🚩🚩-వేయిపడగలు-నవల ( విశ్వనాథ సత్యనారాయణ.)


 🚩🚩-వేయిపడగలు-నవల
               ( విశ్వనాథ సత్యనారాయణ.)
                             (వింజమూరి .7.)
✍️✍️ఈ నవలను విశ్వనాధ సత్యనారాయణ ఆశువుగా చెబుతుండగా అతని తమ్ముడు వేంకటేశ్వర్లు వ్రాశారు. 1934లో సరిగ్గా 29 రోజుల్లో 999 అరటావుల మీద వ్రాశాడు. ఆనాడు ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు ప్రకటించిన పోటీ కోసం వ్రాయబడి బహుమతినందుకుంది. 1937-38లలో ఆంధ్రపత్రిక సచిత్ర వార పత్రికలో ధారావాహికగా ప్రచురింపబడింది. స్వర్ణోత్సవ సందర్భంగా తిరిగి 1987-88లో ఆంధ్ర పత్రికలోనే ప్రచురించారు.
♦️గుంటూరు ఏ.సి. కాలేజిలో మత సంబంధమైన ఒక వ్యాఖ్యకు సంబంధించిన వివాదంలో విశ్వనాధ తన ఉద్యోగాన్ని వదులుకోవలసివచ్చింది. ఆ ఉద్యోగం పోయి మరొక ఉద్యోగంలో చేరని దశలో ఈ నవల వ్రాయబడింది. నవలలో చెప్పబడిన ధార్మిక సాహిత్య వాద ప్రతివాదాలు విశ్వనాధ జీవితంలో ఇతరులతో జరిగిన విభేదాలను చాలావరకు ప్రతిబింబిస్తాయి.
♦️ఈ నవల విశ్వనాధ స్వీయానుభవాల సారాంశం అని, అందులోని పాత్రలలో ఆయన కుటుంబం, దగ్గరి సమాజం ఛాయలు గోచరిస్తున్నాయని పలువురు పరిశీలకులు అభిప్రాయపడ్డారు.
♦️స్థలాల స్వారూప్యం ఇలా చెబుతారు [- (వింజమూరి .7.)
సుబ్బన్నపేట - నందమూరు, తోట్లవల్లూరు;
వేణుగోపాలస్వామి ఆలయం - విశ్వేశ్వరస్వామి ఆలయం; కృష్ణమనాయుడు - నూజివీడు జమీందారు ధర్మ అప్పారావు, రంగయ్యప్పారావు; రామేశ్వర శాస్త్రి - విశ్వనాధ తండ్రి శోభనాద్రి; ప్రధాన పాత్ర ధర్మారావు - విశ్వనాధ సత్యనారాయణే; సూర్యపతి - కొల్లిపర సూరయ్య చౌదరి; కుమారస్వామి - కృష్ణా జిల్లా కపిలేశ్వరపురం కరణం అగస్త్యరాజు రాఘవరావు;
కేసవరావు - కోపెల్ల హనుమంతరావు; రుక్మిణమ్మరావు - ముట్నూరి కృష్ణారావు శ్రీమతి; నాయరు - బందరులోని ఒక కిళ్ళీకొట్టు ఓనరు;
♦️కథా విశేషాలలోకెళితే ఒక గొల్లవాడి దగ్గరుండే ఒక ఆవు ఇచ్చే అపారమైన పాల వలన అతడు ఏ చీకూ చింతా లేక జీవిస్తుంటాడు. అయితే కొద్ది రోజులుగా ఆవు సాయంకాలం పాలివ్వడం మానేయ్యడంతో ఒక రోజు కాపరి దానిని అనుసరించి వెళతాడు. సాయంకాల సమయానికి గోవు మందకు దూరంగా పోతుంతే దానిని అనుసరించి వెళ్ళిన అతడు గోవు ఒక పుట్టవద్దకు నడచి దానిపై ఆగటం అందునుండి ఒక తెల్లని సర్పం వచ్చి గోవు పొదుగునుండి పాలు త్రాగటం చూస్తాడు. అయితే అతడు చూస్తున్నది నిజమో కాదో తెలియనట్టుగా ఆసర్పమునకు అనేక శిరసులు కనిపిస్తాయి. ఆ రాత్రి అతడి కలలో కనబడిన ఆసర్పము తనకు అక్కడ దేవాలయం నిర్మించవలసినదిగా చెప్పి మాయమవుతుంది. తదనంతరం అక్కడ ఒక గ్రామం వెలసి విలసిల్లి తధనంతరం ఎలా శిథిలమయిందనే దానిని కథకు మూలంగా చెపుతూ కొన్ని ముఖ్యపాత్రల ద్వారా కథను కొంచెం మెల్లగా అప్పటి స్థితి గతులను తెలియ జేస్తూ సాగించారు.
కథలో ముఖ్య పాత్రధారులు
దేవదాసి
ధర్మారావు
రంగారావు
గణాచారి
♦️ఆధునికుల మహాభారతం గా గౌరవింపబడే ఈ నవల
ముఖ్యంగా ధర్మా రావు అనే వ్యక్తి జీవిత నైపధ్యం గ సాగుతుంది. అతను జీవితకాలం లో అనుభవించిన అనేక పరిస్థితుల్ని వివరిస్తూ ,ధార్మికంగా అతను ఎలా నడుచుకున్నాడో, అందరు ఎలా నడుచుకోవాలో అర్థమయ్యేలా వివరిస్తుంది.
♦️ధర్మా రావు,ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి,
రామేశ్వర శాస్త్రి అనే ఒక పెద్ద ధర్మాత్ముడి కుమారుడు, తండ్రి దాన ధర్మాల వాళ్ళ ఆస్థి అంత నష్టపోయినా, అయన నేర్పిన ధర్మ మార్గం లో జీవితాన్ని కొనసాగిస్తూ, తన జ్ఞాన సంపద అవసరమైన వద్ద పంచుతూ, జీవితాన్ని కొనసాగిస్తాడు.లౌకికమైన పోకడలు తెలుగు సంస్కృతి ఆచారాల్ని పక్క దారి పట్టిస్తుంటే సమర్దించనందుకు ఉద్యోగం పోయినా, చలించని గొప్ప మనస్తత్వం కలవాడు.తన అపారమైన జ్ఞాన సంపద ద్వారా భగవంతుడికే అంకితమవ్వాలి అనుకున్న దేవదాసి ధ్యేయానికి సహకారం అందించి ఆమెకి మోక్షం కలిగించేలా చూస్తాడు.
♦️ఇది వివరంగా అర్థమవ్వాలి అంటే ఆ నవల సారం చదవాలి. తన స్నేహితులకి చేతనైన సహకారం అందించే విషయాలు చాల వివరంగా చెప్పబడ్డాయి. ఈ నవల చదివిన తరవాత సంబంధాలు ఎంత సున్నితమైనవో , స్నేహం ఎంత మధురమైన సంబంధమో అన్న భావన కచ్చితంగా కలుగుతుంది. ఆధునిక జీవితం లో మనందరికీ అవసరైమా ఎన్నో విషయాలు ఇందులో పలు సన్నివేశాల రూపం లో ప్రస్తావింపబడ్డాయి.
♦️ఈ నవలలో ఈ కాలానికి ఉపయోగపడే కొన్ని ముఖ్య సందేశాలు కొన్ని పాత్రల ద్వారా పరోక్షంగా చెప్పబడినవి:
1 .ధర్మా రావు - మనము ధర్మాన్ని కాపాడితే ధర్మం మనలని రక్షిస్తుంది.
2 .అరుంధతి -ప్రేమ చాల పవిత్రమైనది.దాంపత్య ధర్మం చాల గౌరవింప బడేది.
3 .గిరిక -సంకల్పం ఎంత గొప్పగా ఉంటె విజయం అంత గొప్పగా వరిస్తుంది. విజయం సాధించడానికి సమయం పట్టవచ్చు కానీ ప్రయత్నం చేస్తూనే ఉండాలి
4 హరప్పా -గురువు మాట వేదవాక్కు వంటిది.తమ జీవిత ధర్మం ప్రతిఒక్కరు ఆచరించాలి.
5  మంగమ్మ- తెలిసి చేసినా,తెలియక చేసినా, తప్పు చేస్తే, అనుభవించక తప్పదు.
6 .రామేశ్వరం -మంచి చెడుల  పోరు లో అంతిమ విజయం మంచిదే.
♦️గణాచారి పాత్ర ద్వారా సనాతన ధర్మ విషయాలని సున్నితంగా వివరింపడింది. అంతేకాదు ఈ నవలలో విషయాలు ,పాత్రలు ఎంత గొప్పవి అంటే , ఎపుడో రాయబడిన ఈ నవల లో వివరించిన విషయాలే మన  తెలుగు లో ఎన్నో హిట్ సినిమాలు వచ్చాయి అని నాకు అర్థమైంది. అంత గొప్ప సందేశాత్మక నవల ఈ వేయిపడగలు, ప్రతిఒక్కరు చదివితే ఎంతో విజ్ఞానం,వివేకం అంతకన్నా మంచి నుభవం తప్పకుండా కలుగుతుంది.
♦️ముఖ్యంగా ఈ జెనెరేషన్ లో టెక్నాలజీ మనుషుల మధ్య దూరం పెంచుతుంది.ఇలాంటి నవలలు మనుషుల్ని మనసులు లోతుల్లో ఉన్న బంధాల గురించి ఆలోచింపచేస్తుంది.వేయిపడగలు అంటే మనిషి మనసులో స్పృశించే వెయ్యి భావాలూ, ఒక్కో భావానికి అనేక అంతరంగాలు, అవి మిగిలినుంచే వేయి అనుభవాలు.
 (వింజమూరి .7.)    
                            ♦️♦️♦️♦️♦️

Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩