❤️ గైడ్ .- దేవానంద్ చిత్రం. ❤️

                            ❤️ గైడ్ .- దేవానంద్  చిత్రం. ❤️

బాక్స్ ఆఫీస్ వద్ద విజయ దుందుభి మోగించిన గైడ్ చిత్రం పెక్కు విశేషాలను కలిగి ఉంది. 
గైడ్ చిత్రానికి ముగ్గురు దర్శకులు. 
ఆంగ్ల చిత్రానికి టాడ్ డేనియల్ దర్శకత్వం వహించాడు. చిత్రానువాదం పెర్ల్ ఎస్ బక్, టాడ్ డేనియల్ సంయుక్తంగా నిర్వహించారు. .
 ఒకే సారి ఆంగ్ల, హిందీ చిత్రాల చిత్రీకరణ సాంకేతిక కారణాలవలన సాధ్యం కాకపోవటం తో, తొలుత ఆంగ్ల చిత్రాన్ని చిత్రీకరించారు. ఈ కారణంగా హిందీ చిత్రం ఆలస్యం అవటం వలన అప్పటి దాక దర్శకత్వం వహించిన #చేతన్ ఆనంద్, 
తన సొంత చిత్రం హకీకత్ నిర్వహణ బాధ్యతను నిర్వహించటానికై, గైడ్ దర్శకత్వ బాధ్యత నుంచి తప్పుకున్నాడు. విజయ ఆనంద్ గైడ్ దర్శకత్వం స్వీకరించాడు. ఆంగ్ల చిత్రానువాదం కాకుండా, భారతీయ ప్రేక్షకులకు నచ్చే విధంగా కొత్త చిత్రానువాదం తయారు చేశాడు.
 మనసంతా లగ్నం చేసి దర్శకత్వం వహించిన 
#విజయ్ ఆనంద్ కృషి ఫలించి అనుకున్న విధంగా తీయగలిగాడు.
ఈ లోపు ఆంగ్ల చిత్రం విడుదలయ్యింది. అయితే చిత్రానువాదం పేలవంగా ఉండి, ఆంగ్ల ప్రేక్షకులను చిత్రం ఆకట్టుకోలేక పోయింది. చిత్రం పరాజయం పాలయ్యింది. 
#చిత్రంలో నాయకుడు ఒక వివాహితతో అక్రమ సంబంధం ఏర్పరచుకొంటాడు. ఆమెను మోసం చేసి జైల్ కు వెళ్తాడు. చివరకు ఒక సాధువుగా మారి, ఎడారిలో నిరాహార దీక్ష చేసి మరణిస్తాడు. ఎప్పుడూ అందంగా కనిపించే దేవ్ చిత్రంలో అందవిహీనంగా కనిపించటాన్ని విమర్శకులు ఏకి పారేసారు. నాయకుడు వివాహేతర సంబంధం పెట్టుకోవడం భారతీయ చిత్రాలకు తగని పని. చిత్రం కొనటానికి పంపిణీదారులెవరూ ముందుకు రాలేదు. దేవానంద్ పని అయిపోయింది, దివాళా తీయటం తప్పదని గిట్టని వాళ్లు ప్రచారం మొదలెట్టారు.
#1965 ఫిబ్రవరి 6 న చిత్రం విడుదలయ్యింది. పంపిణీదారులు ఆసక్తి చూపక పోయినా, గైడ్ చిత్రం గురించి ప్రచారంలో వున్న వార్తలు ప్రేక్షకులను చిత్రశాలలకు రప్పించాయి. విజయానంద్ పఠిష్టమైన చిత్రానువాదం, దర్శకత్వం, కథలో వైవిధ్యం, #ఎస్.డి.బర్మన్ సంగీతం, #వహీద నృత్యాలు, #దేవానంద్ నటనా కౌశల్యం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిత్రం ఒక కళాఖండమయ్యింది. ప్రేక్షకులు గైడ్ చిత్రాన్ని మరల మరలా చూసి కాసుల వర్షం కురిపించారు.
 #ఆజ్‌ ఫిర్‌ జీనేకి తమన్నా’ అనే ఈ చిత్రంలోని గీతం అమిత ప్రేక్షకాదరణ పొందింది. ఈ పాటను ఆసాంతం చిత్తోడ్‌ ఘడ్‌ కోటలో చిత్రీకరించారు.
గైడ్ సంగీత దర్శకత్వం మినహాయించి మిగతా అన్ని శాఖలలోను ఫిల్మ్ ఫేర్ ఉత్తమ బహుమతులను 7 శాఖలలో గెల్చుకొని, చిత్రరాజమై నిల్చుంది గర్వంగా. చాలా సంవత్సరాల తర్వాత, దూరదర్శినిలో ఈ చిత్రాన్ని ప్రదర్శించినప్పుడు రహదారులలో వాహనాలు తగ్గాయి, మనుషులు లేరు. ఎవరిళ్లలో వారు ఈ చిత్రాన్ని టి.వి.లో చూస్తూ కుర్చీలకతుక్కుపోయారు. విదేశీ చిత్రాల కోవలో, ఆస్కార్ చిత్రోత్సవానికి భారత దేశ అధికార చిత్రంగా ఎంపికయ్యింది. విడుదలయిన 42 ఏళ్ల తర్వాత, 2007 లో కేన్స్ చిత్రోత్సవంలో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. #దేవానంద్, వహీదా రెహమాన్ ల నట జీవితంలో గైడ్ ఒక అణిముత్యమై ప్రకాసిస్తుంది.
అయితే, ఈ చిత్రం చూసాక రచయిత #ఆర్కె నారాయణ్ పెదవి విరచాడు. Misguided guide అని తన అసంతృప్తిని వ్యక్త పరిచాడు. ఒక నవలను సినిమాగా తీసి రచయితను మెప్పించటం ఎవరికైనా కత్తిమీద సామే.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩