🚩🚩ఏకలవ్యుడు.🚩🚩


🚩🚩ఏకలవ్యుడు.🚩🚩

#మహాభారతంలో  ఏకలవ్యుని పాత్ర నిషాధ తెగకు చెంది ఒకయువరాకుమారుడిలాప్రవేశిస్తుంది.

ఏకలవ్యుడు శ్రీకృష్ణునికి తండ్రియైన వాసుదేవుని సహోదరి శృతదేవకి జన్మించిన వాడు. ఆ తరువాత అతడు నిషాధ రాజైనటువంటి హిరణ్యధనుస్సుచే పెంచబడ్డాడు.హిరణ్య ధనస్సు మగధ సామ్రాజ్యాధిపతియైన జరాసంధుని సైన్యాధిపతి.

అస్త్ర విద్యలో ప్రావీణ్యం పొందగోరి ద్రోణుని అభ్యర్థించాడు.ద్రోణుడు అస్త్ర విద్యలో ఆరి తేరిన వాడు,, అర్జునుడు, అతని సహోదరులకు గురువు. కానీ ద్రోణుడు ఏకలవ్యుని స్థాయిని (కోపాన్ని అదుపులో ఉంచోకోలేడు అని, అది మనస్సులోని ఉంటచోని పైకి వేరే కారణంతో తిరష్కరించాడు) కారణంగా తిరస్కరించాడు.

ద్రోణుడు తిరస్కరించడంతో బంకమట్టితో అతని విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుని స్వాధ్యయనం ప్రారంభించాడు.

 ఎంతో దీక్షతో విలువిద్యను అభ్యసించిన ఏకలవ్యుడు ద్రోణుడి ప్రియశిష్యుడు, మేటి విలుకాడైన అర్జునునితో సమానంగా నైపుణ్యాన్ని సాధించగలిగాడు. ఒక సారి విలువిద్య సాధనకు అర్జునుడు, దోణుడు ఇతరులు కలిసి అడవికి వేట కుక్కలను తీసుకువెళ్లారు. అందులోని ఒక కుక్క వేగంగా, ఏకలవ్యుడు ఉన్న ప్రదేశానికి వెళ్లింది. కొత్త వేషదారణతో ఏకలవ్యుడు కనిపంచే సరికి కుక్క గట్టిగా అరిచింది. "నన్ను చూసి అరుస్తావా" అనుకున్న ఏకలవ్యుడు కుక్క నోరు తెరచి మూయుటకు మద్యగల సమయంలోనే దాని నోటిలోనికి 7 బాణాలు కొట్టాడు. తరువాత కుక్క అర్జునికి కనిపించింది. విషయం విచారించగా ఈ ప్రాంతంలో ఏకలవ్యుడు అనే అతను విలువిద్య నేర్చుకుంటున్నాడని తెలుకొని, రాత్రి ద్రోణాచార్యులు వారికి సేవ చేసే సమయంలో ఇక్కడ నా కన్న బాగా విలువిద్య చేసే వారు ఉన్నారని తెలిపారు.

 తరువాత రోజు ద్రోణాచార్యులు ఏకలవ్యుడిని చూడటానికి అతని వద్దకు వెళ్లారు. ఏకలవ్యుడు తన గురువు గారికి ఘణంగా స్వాగతం తెలిపారు. ఏకలవ్యుడు విలువిద్య చూసి ఏంతో సంతోషించారు. కాని ఒక కుక్కను చూసి అది తనను చూసి అరచింది అనే చిన్న కారణానికి దాని నోట్లోకి 7 బాణాలు కొట్టాడు. ఇలా కోపాన్ని అదుపులో ఉంచుకోలేని, ధర్మం, అధర్మం తెడా తెలియకుండా అధర్మం వైపు మొగ్గే అతని వద్ద ఇంతటి విలువిద్య ఉంటే లోకానికి, ప్రజలకు ప్రమాదం ఏర్పడుతుంది. కావున రాబోవు ప్రమాదాలను ముందే నివారించుటకు ఏకలవ్యుడు విలువిద్య ప్రదర్శించుటకు వీలుకాకుండా అతని కుడి చేతి బ్రొటని వేలు గురదక్షణగా ఇవ్వమని కొరి లోక రక్షణకు కృషి చేశాడు. .

 గురువు పట్ల ఎనలేని భక్తి ప్రపత్తులు గల ఏకలవ్యుడు తన భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించక, తన కుడి చేతి బొటన వేలుని కోసి గురు దక్షిణగా సమర్పించాడు. చరిత్రలో నిలిచిపోయాడు.

#మరణం.

ద్రోణాచార్యులు అనుకున్నదే నిజం జరిగింది. ధర్మం వైపు మొగ్గకుండా అధర్మం వైపు వెళ్లాడు. తరువాత ఏకలవ్యుడు జరాసంధునికి చాలా విశ్వాసపాత్రుడిగా వ్యవహరించాడు. రుక్మిణీ స్వయంవరం సమయంలో జరాసంధుని కోరిక మేరకు, శిశుపాలుడికి, రుక్మిణీ దేవి తండ్రియైన భీష్మకునికి మధ్యవర్తిగా వ్యవహరించాడు. భీష్మకుడు రుక్మిణి శిశుపాలుడిని పెళ్ళి చేసుకోవాలని కోరాడు. కానీ రుక్మిణీ శ్రీకృష్ణుని పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయింది. తరువాత ఒకసారి జరాసంధుని సైన్యంతో యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు పైకి

 ఏకలవ్యుడు ఒక రాయి విసరడంతో శ్రీకృష్ణుడే అతన్ని చంపివేశాడు.

ఏకలవ్యుడే దృష్టద్యుమ్నుడు కృష్ణుడు ఏకలవ్యుడి మరణసమయంలో, అతను ద్రోణాచార్యుడిని చంపడానికి మరుజన్మ ప్రసాదించే వరం ఇచ్చాడు అని నమ్ముతారు. అందువలన ఏకలవ్యుడే దృష్టద్యుమ్నుడుగా జన్మించాడని మరియు చివరకు ద్రోణాచార్యుడిని ఏకలవ్యుడే వధించాడని చెబుతారు.

**********************************


Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐