనా రామచంద్రా ఇ.. ♦️అబ్బా తిట్టితినని యాయాసపడవద్దు రామచంద్రా ఈ దెబ్బలకోర్వక అబ్బ తి

🌹మన సాహితీ ప్రముఖులు (8)🌹 🙏శ్రీ. చలం గారు.🙏

Image
  మన సాహితీ ప్రముఖులు (8) శ్రీ. చలం గారు. నా చూపులో కట్టుబడి నీ చూపును ఆపు నీ చూపు కదిలిందా నీ మనసు కదులుతుంది నీ మనసు కదిలిందా ప్రపంచాలే కదులుతాయి.!! చలం!! చలం సుప్రసిద్ధ తెలుగు రచయిత, వేదాంతి మరియు సంఘసంస్కర్త. చలం 1894లో జన్మించి 1979లో మరణించాడు. ఆధునిక తెలుగు సాహిత్యాన్ని ప్రభావిత పరచిన అతి ముఖ్య వ్యక్తుల్లో చలం ఒకడు. అతని రచనల నుండి కొన్ని వ్యాఖ్యలు... స్త్రీ ఒక మాట వల్ల,చూపు వల్లా పురుషునికి సందిచ్చిందా....ఇక అతని అధికారానికి, కోరికలకి, విన్నపాలకి అంతం ఉండదు. "స్త్రీ జీతంలేని సంఘ బానిస" బుద్ధిని ఆడించడానికి మనసు చేసే గారడీ.......ప్రేమ! సృష్టి ప్రారబ్ధం వల్ల పురుషుడి మీద ఆకర్షణ .. మనసు ధిక్కారం వల్ల అతని మీద అసహ్యం.. చదువువల్ల రొమాన్స్ లో విశ్వాసం..ఆ చదువు చెప్పే నీతి వల్ల శరీర సంపర్కం నీచం. అలా ఆమెలో జరిగే విరోధాల వల్ల చాలా వికృతంగా తయ్యారయింది నేటి స్త్రీ. " పురుషుడి సౌఖ్యం కన్నా..తమ సౌఖ్యం కన్నా..మొహం కన్నా..కలయిక కనా..తామే అధికులమని గర్వం రాయి కట్టిస్తుంది స్త్రీ ని. తమని ఇచ్చుకునే గుణం వాళ్ళనుంచి సంతృప్తి దొరకదు. " అరణ్యానికి పోయి బ్రతుకు పాడుచేసుకున్న

🚩🚩=అసమర్ధుని జీవయాత్ర నవల సమీక్ష=🚩🚩 ( త్రిపురనేని గోపీచంద్ .)

Image
 🚩🚩=అసమర్ధుని జీవయాత్ర నవల సమీక్ష=🚩🚩              ( త్రిపురనేని  గోపీచంద్ .)                                    (వింజమూరి .5.)              ♦️ప్రముఖ నాస్తిక వాది, హేతు వాది అయిన త్రిపురనేని రామ స్వామి చౌదరి గారి కుమారుడు గోపీచంద్ 1945--46 మధ్య ఈ నవల రచించాడు.ఇది అసమర్థుడు,అసమర్థుని భార్య, అసమర్ధుని మేనమామ, అసమర్థుని ప్రతాపం, అసమర్ధుని అంతం అనే అయిదు ఉప శీర్శికలతో రాయబడిన మనో వైజ్ఞానిక నవల.తెలుగు నవలా సాహిత్యం లో ఒక ప్రసిద్ధ రచనగా కొనియాడబడుతోంది. ♦️ప్రతి మనిషికి తనదైన ఒక వ్యక్తిత్వం ఉంటుంది. ఈ నవలలో కథా నాయకుడు సీతా రామారావు పాత్ర తన ఆదర్శాలకు ఊహలకు,వాస్తవ జీవితానికి మధ్య సమతుల్యత కోల్పోయి ,పరి స్థితులకు తగిన సర్దుబాటు చేసుకోలేక తనను తాను అంతం చేసుకునే విచిత్రమైన వ్యక్తిత్వానికి ప్రతీకగా నిలబడింది. ప్రతి మనసులోనూ ఇలాంటి సీతారామారావులు ఉంటారు.ఆ విషయాన్ని ఈ నవల చాలా బలంగా చెప్పింది.                                   (వింజమూరి .5.) ♦️"సీతారామారావు జీవితం విచిత్రమైనది.ఉన్నత శిఖరాగ్రం నుండి స్వచ్ఛ మైన జలంతో భూమి మీద పడి మలినాన్ని కలుపుకొని మురికి కూపం లోకి ప్రవహించే సెలయేటిని జ్ఞప్

🌹పాకుడురాళ్ళు-డాక్టర్ రావూరి భరద్వాజ 🌹

Image
  🚩🚩నేల రాలిన తారల కధ .🚩🚩                 (వింజమూరి -4) ♦️పాకుడురాళ్ళు రావూరి భరద్వాజ విశిష్టమైన నవలా రచన. చలనచిత్ర పరిశ్రమను వస్తువుగా చేసుకొని తెలుగులో వెలువడిన మొట్టమొదటి నవల పాకుడురాళ్లు. #భరద్వాజ దీనికి మాయ జలతారు అని నామకరణం చేశాడు. అయితే శీలా వీర్రాజు పాకుడురాళ్లు అనే పేరు పెట్టాడు. మల్లంపల్లి సోమశేఖరశర్మ, ముదిగొండ సుబ్రహ్మణ్యశర్మ ల ప్రోత్సాహంతో రావూరి భరద్వాజ తాను అంతకుమునుపే వ్రాసిన #పాలపుంత' అనే ఓ పెద్ద కథని పాకుడురాళ్లు నవలగా వ్రాశాడు. ఈ నవల మూడు సంవత్సరాలపాటు కృష్ణా పత్రిక లో ధారావాహికగా వెలువడినది. ఈ పాకుడురాళ్లు నవలపై శ్రీకృష్ణదేవరాయ, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరిగాయి ఈ నవల రాసినందుకు రావూరికి 2013 లో సాహిత్యంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. ఈ పాకుడు రాళ్ళు వంటి సినీ ప్రపంచం నుండి జారి పడి, నేల రాలిన తారలని కాసేపు ఇక్కడ గుర్తు చేసుకుందాం. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హాలీవుడ్ నటి #మార్లిన్ మన్రో స్లీపింగ్ పిల్స్ వేసుకుని చనిపోవడం మనకందరికీ తెలిసిందే!(వింజమూరి -4) ♦️పాకీజా లాంటి అద్భుత కళాఖండంలో నటించిన #మీనా కుమారి తాగుడుకి బా

🚩🚩-'స్వర్గానికి నిచ్చెనలు'. (నవల.) -🚩🚩 (విశ్వనాథ సత్యేనారాయణ )

Image
  ♦️'స్వర్గానికి నిచ్చెనలు'. ఇది ఒక చిత్రమైన నవల. మతము పేరకూడాను, దుర్జనులు ఇతరులను వంచింతురు. ఇతరులను వంచించుట ఈ లోకమునం దొక మహావిద్య, అదొక శిల్పము. ఈ శిల్పవేత్తల సంఖ్య అనంతము. దేవుడు లేడని వంచింతురు. ఉన్నాడని వంచింతురు. ఒక మహా విషయమును, అది మహావిషయము కాదని ఇతరులను వంచింతురు. ఈ వంచకులలో ప్రధానముగా రెండు రకాలు. మొదటి రకము - అది వంచన అని తెలిసి, దోషము కానిదానిని దోషమని చెప్పును. రెండవ రకము దీని తలలో జేజెమ్మ. ఆ రకమునకు అది యథార్థమని తెలియదు. అది యథార్థము కాదని చెప్పుచుండును.                                   (వింజమూరి.3) మరి వంచన ఏమి యున్నది? మూలవస్తువే వంచన. వంచన యొక్క సగము దోషము చేసెడి పద్ధతిలో నుండును. ప్రచారములో నుండును. తనకిష్టము లేనిదానిని దుమ్మెత్తిపోయుటలో నుండును. పదిమందిని కూడగట్టుకొని లోకమును ప్రతారించుటలో నుండును. ఈ 'స్వర్గానికి నిచ్చెన'లన్న నవల దైవము అన్న విషయములో ఆస్తికుల మనువారు చేసెడి వంచన సర్వస్వము ఉన్నది. ♦️‘స్వర్గానికి నిచ్చెనలు’ లో వసుంధర మరియు ఆమె కుటుంబసభ్యులు తమను తాము అత్యాధునికులుగా భావించుకుంటుంటారు. ఇద్దరు అన్నదమ్ములకు కులాంతర, మతాంతర వివాహాలు జర

🚩🚩-చెలియలి కట్ట - (విశ్వనాథ సత్యనారాయణ)

Image
  🚩🚩-చెలియలి కట్ట - (విశ్వనాథ సత్యనారాయణ) ♦️విశ్వనాథ సత్యనారాయణ 1935లో వ్రాసిన నవల. చలం వ్రాసిన మైదానం నవలను ఖండిస్తూ రాసిన నవలగా ఇది తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి చెందింది. మొట్టమొదట ఇది ఆంధ్రపత్రికలో ధారావాహికగా వెలువడింది. ♦️మైదానం నవలను చలం 1925లో రాశారు. ఆ నవలలో భావాలు విశృంఖలతకు దారితీస్తాయంటూ కొందరు సంప్రదాయానుకూలురు ఆక్షేపించారు. అయితే కట్టుబాటు లేని స్వేచ్ఛ ప్రమాదకరమని అది వ్యక్తినీ, సంఘాన్నీ పతనం వైపుకు నడిపిస్తుందని విశ్వనాథ సత్యనారాయణ వ్రాసిన ఈ చెలియలి కట్ట నవల మైదానాన్ని ఖండిస్తూ రాసిందనే భావిస్తూంటారు. మైదానం వెలువడ్డ పది సంవత్సరాలకు విశ్వనాథ సత్యనారాయణ చెలియలికట్ట వెలుగుచూసింది. నవలను విశ్వనాథ సత్యనారాయణ 1935లో రచించారు. ♦️నవలను విశ్వనాథ సత్యనారాయణ చలం రాసిన మైదానం నవలకు వ్యతిరేకంగా వ్రాశారని పలువురు పేర్కొన్నారు. మైదానం నవలలో అమీర్-రాజేశ్వరి జంటలాగానే రత్నావళి-రంగడు జంటను ఏర్పరిచి వారి ద్వారా చివరకు మైదానంలో ప్రతిపాదించిన విలువలు మన సమాజానికి పనికిరావని చెప్పించారంటూ సాహిత్య విమర్శకులు భావించారు. ♦️పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే నవలలో తనకన్నా తక్కువ జ్ఞానం ఉన్నవారిని తమ వాక్చ

🚩🚩-మాబాబు (నవల) (విశ్వనాథ సత్యనారాయణ.

Image
  ) మాబాబు   విశ్వనాథ సత్యనారాయణ   రచించిన నవల. ఇతివృత్తం ప్రధానంగా   గుంటూరు జిల్లాలోని   పల్నాడు ప్రాంతంలో   1920ల్లో సాగినట్టు ఉంటుంది. నవలలోని పాత్రలు వేటికీ పేర్లుండవు. కథానాయకుడు పుట్టకముందే తండ్రిని, పుట్టడంతోనే తల్లిని పోగొట్టుకున్న అనాథ. కథ! ఈ నవలలో కథానాయకుడు ఉత్తమ పురషలో తానే "నేను" అని కథ చెబుతాడు. ఈ కథలో కథానాయకునితో సహా ఎవరికీ పేర్లు ఉండవు. అతను పుట్టుకతో తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ. అతనిని తన పినతల్లి తీసుకెళ్ళింది కానీ ఆమె కుటుంబంలో ఆమె మాటకు విలువ లేకపోవడంతో అతను పిల్ల పాలేరుగా ఆ ఇంట్లో పెరిగాడు. ఏడేళ్ళ వయసులో ఆ ఇంటినుండి పారి పోయి అనేక ఊళ్ళు తిరుగుతో పోతే ఒక గ్రామంలో తనను దొంగ అనుకుని చచ్చేట్లు కొట్టి గుంజకు కడతారు. మర్నాడు ఆ గ్రామంలో మోతుబరి రైతు అతనిని చూసి జాలిపడి తన ఇంటికి తీసుకొని పోయి ఆశ్రయమిస్తాడు. ఆ పెద్దాయనను అతను "బాబు" అని పిలుస్తాడు. ఆ పెద్దాయన పేరే ఈ నవల శీర్షిక "మా బాబు". ఆ పెద్దాయన కుటుంబం తనకు దయతో చూస్తుంది. ఆ పిల్లాడు సహజంగా ప్రతిభావంతుడు కావడంలో రెండేళ్ళలో వ్యవసాయం, వ్యవహారాలు, కొంత చదువు నేర్చుకుని పెద్దాయనకు సహాయంగా