🚩🚩జైమిని మహర్షి - ఆయన భారతము !



♦భారతమంటే కృష్ణ ద్వైపాయునుడనే వేదవ్యాసుడు గుర్తుకు వస్తాడు జయమనే పేరుతో తాను కీలక పాత్ర వహించిన భారథ కథను 8000 శ్లోకాలలో రచించాడు.

♦నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీ సరస్వతీమ్ వ్యాసః తథోజయ ముదీరయేత్ అని ప్రారంభిస్తూ ఆయన వద్ద ఆకథను వి

న్న ఆయన శిష్యులు వైశంపాయనుడు, జైమిని తరువాత కొన్ని సంవత్సరాలకు దానిని విస్తరించి విడివిడిగా భారత ఇతిహాసాన్ని నిర్మించారు.

♦ఇద్దరూ పరీక్షిత్తు కుమారుడైన జనమేజయునకు ఈ కథను వివరించారు. జైమిని భారతంలో ఇప్పుడు అశ్వమేధ పర్వమే లభిస్తున్నది. వైశంపాయనుని కృతినే వ్యాస భారతంగా వ్యవహరిస్తారు.

♦వ్యాసునకు జైమినితోనూ వైశంపాయనునికి తన శిష్యుడైన యాజ్ఞవల్క్యునితోనూ భేదాభిప్రాయాలు వస్తాయి.

♦వైశం పాయనునికి యజుర్వేదం జైమినికి సామవేదం ఇస్తాడు వ్యాసుడు. జైమిని భారతాన్ని తన దృష్టి కోణం నుండి వ్రాస్తే యాజ్ఞవల్క్యుడు తన గురువు చెప్పిన యజుర్వేదాన్ని వదలి సూర్యుని నుండి శుక్ల యజుర్వేదాన్ని గ్రహిస్తాడు.

♦జనమే జయుడు రెండవ వేదం ఆధారంగా అశ్వమేధం చేస్తాడు. ఇక్కడ చాలా మానవ సహజమైన భేదాభిప్రాయాలు కనిపిస్తాయి. ఈ ఋషుల గాధలు సద్గురు శివానంద మూర్తి గారి మార్గ దర్శకులు మహర్షులలో చదువుకో వచ్చు. మనకి సప్త మహర్షులనీ, మన మన గోత్ర ఋషులనీ తలుచుకోవడం మంచిది.

Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩