😀😀 ఒక క్లాసు పీకుడు.😀😀





                            😀😀 ఒక  క్లాసు  పీకుడు.😀😀

♥️♦️ఎల్ ఎల్ బీ క్లాస్ జరుగుతోంది ....
సునీల్ : " ఈ కమలా పండుని స్వీకరించండి "
ప్రొఫెసర్ : " లేదు .... ఒక లాయరు ఎలా చెపుతాడో అలా ... చెప్పు "
♦️సునీల్ : " సునీల్ అనబడే నేను, సత్యమూర్రి కుమారుడను, బెంగుళూరు, కర్నాటక వాస్తవ్యుడను .... ఇందుమూలంగా గట్టిగా నొక్కి‌ వక్కాణించి, ఎలాంటి అనుచిత మత్తు ప్రభావం లేదా ఒత్తిడి లేదా ఎటువంటి భయం లేకుండా, ఉద్దేశపూర్వకంగా దృవీకరీంచి ... నేను స్వచ్చందంగా, బహిర్గత పరచునది ఏమనగా... కమలా పండు అని పిలవబడే పండుని, తొక్క, రసం, దానిలోని విత్తులూ, గుజ్జు సహితంగా దేనిమీదనయితే నాకు మాత్రమే సంపూర్ణ హక్కులూ, టైటిల్ గలవో ... దానిని మీకు ... కోసుకోడానికీ, తినడానికీ లేదా మీరు బద్రపరచుకోడానికి గాని నాకుగల సర్వహక్కులను మీకు దారపోస్తూ స్వాదీన పరుస్తున్నాను.
♦️ఈ రోజులగాయితూ, మీరు ... ఈ కమలాపండుని దానిలోని విత్తులూ, గుజ్జు సహితంగా ... మీకు‌ నచ్చినవారికి స్వాదీనపరచు హక్కులని కూడా మీరు పోందుతున్నారు.
♦️ఈ కమలాపండుకు సంబంధించిన నేటి వరకు ఉన్న అన్ని బాద్యతలనూ నేను మాత్రమే భరిస్తూ ఈ కమలాపండు నేటివరకూ ఎటువంటి వివాదానికీ లోనుకాలేదనీ, ఉద్గాటిస్తూ 
.... ఈ రోజునుండి, ఇకపై నాకూ ఈ కమలాపండుకీ ఏటువంటి సంబంధ బాందవ్యాలు గానీ బాద్యతలుగానీ, ఎటునంటి హక్కులుగానీ లేవనీ ... 
ఇందుమూలంగా దృవీకరిస్తున్నాను...
😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇

ప్రొఫెసర్ : " మీరు నాకు ఒక కమలా పండుని ఇవ్వవలసి వస్తే ... ఏమని చెప్తారు? "

Comments

Popular posts from this blog

#శృంగార_నైషధం_శ్రీనాథుని_అద్భుత_రచన!!

🚩🚩 ఇది కథా…నిజమా…?-..ఫల ప్రదో భవేత్ కాలే.... ➖➖➖✍️

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐