🚩🚩గోపికా వస్త్రాపహరణం: ! (పోతన భాగవత కధ .)
🚩🚩గోపికా వస్త్రాపహరణం: ! (పోతన భాగవత కధ .) #భగవానుడు కృష్ణుడిగా అవతరించిన తరువాత, చేసిన లీలలు, అనేకము ఉన్నాయి. అందులో గోపికా వస్త్రాపహరణ ఘట్టము, పరమ ప్రామాణికమయినది. బృందావనంలో వుండే గోపకాంతలు అందరూ కూడా, కృష్ణ భగవానుడినే పతిగా పొందాలని, నిర్ణయం చేసుకున్నారు. గోపకాంతలు, పూజనొక దానిని చేశారు. వారు కృష్ణుడిని భర్తగా పొందడానికి, కృష్ణుడి వ్రతం చేయలేదు. ఇది వ్యాసుని సర్వోత్క్రుష్టమయిన ప్రతిపాదన. వారు మార్గశీర్ష మాసములో, ఒక వ్రతము చేశారు. యథార్థమునకు, భాగవతంలో, గోపకాంతలు, మార్గశీర్ష మాసంలో చేసిన వ్రతం, కాత్యాయనీ వ్రతం. వీరందరూ కలిసి, కాత్యాయనీ దేవిని, ఉపాసన చేశారు. కాత్యాయన మహర్షి కుమార్తెగా జన్మించి, ఆయనను ఉద్ధరించింది కాబట్టి , పార్వతీ దేవికి, కాత్యాయని అని పేరు. పార్వతీదేవిని ఉపాసన చేశారు. కృష్ణుడిని ఉపాసన చేసి, కృష్ణుని భర్తగా పొందాలి. కానీ, మధ్యలో కాత్యాయనీ దేవి పేరుతొ, పార్వతీదేవిని ఉపాసన చేస్తే, కృష్ణుడు ఎలా భర్త అవుతాడు? ఇందులోనే ఒక చమత్కారం ఉంది. ఇందులోనే ఒక రహస్యం ఉంది. శాస్త్రంలో మనకు శ్రీమన్నారాయణుడే, నారాయణిగా ఉంటాడు. నారాయణి అని, పార్వతీదేవిని పిలుస్తారు. నారాయణ, నారాయణి, వీ