🚩🚩విష్ణువు.🚩🚩

🚩🚩విష్ణువు.🚩🚩

#ఎవ్వనిచే జనించు జగ మెవ్వనిలోపల నుండు లీన మై
యెవ్వనియందు డిందు పరమేశ్వరు డెవ్వడు మూలకారణం
బెవ్వ డనాది మధ్య లయు డెవ్వడు సర్వము దాన యైన వా
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్‌
ఇది పోతన గారి భాగవతంలో గజేంద్ర మోక్షణంలో పద్యం. తెలుగు పిల్లలు బడికి వెళ్ళే వయసు రాకముందే ఇంట్లో అమ్మో, అమ్మమ్మో నేర్పించిన పద్యాల్లో ఈ పద్యం తప్పనిసరిగా ఉంటుంది. తేలిగ్గా నోటికి తిరిగి, బట్టీ పట్టటానికి సులువైన పద్యం. సాధారణంగా పద్యం నేర్చుకున్న కొత్త రోజుల్లో చిన్న పిల్లలందరూ పద్యం ఒక్క గుక్కలో అప్పజెప్పడం కద్దు.
#భాగవతం గజేంద్ర మోక్షం ఘట్టంలో గజేంద్రుని ప్రార్థన (నిరాకార) పరబ్రహ్మమును ఉద్దేశించి చేసినట్లు కనిపిస్తుంది. కాని విష్ణువు ఆ మొర ఆలకించి గజరాజును రక్షించడానికి పరుగున వచ్చాడు. అనగా ఆ ప్రార్థనలో చెప్పిన లక్షణాలు విష్ణువుకు అన్వయిస్తాయనుకోవచ్చును - అవి -
జగం ఎవనిచే జనిస్తుంది? ఎవ్వనిలో ఉంటుంది? ఎవ్వనిలో అంతమవుతుంది?
పరమేశ్వరుడు (అందరికీ దేవుడు) ఎవ్వడు?
అంతటికీ మూలం ఎవ్వడు?
మొదలు, మధ్య, తుది లేనివాడు (అనంత మూర్తి) ఎవ్వడు?
అంతా తానైనవాడెవ్వడు?
ఆత్మ భవుడు (తనంత తానే జనించినవాడు),
అయితే సామాన్య పూజాదిక సంప్రదాయాలలోను, విశేషించి శ్రీవైష్ణవ సిద్ధాంతాలలోను శ్రీమన్నారాయణుడు వైకుంఠవాసుడు, శేష శయనుడు, శ్రీలక్ష్మీ సమేతుడు, నీలమేఘ శ్యాముడు, పరిపూర్ణుడు అయిన పురుషోత్తమునిగా ఆరాధింపబడుతాడు.🔻


Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩