🚩🚩" వేయిపడగలు " !🚩🚩 (విశ్వనాధ సత్యనారాయణ గారు)


🚩🚩" వేయిపడగలు " !🚩🚩
(విశ్వనాధ సత్యనారాయణ గారు)
♦ఈ పుస్తకం పంతొమ్మిదీ ఇరవయ్యో శతాబ్దాల సంధి చరిత్ర .
ఆ సమయంలో నూతనంగా సమాజంలో కలుగుతూ ,, సామాన్య విషయాలవలే సంఘంలో జరుగుబాటవడానికి ఆస్కారమవుతున్న అనేకానేక విషయాల గురించీ,, ఆ ఆ మార్పులవల్ల కలిగే దుష్పరిణామాల గురించీ ఆనాడే హెచ్చరించిన గొప్ప వైజ్ఞానిక భవిష్యపురాణం ఇది. ...
♦వివాహ వ్యవస్థ గురించి ఈ పుస్తకంలో కధానాయకుడైన
ధర్మారావుతో రాధాపతి,, చక్రవర్తి అనే పాత్రలు చేసే ఈ వాదనలు చదవండి.. ఈ వాదన ద్వారా వివాహ వ్యవస్థ యొక్క గొప్పదనాన్ని వివరిస్తూనే శీలపోషణ,, మనో నియమము యొక్క ఆవశ్యకతనూ ,, స్వేఛ్ఛకీ - విశృంఖలత్వానికీ మధ్యగల తేడానూ ఎంత చక్కగా వివరించారో విశ్వనాధ వారు.
♦' వివాహమక్కర్లేకుండా సంఘంలో మనుష్యులు బ్రతకాలనీ , సెక్సే జీవిత పరమావధి అను ఉద్దేశముతో నైతిక విలువలకూ,, నాగరిక నియమాలకూ తిలోదకాలిచ్చినా పర్లేదను ' సిద్ధాంతాలతో ఉపన్యసిస్తూ,, ఫేస్బుక్లో పోస్ట్లు రాస్తూ తమని తాము మేధావి వర్గానికి చెందినవారిగా భావించుకొను కొందరు భ్రాంతిపరులకి ఈ మాటలు చెంపపెట్టులాంటివని నా అభిప్రాయం 🙂
♦ఆ వాదన ఇదిగో
"" రాధాపతి :- లోకములో స్త్రీ పురుషులందరునూ కామేచ్ఛ కలవారు .. ఎక్కడ చూచినను భర్తయు భార్యయు ఇతర స్థలములయందు సంచరించుచునే ఉన్నారు.. వివాహమన్నది ఆచారముగా చేసుకొనుచున్నారు గానీ,, ' ఇదిగో వీడు ఏకపత్నీవ్రతుడు, ఈమె పతివ్రత ' అని చూపించగల వారిని చెప్పుడు !
ధర్మారావు :- వీరి ప్రవర్తన బాగుగా ఉండలేదని మీరు చూపించుడు.
రాధా :- లక్షోపలక్షలు. మంచివారు నాకెచ్చటనూ కనుపించలేదు
ధర్మా :- మంచివారనగా ఏకపత్నీ వ్రతులు, పతివ్రతలు అనే కదా మీ యర్ధము. అట్టివారు మంచి వారైనప్పుడు అట్లుండట మంచిదనే కదా ! అట్లుందుట మంచి ,, ఇట్లుండుట చెడ్డ. ఇది మీరన్న మాటయే. వేరే వాదమక్కర్లేదు
చక్రవర్తి :- పండితులందరునూ చేయునది ఇదియే. మాటల అర్ధమును విరిచెదరు.. అది వాదన కాదు
ధర్మా :- అది వాదన అవునో కాదో తర్వాత. మీరు వాదించుడు ! లోకములో దాంపత్యము ఆదర్శప్రాయంగా లేదనుట వాదన కాదు. మనము కొన్ని మామిడిపండ్లు పుచ్చువైనచో చక్కని మామిడిపండే ఉండదని వాదించుట ఎట్లు? లోకమునందు ఏకపత్నీవ్రతులు ఉండరాదా?
రాధా :- లేదని నా ఉద్దేశ్యం
ధర్మా :- ఆ మాట తప్పు. నేనున్నాను
రాధా :- మీకు పరస్త్రీ మీద బుద్ధియే ప్రసరించదా?
ధర్మా :- మీరు సరిగా మాట్లాడవలయును. ' మనసే ప్రసరించదా ' అని అనవలయును. మనస్సు వేరు - బుద్ధి వేరు. మనసు చంచలమైనది, బుద్ధి సిద్ధాంతరూపమైనది. పరస్త్రీ సంగమము దోషము కాదను బుద్ధి నాకు లేదు. మనస్సు ప్రసరింపవచ్చును . మనసు నిత్యము చంచలమైనది. దానిని ప్రయత్నముచే నియమించవలయును.
రాధా;- ఎందుకు నియమించవలయును? దాని ఇష్టం వచ్చినట్లు అది పోయినచో తప్పేమి?
ధర్మా :- మనము విద్య కావాలని చదువుకొనుచున్నాము. చదువుకుని కొంత నీతిగా ప్రవర్తించుచున్నాము. చదువుకొనకపోయిన నేమి? , నీతిగా ప్రవర్తించకపోయిన నేమి ? అనినచో సమాధానమేమియూ లేదు.

చదువుకోనివాడు జానపదుని వలె నాగరికులయందు చక్కగా ఎట్లు ప్రవర్తించలేడో, అట్లే అనియమితమైన మనస్సు మహావిషయములనందు అనాగరికమై ఉండును. ఆధ్యాత్మికమైన గౌరవము కలగదు..
♦నాగరికత అనగా నియమములకు ఒదిగియుండుట. మనము దగ్గర స్నేహితులతో ఉన్నప్పుడు యధేఛ్ఛగా మాట్లాదుదుము. సభలో ఉన్నప్పుడు ఒక నియమము అవలంబింతుము . దానిపేరే సభ్యత.
♦వాగ్నియమము ఎట్టిదో,, నలుగురిలో మర్యాదా ప్రవర్తనా ఎట్టిదో,, వానినుసరించి సభలో పురుషునకు యోగ్యత ఎట్లు కలుగునో,, అట్లే మనస్సునకు నియమావలంబనము చేత ఉత్తమ యోగ్యత కలుగును.
వాంఛ అణచని వానికి లఘుత , నియమించినవానికి గురుత. "" అని .
దీనిపై మీ అభిప్రాయం ఏమిటి👌🏿
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐