చిత్రలేఖన_కళా_చక్రవర్తి! - #vaddadi_papayya

#చిత్రలేఖన_కళా_చక్రవర్తి! - #vaddadi_papayya **ప్రభుత్వాలకు, పరిశ్రమలకు మాత్రమే ఉండే ‘లోగో’ (010) కలిగిన ఏకైక వ్యక్తి ఆయనే! భూత, భవిష్యత్తులకు ప్రతీకలైన రెండు సున్నాల మధ్య ఠీవిగా నిల్చున్న ఒకటి ఆయన. అదే ఆయన లోగో! ఆయనే #అమర_చిత్రకారుడు_వడ్డాది_పాపయ్య . తెలుగు రాష్ట్రాల్లో వపా, పావనం, వడ్డాది పాపయ్య పేర్లు చెబితే గుర్తుకువచ్చేది అందమైన, ఆహ్లాదకరమైన అపురూప వర్ణ చిత్రాలు. యాభయ్యేళ్లపాటు (1942-92) తన చిత్రాలతో తెలుగు సంస్కృతిని, అపరబ్రహ్మ ఇతిహాసాలను, పురాణాలు, కాలాలు, రాగాలు, నక్షత్రాలు, పున్నములు, గ్రహాలు, కావ్యనాయకులు, పురాణ పురుషులు, ప్రసిద్ధ వ్యక్తులు, పండుగలు, ఆచార వ్యవహారాల్ని తన కళాచాతుర్యంతో కమనీయ దృశ్య కావ్యాలుగా మలచి కళాభిమానుల్ని రంగుల లోకంలో విహరింపజేసిన మహోన్నత చిత్రకారుడాయన! ఆయన చిత్రాలు తెలిసినంతగా ఆయన జీవిత విశేషాలు ప్రజలకు తెలియవు. ప్రచారం ‘**'వ.పా.’ శ్రీకాకుళంలో 1921 సెప్టెంబరు 10న మహాలక్ష్మి, రామమూర్తి దంపతులకు జన్మించారు. భారతీయ పురాణ, ఇతిహాసాలను, సంస్కృతీ సౌందర్యాలను కేరళకు చెందిన రాజా రవివర్మ, మహారాష్ట్రకు చెందిన...