❤️ మనజమున - గౌరమ్మ గారు .❤️

 

🌹పుట్టినరోజు శుభాకంక్షలు.🌹

#జమున, లేదా#జమునా రమణారావు తెలుగు సినిమా నటి. తెలుగు మాతృభాషకాకపోయినా తెలుగునేలలో పెరిగి, తెలుగు చలన చిత్రంలో అరుదైన కథానాయికగా గుర్తింపు పొందిన తార..#VVA

#జమున 1936 ఆగష్టు 30 న హంపీలో పుట్టింది. ఆమె తల్లితండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేవి. ఆయన ఒక వ్యాపారవేత్త. బాల్యం గడిచింది గుంటూరు జిల్లా దుగ్గిరాలలో. జమునకు ముందుగా నిర్ణయించిన పేరు జనాభాయి. జన్మ నక్షత్రం రీత్యా ఏదైనా నది పేరు ఉండాలని జ్యోతిష్కులు చెప్పడంతో మధ్యలో 'ము' అక్షరం చేర్చి జమునగా మార్చారు

జమున చిన్నతనం నుండే నాటకాలలో నటించేవారు. జమున తల్లి ఆమెకు శాస్త్రీయ సంగీతం, హార్మోనీయంలలో శిక్షణ ఇప్పించారు. మా భూమి నాటకంలో జమున ఒక పాత్ర పోషించగా, ఆమె అభినయం నచ్చి ఆమెకు #పుట్టిల్లు (1953)లో నటిగా అవకాశం ఇచ్చారు. ఆ సినిమాతో సినిమాలలోకి తెరంగేట్రం చేశారామె.#VVA

ఆ తరువాత అక్కినేని నాగేశ్వరరావు, జగ్గయ్య, నందమూరి తారక రామారావు తదితర నటుల సరసన నాయికగా నటించింది. ఎన్ని పాత్రలలో నటించినా ఆమెకు బాగా పేరు తెచ్చింది#సత్యభామ పాత్రే. ఆ పాత్రలో ఇప్పటిటికీ ఆమెను తప్ప మరొకరిని ఊహించుకోలేము అన్నట్టుగా నటించిందీమె. వినాయకచవితి చిత్రంలో మొదటి సారి #సత్యభామలో జమున కనిపిస్తుంది. ఆ తర్వాత శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో కూడా అదే పాత్ర వేసింది. ఈ సినిమాలో సత్యభామ ఆహార్యం గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని పాత్రే ఆమెకు పేరు తెచ్చింది.

#మూగ మనసులు సినిమాలో ఆమె #గౌరమ్మ పాత్ర మరవ రానిది. గోదావరి చూస్తే అమే గుర్తు వస్తుంది.

జమున. ఈమె తెలుగు సినిమాలే కాక తమిళం, హిందీ సినిమాలలో కూడా నటించింది.

ఆమె నటించిన మిస్సమ్మ, ఇల్లరికం, ఇలవేల్పు, లేతమనసులు, గుండమ్మ కథ చిత్రాలు విజయవంతమయ్యి రజతొత్సవం జరుపుకున్నాయి.#VVA

తెలుగు, దక్షిణభారత భాషల్లో కలిపి ఆమె #198 సినిమాలు చేశారు. పలు హిందీ సినిమాలలో కూడా నటించారు. 1967లో ఆమె హిందీలో చేసిన మిలన్ సినిమా, 1964లో విడుదలైన మూగ మనసులు సినిమాలకు గాను ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు లభించింది.

1980లలో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజమండ్రి నియోజకవర్గం నుంచి 1989లో లోక్ సభకు ఎంపిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత రాజకీయల నుండి తప్పుకున్నా, 1990వ దశకంలో భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేశారు.

1965లో #జూలూరి రమణరావును వివాహం చేసుకున్నారు జమున. ఆయన శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జువాలజీ ప్రొఫెసర్ గా పనిచేశారు. 2014 నవంబరు 10లో గుండెపోటుతో మరణించారు ఆయన. వారి కుమారుడు వంశీకృష్ణ, కూతురు స్రవంతి. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు.


🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻

Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩