📌*ఆదిత్య హృదయం* ....!
📌*ఆదిత్య హృదయం* ....! *తతౌ యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం* *రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం* -1. *దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం* *ఉపగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవానృషిః*-2. ✍️✍️రామరావణ యుద్ధాన్ని చూడడానికి దేవతలతో కలసి అగస్త్య మహర్షి కూడా వస్తాడు. యుద్ధంలో అలసివున్న రాముడిని చూసిన అగస్త్య మహర్షి "రామా! ఈ సందర్భంగా నీకు వేదంవలె నిత్యమైనదీ, మంగళకరమైనదీ, పురాతనమైనదీ, ఆరోగ్యప్రదాయకమైనదీ, ఆయుర్వృద్ధిని చేసేదీ, అత్యంత ఉత్తమమైనదీ, అతి రహస్యమైనదీ, అత్యంత లాభదాయకమైన ఆదిత్య హృదయాన్ని ఉపదేశిస్తాను" అని పలికి, ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడు.✍️✍️ అగస్త్య ఉవాచ: *#రామరామహాబాహో శృణు గుహ్యం సనాతనం* *యేన సర్వానరీన్ వత్స సమరే విజయష్యసి*--3. ✍️✍️ఓ రామా! గొప్ప బాహువులు గల రామా! ఈ రహస్యమును విను. నీకు యుద్ధంలో విజయం కలుగును గాక!✍️✍️ *#ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం* *జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం*-4. ✍️✍️ఈ ఆదిత్య హృదయం వలన పుణ్యం, శత్రు నాశనం కలుగును. దీనిని చదువుట వలన జయం, శుభం, పరము కలుగును.✍️✍️ *#సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం* *చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధన ముత