📌*ఆదిత్య హృదయం* ....!
*తతౌ యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం*
*రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం* -1.
*దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం*
*ఉపగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవానృషిః*-2.
✍️✍️రామరావణ యుద్ధాన్ని చూడడానికి దేవతలతో కలసి అగస్త్య మహర్షి
కూడా వస్తాడు. యుద్ధంలో అలసివున్న రాముడిని చూసిన
అగస్త్య మహర్షి "రామా! ఈ సందర్భంగా నీకు వేదంవలె నిత్యమైనదీ,
మంగళకరమైనదీ, పురాతనమైనదీ, ఆరోగ్యప్రదాయకమైనదీ,
ఆయుర్వృద్ధిని చేసేదీ, అత్యంత ఉత్తమమైనదీ, అతి రహస్యమైనదీ,
అత్యంత లాభదాయకమైన ఆదిత్య హృదయాన్ని ఉపదేశిస్తాను" అని
పలికి, ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడు.✍️✍️
అగస్త్య ఉవాచ:
*#రామరామహాబాహో శృణు గుహ్యం సనాతనం*
*యేన సర్వానరీన్ వత్స సమరే విజయష్యసి*--3.
✍️✍️ఓ రామా! గొప్ప బాహువులు గల రామా! ఈ రహస్యమును విను.
నీకు యుద్ధంలో విజయం కలుగును గాక!✍️✍️
*#ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం*
*జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం*-4.
✍️✍️ఈ ఆదిత్య హృదయం వలన పుణ్యం, శత్రు నాశనం కలుగును.
దీనిని చదువుట వలన జయం, శుభం, పరము కలుగును.✍️✍️
*#సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం*
*చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధన ముత్తమం*--5.
✍️✍️ఇది అత్యంత శుభకరమైనది, మంగళకరమైనది, అన్ని పాపములను
నాశనం చేయునది. చింత, శోకం, ఒత్తిడిలను తొలగించి ఆయుర్వృద్ధి
కలిగించును.✍️✍️
*#రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం*
*పూజయస్వవివస్వంతం భాస్కరం భువనేశ్వరం*----6.
✍️✍️ప్రకాశకుడైన, దేవాసురులచే పూజింపబడిన, తన ప్రకాశంతో
లోకాన్ని ప్రకాశింపజేస్తున్న ఆ భువనేశ్వరున్ని పూజింపుము.✍️✍️
*#సర్వ దేవాత్మకో హ్యేశ తేజస్వీ రశ్మిభావనః*
*ఏశ దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః*-----7.
✍️✍️ ఈ ఆదిత్యుడు సకలదేవతలకు ఆత్మయైనవాడు.
గొప్ప తేజం కలవాడు. తన కిరణాలతో లోకాలను రక్షిస్తుంటాడు.
తన కిరణాలను ప్రసరింపజేయడం ద్వారా ఎండావానలను కలిగించి
దేవదానవులను, సకలజనులను కాపాడుతున్నాడు.✍️✍️
*#ఏశ బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః*
*మహేంద్రో ధనదః కాలో యమస్సోమో హ్యపాంపతిః*---8.
✍️✍️ సమస్త శరీరాలు గలవాడగుటచే, ఇతడే బ్రహ్మా, విష్ణువు,
కుమారస్వామి, ప్రజాపతుల రూపం, దేవేంద్రుడు, కుబేరుడు, కాలుడు,
యముడు, చంద్రుడు, వరుణుడు.✍️✍️
*#పితరో వసవః సాధ్యాః అశ్వినౌ మరుతో మనుః*
*వాయుః వహ్నిః ప్రజాప్రాణా ఋతు కర్తా ప్రభాకరః*--9.
✍️✍️ఇతడే పితృదేవతలు, వసువు, పంచభూతాలు, ప్రజలు శరీరంలోని
ప్రాణవాయువు. ఋతువులను కలిగించే ప్రభాకరుడు.✍️✍️
✍️ స్తోత్ర ప్రారంభం :
*#ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్*
*సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః*----10.
✍️✍️నీవు అదితి కుమారుడవు.
నీవు సూర్యుడవు. నీవు ఆకాశంలో సంచరించేవాడివి.
వర్షంతో జగాన్ని పోషించేవాడవు. పసిడి కిరణములు కలవాడవు.
బంగారు తేజస్సు కలవాడవు.
భానుడవు, హిరణ్యం రేతస్సుగా కలవాడవు.
నీవు దివాకరుడవు.✍️✍️
*#హరిదశ్వస్సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్*
*తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తండ అంశుమాన్*--11.
✍️✍️నీవు ఆకుపచ్చ గుఱ్ఱములు కలవాడవు.
సహస్ర కిరణములు కలవాడవు. చీకటిని సంహరించేవాడివి.
శుభములు కలుగజేసేవాడివి.
బ్రహ్మాండాన్ని మరలా జీవింపజేయువాడవు. ప్రకాశవంతమైనవాడవు.✍️✍️
*#హిరణ్యగర్భః శిశిరస్తపనో భాస్కరో రవిః
*అగ్నిగర్భోఅదితేః పుత్రః శంఖః శిశిరనాశనః*---12.
✍️✍️నీవు హితమనే రమణీయ మనస్సు కలవాడవు.
చల్లనివాడవు. అగ్నిగర్భుడవు. అదితిపుత్రుడువు.
సాయంకాలంలో శమించువాడవు.
మంచును పోగొట్టేవాడవు.✍️✍️
*#వ్యోమనాథ స్తమోభేదీ ఋగ్ యజుస్సామ పారగః*
*ఘనవృష్టిరపాం మిత్రో వింధ్య వీథీ ప్లవంగమః*--13.
✍️✍️ఆకాశానికి నాధుడవు. చీకటిని పోగొట్టేవాడవు. ఋగ్వేదం,
యజుర్వేదం, సామవేదంల పారంగుడవు.
గొప్ప వర్షాన్ని కురిపించేవాడవు. నీటికి మిత్రుడవు.
ఆకాశామార్గమున శీఘ్రంగా పోయేవాడవు.✍️✍️
*#ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః*
*కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వ భవోధ్భవః*----14.
✍️✍️ఎండ నిచ్చేవాడవు. గుండ్రనివాడవు. మృత్యువువి.
ఉదయాన్నే లేతకిరణంలు కలవాడవు.
మద్యాన్నం సర్వాన్ని తపింపజేయువాడవు.
కవివి. మహాతేజుడవు. సమస్త కార్యాలకు కారణభూతుడవు.✍️✍️
*#నక్షత్ర గ్రహతారాణాం అధిపో విశ్వ భావనః*
*తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోస్తుతే*---15.
✍️✍️నక్షత్రాలకు గ్రహాలకు నాయకుడవు.
నీవే ఈ విశ్వ ఉనికికి కారణం. అన్ని తేజస్సుల కంటే తేజస్సును
ఇచ్చువాడవు. ద్వాదశాదిత్యులలో అంతర్యామివైన నీకు నమస్కారం.✍️✍️
*#నమః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః*
*జ్యోతిర్గణానాం పతయే దినధిపతయే నమః*---16.
✍️✍️తూర్పుకొండతో కూడినవాడికి నమస్కారం.
పడమటకొండతో కూడినవాడికి నమస్కారం.
జ్యోతిర్గణాలకు అధిపతివైన నీకు నమస్కారం.
పగటిని కలిగించే నీకు నమస్కారం.✍️✍️
*#జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః*
*నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః*---17.
✍️✍️జయుడకి నమస్కారం. జయభద్రునికి నమస్కారం.
పచ్చని గుఱ్ఱములు గల నీకు నమస్కారం.
సహస్రాంసునకు నమస్కారం.✍️✍️
*#నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః*
*నమః పద్మ ప్రబోధాయ మార్తాండాయ నమో నమః*---18.
✍️✍️ఉగ్రునకు నమస్కారం.
వీరునకు, వేగంగా పయనించే నీకు నమస్కారములు.
కమలములను వికసింపజేయు నీకు నమస్కారం.
మార్తుండునికి నమస్కారం.✍️✍️
*#బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యోదయాదిత్యవర్చసే*
*భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః*-----19
✍️✍️బ్రహ్మా, విష్ణు, మహేశుల అధిపతికి నమస్కారం.
ఆదిత్య వర్చస్సుతో ప్రకాశించువానికి నమస్కారం.
సర్వభక్షకునికి నమస్కారం.✍️✍️
*#తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే*
*కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః*--20.
✍️✍️చీకటిని పోగొట్టువానికి నమస్కారం.
శత్రువులను వధించేవానికి నమస్కారం.
గొప్ప తేజస్సు గలవానికి నమస్కారం.
స్వయంప్రకాశం గలవానికి నమస్కారం.
దేవునికి, జ్యోతిషపతికి నమస్కారం.✍️✍️
*#తప్త చామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే*
*నమస్తమోభినిఘ్నాయ రుచయే లొకసాక్షిణే*----21
✍️✍️బంగారుకాంతివంటి కాంతి కలవాడు, అగ్నిరూపునకు, జగత్తుకు కారణమైనవాడికి నమస్కారం.
విశ్వకర్మకు నమస్కారం. ప్రకాశాస్వరూపునకు నమస్కారం.
లోకసాక్షికి నమస్కారం.✍️✍️
*#నాశయత్యేష వై భూతం తదైవ సృజతి ప్రభుః*
*పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః*---22
✍️✍️ఈ ఆదిత్యుడే మహా ప్రళయకాలంలో ప్రపంచాన్ని నాశనం చేస్తాడు.
తిరిగి తానే జగత్తును సృష్టిస్తాడు.
నాశకాలం తప్ప, తక్కిన కాలంలో చక్కగా పరిపాలిస్తాడు.
ఇతడు కిరణాలతో శోశింపజేస్తాడు, ఎండా, వానలను ఇస్తాడు.✍️✍️
*#ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః*
*ఏష చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణాం*-----23.
✍️✍️సకల జీవులు నిద్రిస్తుండగా, వాటిలో అంతర్యామిగా మేల్కొని
ఉంటాడు. అగ్నిహోత్రం, అగ్నిహోత్రఫలమూ ఇతడే.✍️✍️
*#వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ*
*యాని కృత్యాని లోకేషు సర్వన్యేషు రవి: ప్రభుః*---24.
✍️✍️వేదాలు, యజ్ఞాలు, యజ్ఞఫలమూ ఇతడే.
లోకంలోగల సర్వకార్యములకు ఈ రవియే ప్రభువు.✍️✍️
*#ఏనమాపత్సు కృచ్చేషు కాంతారేషుభయేషు చ*
*కీర్తయన్ పురుషః కశ్చిన్నావసీదతి రాఘవః*--25.
✍️✍️రామా! ఆపదలలో, భయంకలిగించే ప్రదేశాలలో,
ఈ స్తోత్రంతో సూర్యుడిని కీర్తించేవాడు అన్ని ఆపదలనుండి
రక్షింపబడతాడు.✍️✍️
*#పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిమ్*
*ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి*---26.
✍️✍️నువ్వు మనస్సును ఏకాగ్రంచేసి ఆ దేవదేవుడు జగన్నాధుడైన
సూర్యున్ని ఆరాదించు. ముమ్మార్లు ఈ స్తోత్రాన్ని జపిస్తే యుద్ధంలో
విజయం నీకే.✍️✍️
*#అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి*
*ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతమ్*--27.
✍️✍️మహాపరాక్రమశాలీ! నువ్వు ఈ క్షణాన్నే రావణుని సంహరిస్తావు' అని
రామునితో అగస్త్య మహర్షి చెప్పి అక్కడినుండి నిష్క్రమిస్తాడు.✍️✍️
*#ఏతచ్చ్రుత్వా మహాతేజా నష్టశోకోభవత్తద
*ధారయామాస సుప్రీతొ రాఘవః ప్రయతాత్మవాన్*--28.
✍️✍️అప్పుడు మహాతేజోవంతుడైన రాముడు ధైర్యంతో
ఆనందమును పొంది,
నిర్మల హృదయంతో ఆదిత్య హృదయంను జపించాడు.✍️✍️
*#ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వాతు పరంహర్ష మవాప్తయాన్*
*త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్*---29.
✍️✍️రాముడు అలా ఆదిత్య హృదయమును జపించి
మహదానందభరితుడయ్యాడు.
తర్వాత ముమ్మార్లు ఆచమనం చేసి, మిగుల పరాక్రమముతో
విల్లు ధరించాడు.✍️✍️
*#రావణం ప్రేక్ష్య హ్రుష్టాత్మా యుద్ధాయ సముపాగమత్*
*సర్వ యత్నేన మహతా వధే తస్య ధృతోభవత్*---30.
✍️✍️శ్రీరాముడు రావణున్ని చూసి ఉత్సాహంతో యుద్ధం చేయడం
ప్రారంభించాడు.రావణున్ని సంహరించాలని ధృడంగా నిశ్చయించుకున్నాడు.✍️✍️
*#అథ రవి రవదన్నిరీక్ష్య రామం
ముదితమన్యాః పరమం ప్రహృష్యమాణః*
నిశిచరపతి సంక్షయం విదిత్వా
సురగణమధ్యగతో వచస్త్వరేతి*--------31
✍️✍️అలా తనను జపించుతున్న శ్రీరామున్ని చూసి, రాక్షసరాజు వినాశనంను
గ్రహించి, చాలా ఆనందంతో 'నీవింక రావణుని వధింప త్వరపడమని,
నీకు విజయం తధ్యమ'ని సూర్యభగవానుడు రామునితో చెప్పెను.
*ఇతి ఆదిత్య హృదయం సంపూర్ణం* ....,.✍
లోకాస్సమస్తాస్సుఖినోభవంతు .
************************************
Comments
Post a Comment