❤️అథ శ్రీ లలితా సహస్రనామావలీ .❤️ (శ్లోకాలు.....1 నుండి 10 వరకు.)

 


                                                           🌹🌺శుభోదయం .🌺🌹
                                     👉👉ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః 👈👈
                                             ❤️అథ శ్రీ లలితా సహస్రనామావలీ .❤️
                                                (శ్లోకాలు.....1 నుండి   10 వరకు.)
శ్లోకం 01
♥️♦ఓం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః |
ఓం శ్రీమహారాజ్ఞై నమః |
ఓం శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః |
ఓం చిదగ్నికుండసంభూతాయై నమః |
ఓం దేవకార్యసముద్యతాయై నమః |

🚩🚩
♦శ్రీమాతా : మంగళకరమైన, శుభప్రథమైన తల్లి.
♦శ్రీమహారాజ్ఞీ : శుభకరమైన గొప్పదైన రాణి.
♦శ్రీమత్సింహాసనేశ్వరీ : శోభతో కూడిన శ్రేష్టమైన ఆసనమును అధిష్ఠించింది.
♦చిదగ్ని కుండ సంభూతా : చైతన్యమనెడి అగ్ని కుండము నుండి చక్కగా ఆవిర్భావము చెందినది.
♦దేవకార్య సముద్యతా : దేవతల యొక్క కార్యములకై ఆవిర్భవించింది.
🚩🚩
శ్లోకం 02
♦ఓం ఓం ఉద్యద్భానుసహస్రాభాయై నమః |
ఓం చతుర్బాహుసమన్వితాయై నమః |
ఓం రాగస్వరూపపాశాఢ్యాయై నమః |
ఓం క్రోధాకారాంకుశోజ్జ్వలాయై నమః |
🚩🚩
♦ఉద్యద్భాను సహస్రాభా : ఉదయించుచున్న వెయ్యి సూర్యుల యొక్క కాంతులతో సమానమైన కాంతి కలది.
♦చతుర్బాహు సమన్వితా : నాలుగు చేతులతో కూడినది.
♦రాగస్వరూప పాశాఢ్యా : అనురాగ స్వరూపముగా గల పాశముతో ఒప్పుచున్నది.
♦క్రోధాకారాంకుశోజ్జ్వలా : క్రోధమును స్వరూపముగా గలిగిన అంకుశముతో ప్రకాశించుచున్నది.
శ్లోకం 03
♥️♦ఓం మనోరూపేక్షుకోదండాయై నమః | 
ఓం పంచతన్మాత్రసాయకాయై నమః |
ఓం నిజారుణప్రభాపూరమజ్జద్ బ్రహ్మాండమండలాయై నమః |
🚩🚩
♦మనో రూపేక్షు కోదండా : మనస్సును రూపముగా గల్గిన చెఱకుగడ విల్లును ధరించింది.
♦పంచతన్మాత్ర సాయకా : ఐదు తన్మాత్రలు అను బాణములు ధరించింది.
♦నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండలా : తన సహజమైన ఎఱ్ఱని కాంతుల నిండుదనమునందు మునుగుచూ వున్న బ్రహ్మాండముల సముదాయము కలది.
శ్లోకం..4
♥️♦ఓం చంపకాశోకపున్నాగసౌగంధిక-లసత్కచాయై నమః |
ఓం కురువిందమణిశ్రేణీకనత్కోటీరమండితాయై నమః |
🚩🚩
♦చంపకాశోక పున్నాగ సౌగంధికలసత్కచా : సంపంగి, అశోక, పున్నాగ, చెంగల్వ పుష్పముల చేత ప్రకాశించుచున్న శిరోజ సంపద కలిగినది.
♦కురువిందమణిశ్రేణి కనత్కోటీర మండితా : పద్మరాగముల వరుసచేత ప్రకాశించుచున్న కిరీటముచే అలంకరింపబడిందిఓం 
శ్లోకం 05.
♥️♦ఓం అష్టమీచంద్రవిభ్రాజదలికస్థలశోభితాయై నమః |
ఓం ముఖచంద్రకలంకాభమృగనాభివిశేషకాయై నమః |
🚩🚩
♦అష్టమీ చంద్రవిభ్రాజ దళికస్థల శోభితా : అష్టమినాటి చంద్రుని వలె ప్రకాశించుచున్న పాలభాగముచే పవిత్రమైన సౌందర్యముతో అలరారుచున్నది.
♦ముఖచంద్ర కళాంకాభ మృగనాభి విశేషకా : ముఖము అనెడి చంద్రునియందు మచ్చవలె ఒప్పెడు కస్తురి బొట్టును కలిగినది.
శ్లోకం 06
♥️♦ఓం వదనస్మరమాంగల్యగృహతోరణచిల్లికాయై నమః |
ఓం వక్త్రలక్ష్మీపరీవాహచలన్మీనాభలోచనాయై నమః |
🚩🚩
♦వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికా : ముఖమనెడు మన్మథుని శుభమైన నివాసమునకు తోరణమువలె ఒప్పు కనుబొమలు కలిగినది.
♦వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచనా : ముఖదీప్తి అనెడు సంపదప్రథమైన స్రోతస్సునందు కదలాడుచున్న చేపలవలె ఒప్పుచుండు కన్నులు కలిగినది.
శ్లోకం  7
♥️♦ఓం నవచంపకపుష్పాభనాసాదండవిరాజితాయై నమః |
ఓం తారాకాంతితిరస్కారినాసాభరణభాసురాయై నమః | 
🚩🚩
♦నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితా : క్రొత్తగా వికసించుచున్న సంపెంగ పువ్వును పోలెడు ముక్కుదూలముతో ప్రకాశించునది
♦తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా : ఆకాశములో ప్రకాశించునట్లు కనబడు చుక్కల యొక్క కాంతిని తిరస్కరించుచున్న ముక్కు బులాకీ చేత ప్రకాశించునది.
శ్లోకం 8
♥️♦ఓం కదంబమంజరీక్~లుప్తకర్ణపూరమనోహరాయై నమః |
ఓం తాటంకయుగలీభూతతపనోడుపమండలాయై నమః |
🚩🚩
♦కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరా : కడిమి పూల గుచ్చముల చేత కూర్చబడిన చెవులపై సింగారించుకొను ఆభరణములచే మనస్సును దోచునంత అందముగా నున్నది.
♦తాటంక యుగళీభూత తపనోడుప మండలా : చెవి కమ్మలుగా జంటగా అయిన సుర్య చంద్ర మండలమును గలది.
శ్లోకం 09
♥️♦ఓం పద్మరాగశిలాదర్శపరిభావికపోలభువే నమః |
ఓం నవవిద్రుమబింబశ్రీన్యక్కారిరదనచ్ఛదాయై నమః 
🚩🚩
♦పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూః - పద్మరాగ మణుల అద్దమును పరిహసించు చెక్కిళ్ళ యొక్క ప్రదేశము గలది.
♦నవవిద్రుమ బింబ శ్రీ న్యక్కారి రథనచ్ఛదా - కొత్తదైన పగడముల యొక్క దొండపండు యొక్క శోభను తిరస్కరించు పెదవులు గలది.
|శ్లోకం..10
♥️♦ఓం శుద్ధవిద్యాంకురాకారద్విజపంక్తిద్వయోజ్జ్వలాయై నమః |
ఓం కర్పూరవీటికామోదసమాకర్షి దిగంతరాయై నమః |
🚩🚩
♦శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తిద్వయోజ్జ్వలా - శుద్ధమైన విద్య అనగా బ్రహ్మ విద్య లేదా శ్రీవిద్యకు బీజప్రాయము వలె ఆకారము గల రెండు జన్మలు కలిగిన లేదా పండ్ల యొక్క రెండు వరుసలచే ప్రకాశించునది.
♦కర్పూర వీటికామోద సమాకర్షద్దిగంతరా - కర్పూరపు తాంబూలము యొక్క సువాసన లేదా పరిమళమును చక్కగా గ్రహించుచున్న దిగంతముల వరకు ఆవరణములు గల
🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐