📌*ఆదిత్య హృదయం* ....!

 


🚩

🚩-శుభోదయం.-🚩🚩

📌*ఆదిత్య హృదయం* ....!

.

#తతౌ యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం

రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం

దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం

ఉపగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవానృషిః

.

@రామరావణ యుద్ధాన్ని చూడడానికి దేవతలతో కలసి అగస్త్య మహర్షి కూడా వస్తాడు. యుద్ధంలో అలసివున్న రాముడిని చూసిన అగస్త్య మహర్షి "రామా! ఈ సందర్భంగా నీకు వేదంవలె నిత్యమైనదీ, మంగళకరమైనదీ, పురాతనమైనదీ, ఆరోగ్యప్రదాయకమైనదీ, ఆయుర్వృద్ధిని చేసేదీ, అత్యంత ఉత్తమమైనదీ, అతి రహస్యమైనదీ, అత్యంత లాభదాయకమైన ఆదిత్య హృదయాన్ని ఉపదేశిస్తాను" అని పలికి,

ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడు.

🚩అగస్త్య ఉవాచ:

#రామరామహాబాహో శృణు గుహ్యం సనాతనం

యేన సర్వానరీన్ వత్స సమరే విజయష్యసి

ఓ రామా! గొప్ప బాహువులు గల రామా! ఈ రహస్యమును విను. నీకు యుద్ధంలో విజయం కలుగును గాక!

.

#ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం

జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం

.

@ఈ ఆదిత్య హృదయం వలన పుణ్యం, శత్రు నాశనం కలుగును. దీనిని చదువుట వలన జయం, శుభం, పరము కలుగును.

.

#సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం

చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధన ముత్తమం

.

@ఇది అత్యంత శుభకరమైనది, మంగళకరమైనది, అన్ని పాపములను నాశనం చేయునది. చింత, శోకం, ఒత్తిడిలను తొలగించి ఆయుర్వృద్ధి కలిగించును

..

#రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం

పూజయస్వవివస్వంతం భాస్కరం భువనేశ్వరం

.

@ప్రకాశకుడైన, దేవాసురులచే పూజింపబడిన, తన ప్రకాశంతో లోకాన్ని ప్రకాశింపజేస్తున్న ఆ భువనేశ్వరున్ని పూజింపుము

..

#సర్వ దేవాత్మకో హ్యేశ తేజస్వీ రశ్మిభావనః

ఏశ దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః

.

@ఈ ఆదిత్యుడు సకలదేవతలకు ఆత్మయైనవాడు. గొప్ప తేజం కలవాడు. తన కిరణాలతో లోకాలను రక్షిస్తుంటాడు. తన కిరణాలను ప్రసరింపజేయడం ద్వారా ఎండావానలను కలిగించి దేవదానవులను, సకలజనులను కాపాడుతున్నాడు.

.

#ఏశ బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః

మహేంద్రో ధనదః కాలో యమస్సోమో హ్యపాంపతిః

.

@ఇతడు సమస్త శరీరాలు గలవాడగుటచే, ఇతడే బ్రహ్మా, విష్ణువు, కుమారస్వామి, ప్రజాపతుల రూపం, దేవేంద్రుడు, కుబేరుడు, కాలుడు, యముడు, చంద్రుడు, వరుణుడు.

.

#పితరో వసవః సాధ్యాః అశ్వినౌ మరుతో మనుః

వాయుః వహ్నిః ప్రజాప్రాణా ఋతు కర్తా ప్రభాకరః

@ఇతడే పితృదేవతలు, వసువు, పంచభూతాలు, ప్రజలు శరీరంలోని ప్రాణవాయువు. ఋతువులను కలిగించే ప్రభాకరుడు.

🚩ఆదిత్య స్తోత్ర ప్రారంభం :

#ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్

సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః

.

@నీవు అదితి కుమారుడవు. నీవు సూర్యుడవు. నీవు ఆకాశంలో సంచరించేవాడివి. వర్షంతో జగాన్ని పోషించేవాడవు. పసిడి కిరణములు కలవాడవు. బంగారు తేజస్సు కలవాడవు. భానుడవు, హిరణ్యం రేతస్సుగా కలవాడవు. నీవు దివాకరుడవు.

.

#హరిదశ్వస్సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్

తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తండ అంశుమాన్

.

@నీవు ఆకుపచ్చ గుఱ్ఱములు కలవాడవు. సహస్ర కిరణములు కలవాడవు. చీకటిని సంహరించేవాడివి. శుభములు కలుగజేసేవాడివి. బ్రహ్మాండాన్ని మరలా జీవింపజేయువాడవు. ప్రకాశవంతమైనవాడవు.

.

#హిరణ్యగర్భః శిశిరస్తపనో భాస్కరో రవిః

అగ్నిగర్భోఅదితేః పుత్రః శంఖః శిశిరనాశనః

.

@నీవు హితమనే రమణీయ మనస్సు కలవాడవు. చల్లనివాడవు. అగ్నిగర్భుడవు. అదితిపుత్రుడువు. సాయంకాలంలో శమించువాడవు. మంచును పోగొట్టేవాడవు.

.

#వ్యోమనాథ స్తమోభేదీ ఋగ్ యజుస్సామ పారగః

ఘనవృష్టిరపాం మిత్రో వింధ్య వీథీ ప్లవంగమః

.

@ఆకాశానికి నాధుడవు. చీకటిని పోగొట్టేవాడవు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదంల పారంగుడవు. గొప్ప వర్షాన్ని కురిపించేవాడవు. నీటికి మిత్రుడవు. ఆకాశామార్గమున శీఘ్రంగా పోయేవాడవు.

/

#ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః

కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వ భవోధ్భవః

.

@ఎండ నిచ్చేవాడవు. గుండ్రనివాడవు. మృత్యువువి. ఉదయాన్నే లేతకిరణంలు కలవాడవు. మద్యాన్నం సర్వాన్ని తపింపజేయువాడవు. కవివి. మహాతేజుడవు. సమస్త కార్యాలకు కారణభూతుడవు.

.

#నక్షత్ర గ్రహతారాణాం అధిపో విశ్వ భావనః

తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోస్తుతే

.

*@నక్షత్రాలకు గ్రహాలకు నాయకుడవు. నీవే ఈ విశ్వ ఉనికికి కారణం. అన్ని తేజస్సుల కంటే తేజస్సును ఇచ్చువాడవు. ద్వాదశాదిత్యులలో అంతర్యామివైన నీకు నమస్కారం

..

#నమః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః

జ్యోతిర్గణానాం పతయే దినధిపతయే నమః

.

*@తూర్పుకొండతో కూడినవాడికి నమస్కారం. పడమటకొండతో కూడినవాడికి నమస్కారం. జ్యోతిర్గణాలకు అధిపతివైన నీకు నమస్కారం. పగటిని కలిగించే నీకు నమస్కారం.

.

#జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః

నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః

.

*@జయుడకి నమస్కారం. జయభద్రునికి నమస్కారం. పచ్చని గుఱ్ఱములు గల నీకు నమస్కారం. సహస్రాంసునకు నమస్కారం.

.

#నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః

నమః పద్మ ప్రబోధాయ మార్తాండాయ నమో నమః

.

*@ఉగ్రునకు నమస్కారం. వీరునకు, వేగంగా పయనించే నీకు నమస్కారములు. కమలములను వికసింపజేయు నీకు నమస్కారం. మార్తుండునికి నమస్కారం.

.

#బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యోదయాదిత్యవర్చసే

భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః.

.

*@బ్రహ్మా, విష్ణు, మహేశుల అధిపతికి నమస్కారం. ఆదిత్య వర్చస్సుతో ప్రకాశించువానికి నమస్కారం. సర్వభక్షకునికి నమస్కారం.

.

#తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే

కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః

.

@*చీకటిని పోగొట్టువానికి నమస్కారం. శత్రువులను వధించేవానికి నమస్కారం. గొప్ప తేజస్సు గలవానికి నమస్కారం. స్వయంప్రకాశం గలవానికి నమస్కారం. దేవునికి, జ్యోతిషపతికి నమస్కారం.

.

#తప్త చామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే

నమస్తమోభినిఘ్నాయ రుచయే లొకసాక్షిణే

.

@*బంగారుకాంతివంటి కాంతి కలవాడు, అగ్నిరూపునకు, జగత్తుకు కారణమైనవాడికి నమస్కారం. విశ్వకర్మకు నమస్కారం. ప్రకాశాస్వరూపునకు నమస్కారం. లోకసాక్షికి నమస్కారం.

.

#నాశయత్యేష వై భూతం తదైవ సృజతి ప్రభుః

పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః

.

*@ఈ ఆదిత్యుడే మహా ప్రళయకాలంలో ప్రపంచాన్ని నాశనం చేస్తాడు. తిరిగి తానే జగత్తును సృష్టిస్తాడు. నాశకాలం తప్ప, తక్కిన కాలంలో చక్కగా పరిపాలిస్తాడు.ఇతడు కిరణాలతో శోశింపజేస్తాడు, ఎండా, వానలను ఇస్తాడు.

.

#ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః

ఏష చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణాం

.

#*సకల జీవులు నిద్రిస్తుండగా, వాటిలో అంతర్యామిగా మేల్కొని ఉంటాడు. అగ్నిహోత్రం, అగ్నిహోత్రఫలమూ ఇతడే.

.

#వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ

యాని కృత్యాని లోకేషు సర్వన్యేషు రవి: ప్రభుః

.

@*వేదాలు, యజ్ఞాలు, యజ్ఞఫలమూ ఇతడే. లోకంలోగల సర్వకార్యములకు ఈ రవియే ప్రభువు.

.

#ఏనమాపత్సు కృచ్చేషు కాంతారేషుభయేషు చ

కీర్తయన్ పురుషః కశ్చిన్నావసీదతి రాఘవః

.

*@రామా! ఆపదలలో, భయంకలిగించే ప్రదేశాలలో, ఈ స్తోత్రంతో సూర్యుడిని కీర్తించేవాడు అన్ని ఆపదలనుండి రక్షింపబడతాడు.

#పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిమ్

ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి

.

@*నువ్వు మనస్సును ఏకాగ్రంచేసి ఆ దేవదేవుడు జగన్నాధుడైన సూర్యున్ని ఆరాదించు. ముమ్మార్లు ఈ స్తోత్రాన్ని జపిస్తే యుద్ధంలో విజయం నీకే.

.

#అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి

ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతమ్

.

'*@మహాపరాక్రమశాలీ! నువ్వు ఈ క్షణాన్నే రావణుని సంహరిస్తావు' అని రామునితో అగస్త్య మహర్షి చెప్పి అక్కడినుండి నిష్క్రమిస్తాడు.

.

#ఏతచ్చ్రుత్వా మహాతేజా నష్టశోకోభవత్తదా

ధారయామాస సుప్రీతొ రాఘవః ప్రయతాత్మవాన్

.

*@అప్పుడు మహాతేజోవంతుడైన రాముడు ధైర్యంతో ఆనందమును పొంది, నిర్మల హృదయంతో ఆదిత్య హృదయంను జపించాడు.

.

#ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వాతు పరంహర్ష మవాప్తయాన్

త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్

.

*@రాముడు అలా ఆదిత్య హృదయమును జపించి మహదానందభరితుడయ్యాడు. తర్వాత ముమ్మార్లు ఆచమనం చేసి, మిగుల పరాక్రమముతో విల్లు ధరించాడు.

.

#రావణం ప్రేక్ష్య హ్రుష్టాత్మా యుద్ధాయ సముపాగమత్

సర్వ యత్నేన మహతా వధే తస్య ధృతోభవత్

.

@శ్రీరాముడు రావణున్ని చూసి ఉత్సాహంతో యుద్ధం చేయడం ప్రారంభించాడు. రావణున్ని సంహరించాలని ధృడంగా నిశ్చయించుకున్నాడు

..

#అథ రవి రవదన్నిరీక్ష్య రామం

ముదితమన్యాః పరమం ప్రహృష్యమాణః

నిశిచరపతి సంక్షయం విదిత్వా

సురగణమధ్యగతో వచస్త్వరేతి

.

@అలా తనను జపించుతున్న శ్రీరామున్ని చూసి, రాక్షసరాజు వినాశనంను గ్రహించి, చాలా ఆనందంతో 'నీవింక రావణుని వధింప త్వరపడమని, నీకు విజయం తధ్యమ'ని సూర్యభగవానుడు రామునితో చెప్పెను.

##ఇతి ఆదిత్య హృదయే సంపూర్ణం.##

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐