#అప్రస్తుత ప్రసంగి -#జవాబులు .!

 


#అవధానాల్లో అప్రస్తుత ప్రసంగి వేసే కొంటె ప్రశ్నలకి  అవధాని అంత కంటే కొంటెగా  సమాధానం చెప్తే మంచి హాస్యం పుడుతుంది. అలాంటి కొన్ని ఉదాహరణలు ఎవరో నాకు పంపిస్తే మీతో పంచుకుంటున్నాను....మీరూ ఆనందిస్తారు కదా అని...
ప్రశ్న :-అవధానం చేసేవారికి చప్పట్లంటే చాలా ఇష్టమంట కదా! మరి మీకో
జవాబు :-నాకు చప్పట్లు ఇష్టం వుండవు. నాకు చప్ప అట్లుకంటే కారం అట్లంటేనే ఇష్టం
.
ప్రశ్న :-భార్య తన భర్తకు వడ్డిస్తోంది. భర్త 'పశువ' అన్నాడు. భార్య నవ్వుతూ 'కోతి' అంది ఏమిటిది?
జవాబు :-పశువ అంటే పళ్లెంనిండా శుభ్రంగా వడ్డించమని. కోతి అంటే కోరినంత తిను అని అర్థం
-
ప్రశ్న :-పద్యానికి, శ్లోకానికి తేడా ఏమిటి?
 జవాబు :-పద్యం వేగంగా వస్తుంది. శ్లోకం నెమ్మదిగా వస్తుంది. ఎందుకంటే స్లో...కమ్ కదా
-
ప్రశ్న:- అమెరికాలో భర్తల సమాధులను భార్యలు విసనకర్రలతో విసురుతారట. చిత్రంగాలేదు...
జవాబు:-భర్త చనిపోతూ ‘నా సమాధి ఆరేవరకైనా నువ్వు మరోపెళ్లి చేసుకోవద్దు...' అంటూ ప్రమాణం చేయించుకుంటాడు. భర్త సమాధి తొందరగా ఆరాలని భార్యలు అలా విసురుతూ వుంటారు.
-
ప్రశ్న : పెళ్లి కాకముందు వధువు, పెళ్లి అయ్యాక భార్య ఎలా కనిపిస్తుంది.
జవాబు : – పెళ్లి కాకముందు 'అయస్కాంతంలా', 'పెళ్లి అయ్యాక సూర్యకాంతంలా...’
-
ప్రశ్న :-ఉగాది కవి సమ్మేళనానికి కవితలను తీసుకురమ్మన్నారు
జవాబు :-ఇంతకీ ఏ కవి 'తలను' తీసికెళ్తున్నారు
-
ప్రశ్న :-పెళ్లికి వెళ్లుతూ పిల్లిని చంకన పెట్టుకొని వెళ్లటమంటే ఏమిటి?
జవాబు :-అవధానానికి వెళ్లుతూ అప్రస్తుత ప్రసంగిని వెంట పెట్టుకొని వెళ్లటం  
-
ప్రశ్న :-అవధానాలను నిషేధించే పని మీకు అప్పజెప్పితే ఏం చేస్తారు?
జవాబు :-దశల వారిగా చేస్తాను. ముందు అప్రస్తుత ప్రసంగాన్ని నిషేధిస్తాను
-
ప్రశ్న :-అవధానికి ఆశువులు ఎప్పుడొస్తాయి, ఆశ్రువులు ఎప్పుడొస్తాయి జవాబు :-ప్రశ్నవేస్తే ఆశువులు వస్తాయి. అవధానం జరిగి సత్కారం ఎగరగొడితే ఆశ్రువులు వస్తాయి
-
ప్రశ్న :-బోడిగుండుకు, మోకాలికి ముడిపెడతారెందుకు
జవాబు :-రెండింటి మీద అంతగా వెంట్రుకలు వుండవు కాబట్టి
-
ప్రశ్న :- మీకు రంభనిస్తే ఏం చేస్తారు? జవాబు :-ఆనందంగా ఇంటికి తీసికెళ్లి ఆకలి తీర్చుకుంటాను. రంభ అంటే అరటిపండు అని అర్థం
-
ప్రశ్న :-నాకీ మధ్య శ్రీకృష్ణుడిపై భక్తి పెరిగిపోతోంది. ఆయనలాగే ప్రవర్తించమంటారా..
జవాబు :-మీ ఆవిడకు ద్రౌపదిపై భక్తి పెరగకుండా చూసుకోండి.
-
ప్రశ్న :-మీ మైకులో బాంబు పెడితే ఏం చేస్తారు
జవాబు :-వెంటనే ఆ మైకు అప్రస్తుత ప్రసంగీకుడికి ఇచ్చి మాట్లాడమమటాను
-.
ప్రశ్న :-మీరెప్పుడైనా బూతు పనులు చేశారా జవాబు : -ప్రభుత్వ ఉద్యోగిని కదా ఎన్నికల్లో పోలింగ్ బూతు పనులు' తప్పవు
-
ప్రశ్న :-అర్ధనారీశ్వరుడైన ఈశ్వరుడు ధరించే బ్రా ఏమిటి?
జవాబు :-ఈశ్వరుడు కనపడేలా  కో 'బ్రాను' మెడలో ధరిస్తాడు
-
ప్రశ్న :-రవికలో ఇద్దరు దాగున్నారు చెప్పండి జవాబు :-ప్రతి రవికలో వాళ్లిద్దరు వుంటారు. ఒకరు రవి, మరొకరు కవి
-
ప్రశ్న :-అవధాని గారు మీది వర్ణాంతర వివాహమట..నిజమా?
జవాబు :-నిజమే నేను నల్లగా వుంటాను, మా ఆవిడ తెల్లగా వుంటుంది
-
ప్రశ్న :-పావురం అంటే మీకు ఇష్టమా
 జవాబు :-పావు ‘రమ్’ ఎవరికి ఇష్టం వుండదు
-
ప్రశ్న :-మీరు సారా త్రాగుతారా
జవాబు :-అవును అవధాన కవితామృతాన్ని మన 'సారా’ త్రాగుతాను
-
ప్రశ్న :-సన్యాసికి, సన్నాసికి తేడా ఏమిటి? జవాబు :-అందర్ని వదిలేసిన వాడు సన్యాసి, అందరూ వదిలేసిన వాడు సన్నాసి
-
ప్రశ్న :-మీకు వాణిశ్రీ అంటే ఇష్టమా
 జవాబు :- చాలా ఇష్టం. వాణి అంటే సరస్వతి -జ్ఞానం, శ్రీ అంటే సంపద.
-
ప్రశ్న: – రైలు పట్టాలకు, కాలి పట్టీలకు అనుబంధం ఏమిటి?
జవాబు:- రైలు, పట్టాల మీద వుంటుంది. పట్టీలు, కాలి మీద వుంటాయి
-
ప్రశ్న:- సభలో ఎవరైనా ఆవులిస్తే మీరేమి చేస్తారు?
జవాబు:- పాలిచ్చేవైతే యింటికి తోలుకెళ్తా
-
ప్రశ్న:- పురుషులందు పుణ్యపురుషులు వేరయా! అన్నాడు వేమన. మరి మీరేమంటారు?
జవాబు:-పురుషులందు పుణ్యపురుషులు 'ఏరయా!’
-
ప్రశ్న:-అవధానిగారు ఇక్కడికి రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వస్తే మీరేం చేస్తారు? జవాబు:- మరో నలుగుర్ని పిలిచి 'అష్టావధానం' చేస్తాను.
-
ప్రశ్న:- పెళ్లయిన మగవారిని ఏమీ అనరు. కానీ పెళ్లయిన ఆడవాళ్లను 'శ్రీమతి' అంటారెందుకు?
జవాబు:- పెళ్లయిన తరువాత 'స్త్రీ మతి' స్థితిమతి.
మీదే పురుషులు ఆధారపడుతారు గనుక
-
ప్రశ్న:- ప్రేమికుడికి, భర్తకు ఏమిటి తేడా గురువు గారు
జవాబు:- గొడవపడితే మాట్లడదేమోనని
భయపడేవాడు ప్రేమికుడు
మాట్లాడితే గొడవ పడుతుందేమోనని
భయపడేవాడు భర్త
-
ప్రశ్న:- అవధానిగారు కీర్తిశేషుల పెండ్లిపత్రిక వచ్చింది. పెళ్లికి వెళ్లమంటారా?
జవాబు:- తప్పకుండా వెళ్లు. కీర్తిశేషులంటే
...'కీర్తి' అమ్మాయి పేరు, 'శేషు' అబ్బాయిపేరు
☺😙👍🌹❤🙏☺😙👍🌹❤🙏☺😙👍🌹❤🙏☺😙👍🌹

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐