🔻❤️🙏🏿తొలి తెలుగు నాటకం ‘కన్యాశుల్కము’🙏🏿❤️🔻



 🔻❤️🙏🏿తొలి తెలుగు నాటకం ‘కన్యాశుల్కము’🙏🏿❤️🔻


🚩

అభినవ ఆంధ్ర సాహితీ వైతాళికుడు, 

తెలుగు కథఆద్యుడు #గురజాడ అప్పారావు గారు (21-09-1862 & 30-11-1915)పూర్తిస్థాయి వాడుక భాషలో రాసిన తొలి తెలుగు నాటకం ‘కన్యాశుల్కము’. 
ప్రపంచ నాటకాల్లో కన్యాశుల్కానికి ఒక ప్రముఖ స్థానం ఉంది.



🚩

‘కన్యాశుల్కముకథ !



#విజయనగరంలో #మధురవాణి అనే వేశ్య బహుజాణ. ఆమెకన్నా జాణతనం కలిగిన #గిరీశం అనే ఇంగ్లీషు చదువుకున్న జిత్తులమారి యువకుడు ఒక పూటకూళ్లమ్మ ఇంట్లో వుంటూ మధురవాణితో స్నేహం కలుపుతాడు. రామచంద్రాపురం అగ్రహారంలో పెద్దమనిషిగా చలామణి అయ్యే#రామప్పంతులు బ్రహ్మచారి, వేశ్యాలోలుడు. మధురవాణి దగ్గరకి వస్తుంటాడు. అదే ఊళ్లో #లుబ్ధావధానులు అనే అరవయ్యేళ్ల లక్షాధికారి ఉన్నాడు. అతని డబ్బు గుంజే ప్రయత్నంలో రామప్పంతులు అతనిని పునర్వివాహం చేసుకోమని వుసిగొల్పుతాడు. వార్ధక్యంలో పెళ్లెందుకని కూతురు మీనాక్షి వారించినా లుబ్దావధానులు వినడు. ఆ రోజుల్లో డబ్బులకు ఆశపడి, కన్యాశుల్కము పుచ్చుకొని నోరెరుగని బాలికలను భార్యలేని ముసలివాళ్లకు కట్టబెట్టడం పరపాటి. కృష్ణరాయపుర అగ్రహారంలో వుండే #అగ్ని హోత్రావధానులు అలా పిల్లల్ని అమ్ముకోవడంలో ఘనాపాఠి. అతని పెద్దకూతురు బుచ్చమ్మ చిన్నప్పుడే భర్తను కోల్పోయింది. చిన్నకూతురు సుబ్బమ్మ (కు తొమ్మిదేళ్లు. ఆ పిల్లను పద్దెనిమిది వందల కన్యాశుల్కానికి రామప్పంతులు ద్వారా లబ్ధావదానుకు అమ్మడానికి అగ్నిహోత్రావధానులు నిశ్చయిస్తాడు. అమాయకురాలైన అతని భార్య వెంకమ్మ అడ్డుపడపోట్లాడుతుంది. అయినా ఖాతరు చెయ్యడు.



విజయనగరంలో అప్పులబారి నుండి విముక్తి కాలేక, జిత్తులమారి గిరీశం తన వద్ద ఇంగ్లిష్‌ పాఠాలు నేర్చుకునే అగ్నిహహోత్రవధానులు కొడుకు వెంకటేశం ను తీసుకొని కృష్ణరాయపుర అగ్రహారం చేరుకుంటాడు. వాళ్ల ఇంట్లో వున్న విధవరాలైన బుచ్చమ్మను చూసి మోహించి ఆమెను లేవదీసుకెళ్లి వివాహం చేసుకోవాలని పన్నాగం పన్నుతాడు. ఇంతలో అగ్ని హోత్రావధానులు భార్య ‘‘పుత్తడిబొమ్మ పూర్ణమ్మ’ అనే వీధి గాయకుల పాటవిని, తన చిన్న కూతురు బ్రతుకు కూడా విధవరికానికే దారితీస్తుందని దుఃఖించి నూతిలో పడుతుంది. అక్కడే వున్న గిరీశం ఆమెను రక్షిస్తాడు. ఈ విషయం అగ్నిహోత్రావధానులు బావమరిది కరటకశాస్త్రి తెలిసి ఎలాగైనా బాల్యవివాహాన్ని ఆపి, కన్యాశుల్కము రాబట్టాలనే బావగారి ఆశలకు చరమగీతం పాడాల్సిందేనని నిశ్చయిస్తాడు. స్వయంగా రంగస్థల నటుడు కావడంతో మధురవాణి సహకారంతో తన శిష్యుడు మహేశంకు ఆడపిల్ల వేషం వేసి రామప్పంతులు వద్దకు తీసుకెళ్లి అతనికి లంచమిస్తానని ఆశపెట్టి, అగ్నిహోత్రావధానుల అమ్మాయితో నిశ్చయించిన పెళ్లిని ఆపించమని అందుకు ప్రతిగా ఆడవేషంలో ఉన్న మహేశంతో వివాహం జరిపించమని నాటకమాడుతాడు.మధురవాణి రంగంలోకి దూకి మహేశంతో పెళ్లి తంతు జరిపిస్తుంది. లుబ్ధావధానులకు అసలు విషయం తెలిసి పశ్చాత్తాపం చెందుతాడు. ఇదే అదునుగా గిరీశం బుచ్చమ్మను లేవదీసుకొని విశాఖపట్నం చేరుకొని సౌజన్యరావు (గుమ్మడి) అనే సంస్కారవంతుడైన వకీలును కలిసి సాయం కోరతాడు. ఈలోగా వీరిని వెదుక్కుంటూ అందరూ విశాఖపట్నం చేరుకుంటారు. మధురవాణి జరిగిన విషయాన్ని సౌజన్యరావుకు విశదీకరిస్తుంది.#సౌజన్యరావు గిరీశాన్ని మందలించి

వేళ్ళ గొడతాడు

#"డామిట్ కధ అడ్డం తిరిగింది "అంటూ గిరీశం నిష్క్రమిస్తాడు

🚩

తెలుగునాట సాంఘిక నాటకం అంటే మొదట గుర్తొచ్చేది గురజాడ వారి కన్యాశుల్కం నాటకమే. కన్యాశుల్కం పేరు చెప్పగానే గుర్తొచ్చేది గిరీశం.



*డామిట్ కధ అడ్డం తిరిగింది . (గిరీశం)



* తాంబూళాలు ఇచ్చేశాను ఇక తన్నుకు చావండి (అగ్నిహోత్రావధాన్లు),



*విద్యవంటి వస్తువు లేదు (రామప్పంతులు),



*బుద్ధికి అసాధ్యం ఉందేమో కాని డబ్బుకు లేదు (మధురవాణి), ఇలా ఎన్నో సంభాషణలు ఇప్పటికీ జనం నాలుకమీద ఆడుతూ ఉంటాయి.



ఆ నాటకానికే సినిమాకు అనుగుణంగా కొన్ని మార్పులు చేసి ‘కన్యాశుల్కం’ చిత్రాన్ని నిర్మించారు వినోదా సంస్థ అధినేత డి.ఎల్. ఈ చిత్రానికి పి.పులయ్య దర్శకత్వం వహించారు. 1955 ఆగస్ట్ 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది.



#‘కన్యాశుల్కం’ నాటకం తెలుగువారు ఉన్న చోటల్లా పేరు సంపాదించుకుంది. ఈ నాటకంలో తొలి డైలాగ్ ‘సాయంత్రమయింది..’ అన్నది, చివరి డైలాగ్ ‘డామిట్ కథ అడ్డంగా తిరిగింది’ అనేది. ఈ రెండూ గిరీశం నోట వెలవడతాయి. ఆ డైలాగులు తెలుగువారికి కంఠోపాఠంగా ఉండేవి.



🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻

Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩