🔻🚩‘-సంసారం’ -🚩🔻




                               🔻🚩‘-సంసారం’ -🚩🔻


#1950లో సాధనా పిక్చర్స్‌ వారి ‘సంసారం’ చిత్రంలో యన్‌.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, లక్ష్మీరాజ్యం (‘నర్తనశాల’ చిత్ర నిర్మాత) నటించారు. తొలిసారిగా చలనచిత్ర రంగంలో తెలుగు తెరకు పరిచయమైన #మహానటి’ సావిత్రి, ఈ చిత్రలో ఒక ‘కాలేజీ గర్ల్‌’గా నటించింది.


విశేషాలు!

ఈ చిత్రంలో హీరోయిన్ వేషానికి ముందుగా సావిత్రిని అనుకున్నారు. కారణాంతరాల వల్ల పుష్పవల్లి ఆ వేషం ధరించింది. ఐతే సావిత్రి ఒక కాలేజి స్టూడెంటుగా నటించి కథానాయకుడు అక్కినేనిని చూసి 'అచ్చం హీరో నాగేశ్వర రావులాగ ఉన్నావే' అన్న ఒకే ఒక డైలాగ్ చెప్పి ఓహో అనిపించుకుంది.ఈ సినిమా 29 డిసెంబరు, 1950 విడుదల అయ్యినా నిర్మాత కె.వి.కృష్ణ మరణించడం చేత ప్రదర్శన ఆపివేసి మళ్ళీ 5 జనవరి, 1951 మొదలు పెట్టినారు. ఈ సినిమా విజయవంతమై 11 థియేటర్లలో శతదినోత్సవాలు జరుపుకున్నది.#VVA


సంక్షిప్త చిత్రకథ!

రఘు (యన్.టి.రామారావు) ప్రభుత్వ ఉద్యోగి. చాలా సామాన్యమైన గుమస్తా బ్రతుకుతుంటాడు. భార్య మంజుల (లక్ష్మీరాజ్యం), తమ్ముడు వేణు (అక్కినేని), పల్లెటూర్లో నివాసం. అక్కడ వుండేది తల్లి, చెల్లెలు, బావ. బావను తల్లి, చెల్లెలు చెప్పుచేతల్లో వుంచుకొంటారు. వీరందరి అవసరాలు తన జీతంతోనే రఘు తీర్చాల్సివస్తుంది. ఆ ప్రయత్నంలో ఎన్నో ఇబ్బందులు పడి సంసారాన్ని విడిచి ఎక్కడికో వెళ్ళిపోతాడు. అప్పుడు మంజుల పిల్లలచేత ముష్టి ఎత్తించి సంసారం నెట్టుకొని వస్తుంది. తను ఒకచోట పనిమనిషిగా చేరి హత్యానేరంలో ఇరుక్కుంటుంది. పల్లెటూరిలో వున్న వేణు టౌనుకు వచ్చి జరిగింది తెలుసుకొని పరిస్థితులు చక్కదిద్దడానికి ప్రయత్నిస్తాడు. చివరికి తల్లి, చెల్లెలు కలిసి సంసారానికి చేసిన ద్రోహం బయటా పడుతుంది. రఘు ఇంటికి వస్తాడు. అందరూ ఏకమౌతారు.

#VVA

పాటలు

అందాల చందమామ నిన్ను వలచి అలలులేపి ఎగసినాయే - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం

అమ్మా ఆకలే బాబూ ఆకలే చల్లని తల్లి మెల్లగ పిలిచి ఇవ్వండి - ఉడుతా సరోజిని

అమ్మా శ్రీ తులసి దాయారాశీమ్మ నీ పదమే తారకమే దేవి - పి.లీల

ఆశా ఇక లేనే లేదేమో ఇంతే ఇదేనా ప్రాప్తి ఏమో నా జీవితమంతా - పి.లీల

ఇటుపై నా గతేమి లేదా ఇక సుఖమే ఈ జగానా - పి.లీల

ఏడువకు ఏడువకు మా చిట్టితండ్రి భావిభారత బాల వీరుడవు నీవు - పి.లీల

కల నిజమాయెగా కోరిక తీరెగా సాటిలేని రీతిగా మదినెంతొ హాయిగా - జిక్కి

చిత్రమైనది విధి నడక పరిశోధనే ఒక వేడుక - సుసర్ల దక్షిణామూర్తి

టకు టకు టకు టకు టమకుల బండి - జిక్కి, ఘంటసాల బృందం - రచన: సదాశివబ్రహ్మం

దారుణమీ దరిద్రము విధాత సృజించిన భాధలందునన్ - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం

నగుబాటుకదా ఎటులో దిగులాయనయో మదిలో సొగసైన క్రాఫ్ పోయే - సుసర్ల దక్షిణామూర్తి

నా మాట వినవే రవ్వంత మోమాటమెందుకే ఇంత - సుసర్ల దక్షిణామూర్తి, సత్యవతి

సంసారం సంసారం ప్రేమ సుధాపూరం నవజీవన సారం - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మంసంసార సాగరంలో భార్యాభర్తలు తమ చిన్నారులతో, బంధువులతో,

ఆత్మీయులతో... ప్రేమ, అభిమానం, అనురాగం, ఆదరణ, ఆప్యాయతలను ఆస్వాదిస్తూ సాఫీగా సాగిపోవాలని చెప్పే ఈ పాట, గాన గంధర్వుడు #ఘంటసాల వెంకటేశ్వర రావు గళం నుంచి జాలు వారి అమృతతుల్యమైంది.

ఈ పాటను ఎప్పుడు విన్నా మనసులో ఆనందం కలుగుతుంది. ఆ పాట:


‘‘సంసారం, సంసారం, ప్రేమ సుధా పూరం


నవజీవన సారం... ।।సంసారం।।


తనవారెవరైనా దరిజేర ప్రేమమీర,


ఆదరించునాడే అనురాగపు సంసారం ।।సంసారం।।


ఇల్లాలొనర్చుసేవ, యాజమాని ఇల్లు బ్రోవ


కళకళలాడే పసివారితో సంసారం ।।సంసారం।।


❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐