🚩🚩మా తెలుగు తల్లికీ మల్లెపూదండ🔻🔻


🚩🚩మా తెలుగు తల్లికీ మల్లెపూదండ🔻🔻


#తెలుగు లోనె బ్లాగండోయ్

తెలుగులోనె రాయండోయ్

తెలుగులోనె చదవండోయ్

తెలుగు మాట వినరండోయ్.

#తెలుగే మన మాతృభాష

తెలుగే మన ఆంధ్రభాష.

తెలుగే మన జీవ శ్వాస

తెలుగే మన చేతి వ్రాత.

#తెలుగే మన కంటి వెలుగు.

తెలుగే మన ఇంటి జోతి.

#తెలుగే మన మూలధనం

తెలుగే మన ఆభరణం.

#తెలుగును ప్రేమించుదాం

తెలుగును వినిపించుదాం

తెలుగును వ్యాపించుదాం.

తెలుగును రక్షించుదాం.

తెలుగుకు లేదోయ్ శాపం

తెలుంగు పలుకే మనదోయ్.

#తెలుగన్నా, తెలుఁగన్నా,

తెనుగన్నా, తెనుఁగన్నా,

తెలియరొ అది తేనె వూట

తెలుపరొ ప్రతి పూట పూట.

#తెలుగంటే నన్నయ్యా

తెలుగంటే తిక్కన్నే

తెలుగంటే పోతన్నా

తెలుగంటే శ్రీనాథుడు.

#తెలుగంటే అల్లసాని

తెలుగంటే తెన్నాలే

తెలుగంటే సూరన్నే

తెలుగంటే రాయలెగా.

తెలుగంటే అన్నమయ్యా

తెలుగంటే త్యాగయ్యే

తెలుగంటే క్షేత్రయ్యా

తెలుగంటే రామదాసు.

#తెలుగంటే ఎంకిపాట

తెలుగంటే జానపదం

తెలుగంటే బాపిరాజు

తెలుగంటే బ్రౌనుదొరా.

#తెలుగంటే జంటకవులు

తెలుగంటే శ్రీశ్రీ శ్రీపాదే

తెలుగంటే పానుగంటి

తెలుగంటే విశ్వనాథ.

#తెలుగంటే కందుకూరి

తెలుగంటే గురజాడ

తెలుగంటే గిడుగేరా

తెలుగంటే సీనారే.

తెలుగే పాపయ్యశాస్త్రి

తెలుగే గుఱ్ఱం జాషువ

తెలుగే వెంకటచలమూ

తెలుగేరా రావిశాస్త్రి

తెలుగే కాళీపట్నం.

#తెలుగంటే మొక్కపాటి

తెలుగంటే ఆరుద్రా

తెలుగంటే ముళ్ళపూడి

తెలుగురమణ బాపుబొమ్మ.

#తెలుగు మాట లొలుకు తేనె

తెలుగు సినిమ విశ్వనాథ

తెలుగు పాట కృష్ణశాస్త్రి

తెలుగు నోట ఘంటసాల.

#తెలుగే శృంగార పదం

తెలుగే బంగారు రథం

తెలుగే శ్రీకృష్ణు మురళి

తెలుగే మన బాలమురళి.

అందుకే

#తెలుగు లోనె బ్లాగండోయ్

తెలుగులోనె రాయండోయ్

తెలుగులోనె చదవండోయ్

తెలుగు మాట వినరండోయ్

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐