🚩🚩🚩♥ కూనలమ్మ పదాలు.♥🚩🚩🚩

 


🚩🚩🚩♥ కూనలమ్మ పదాలు.♥🚩🚩🚩

#కూనరాగాలు తీస్తునా' డని మధ్యాంధ్రదేశమందున్నూ,

'#కూనలమ్మ సంగీతాలు తీస్తున్నా' డని దత్తమండల

మందున్నూ వాడుకలో నానుడి పలుకు ఉన్నది.

అది ఈక్రింది పదాలనుబట్టి పుట్టినది. ఇట్టి పదము లెన్ని ఉన్నవో తెలియదు.

అరవములో #అవ్వయార్‌ పదా లెంత విలువగలవో తెలుగులో కూనలమ్మపదాలు కూడా అంత విలువ గలవే అనవచ్చును.)

♥జప తపంబులకన్న,

చదువు సాములకన్న,

ఉపకారమే మిన్న,

ఓ కూనలమ్మా!♥

♥అన్న మిచ్చినవాని,

నాలి నిచ్చినవాని,

నపహసించుట హాని,

ఓ కూనలమ్మా!♥

♥మగనిమాటకు మాటి,

కెదురు పల్కెడు బోటి,

మృత్యుదేవత సాటి,

ఓ కూనలమ్మా!♥

♥కాపువాడే రెడ్డి,

గరికపోచే గడ్డి,

కానకుంటే గుడ్డి,

ఓ కూనలమ్మా!♥

♥కవితారసపుజల్లు,

ఖడ్గాల గలుగల్లు,

కరణాలకే చెల్లు,

ఓ కూనలమ్మా!♥

దుర్యోధనుడు భోగి,

ధర్మరాజొక జోగి,

అర్జునుండే యోగి,

ఓ కూనలమ్మా!

♥భీష్ము డనుభవశాలి,

భీముడే బలశాలి,

కర్ణుడే గుణశాలి,

ఓ కూనలమ్మా!♥

♥ఆడితప్పినవాని,

నాలినేలనివాని,

నాదరించుట హాని,

ఓ కూనలమ్మా!♥

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩