Posts

Showing posts from January, 2023

 బారిష్టరు పార్వతీశం - (😎 ప్రథమ భాగము (1957) రచించినవారు మొక్కపాటి నరసింహశాస్త్రి అధ్యాయము 7

Image
​ 7 ప్లాటుఫారము మీదికి రైలు వచ్చినట్టుగా, మార్సేల్సులో స్టీమరు సముద్రంలోకికట్టిన ఫ్లాటుఫారము దగ్గిరికి చేరింది. ప్లాటుఫారమునిండా జనము కిటకిటలాడుతున్నారు. స్టీమరుమీద వున్నవాళ్లు కింద ఉన్నవాళ్ళకీ, కింద ఉన్నవాళ్ళు స్టీమరు మీది వాళ్ళకి చేతులూపడము, జేబు రుమాళ్ళు విసరడము, ముద్దులు గిరవాటు వేయడము, వీళ్ళతాలూకు బంధువులంతా వీళ్ళని చూడడానికి వచ్చారుగదా అనుకున్నాను. స్నేహితులు గాని బంధువులుగాని లేనివాణ్ణి నే నొక్కణ్ణే. నర్సాపురమునుంచి నేనెప్పుడింటికి వచ్చినా ముందు ఉత్తరము వ్రాస్తే మా అమ్మ ఎంతపని ఉన్నా వీధిలో నిలుచుని నా రాకకు ఎదురు చూస్తూ ఉండేది. మానాన్న ఏదో పని ఉన్నట్టుగా ఊరు బయటకు నాకెదురుగుండా వచ్చేవాడు. ఇవ్వాళ ఇక్కడెవళ్లూ లేకపోయేటప్పటికి ఎంతో దుఃఖము వచ్చింది. కొత్త ప్రపంచములోకి వెళుతున్నాను కదా! అనుభవము లేనివాణ్ణి, కుర్రవాణ్ణి, వెనక ఆసరా ఎవళ్లూ లేకుండా ఈ దేశములో ఎలా నిగ్రహించుకో గలనా అని భయమువేసింది. ఒక్కొక్కళ్లే దిగి కిందనున్న వాళ్లను కౌగలించుకుని ఆనంద బాష్పములు కారుస్తూ ఉంటే, నాకూ కళ్ళవెంబడి నీళ్ళువచ్చి అట్టే చూస్తూ నిలబడ్డాను. నేనొక్కణ్నితప్ప తక్కిన వాళ్ళంతా దిగారు. ఆఖరుమనిషి ​వెళ్ళి పోతూండ

సంక్రాంతి.! .

Image
  సంక్రాంతి.! . సంక్రాంతి అంటే- ఎలాంటి నిర్వచనాలు తెలీని రోజులవి. ఒకటే తెలుసు. సంబరం. ఏ పండగలోను ఇన్నేసి సరదాలు వుండవని సంబరం. ఇల్లిల్లూ పచ్చని తోరణమై, వీధులన్ని జన సందోహమై, హృదయాలన్ని ఒక చోట చేరి సంతోషాల్ని కలబోసుకునే ఒకే ఒక్క ఉత్సవం. ఒకే ఒక్క పండగ వైభవం. సంక్రాంతి అంటే- సందళ్ళ పుట్ట. సరదాల గుట్ట. జ్ఞాపకాల తుట్టె. పుష్యం చలి పక్కదుప్పటి తీయనీదు. నిద్ర బద్ధకం కళ్ళు తెరవనీదు. బడికెళ్ళాలి కానీ లేవబుధ్ధి కాదు. అలాంటి లేత బాల్యం, ఎలా లేచి కూర్చునేదో తెల్లారుఝామునే! .“అమ్ములూ.. గొబ్బెమ్మలూ” అమ్మ పిలిచేది. పెరట్లోకి దూకి చూస్తే మంచుకి తడిసి మందారలు మొగ్గలయ్యేవి. రెక్కలు ముడుచుకు బజ్జున్న గులాబీలు, పసుపైన ముళ్ళగోరింటలు, వంగరంగు డిసెంబరాలు. ఉహు! ఇవి కాదుగా నాక్కావల్సినవి. చారడంత చామంతులు, అరచేయంత గుమ్మడి పూలు. పక్క మొగ్గలు తుణగకుండా, చిగురుటాకులు తుంచకుండా కోయాలని అమ్మ చెప్పేది. బంతి మడి దగ్గర ఆగిన అడుగులు కదిలేవా ఒక పట్టాన!? కళ్ళు తిప్పుకోనీయని రంగులుండేవి. ఎన్ని రంగులనీ… గడపచ్చని ముద్ద బంతి, కనకాంబరపు రెక్క బంతి కాషాయంలొ పెద్ద బంతి నిమ్మ పండులా మెరుస్తూ మరో బంతి బొడిపె బంతి కారం బంతి కాగడా బ

బారిష్టరు పార్వతీశం -(7.)  ప్రథమ భాగము (1957) రచించినవారు మొక్కపాటి నరసింహశాస్త్రి

Image
  అధ్యాయము 6 అలా ఎంతసేపున్నానో నాకు తెలియదు. ఒక మనిషి వచ్చి నా బుజముమీద చెయ్యి వేశాడు. నిద్రలోనుంచి లేచినట్లు ఉలిక్కిపడి వెనక్కు తిరిగి చూశాను. ఒక పక్క ఒక దొర ఏమిటీ చిన్నతన మన్నట్టుగా నా కేసి చూస్తున్నాడు. ఇంకో వైపున ఒక దొరా దొరసానీ, నా దుఃఖము గ్రహించినట్టుగా, నాకేసి జాలిగా చూశారు. నా బుజము మీద చెయ్యివేసిన అతను తన తోటి కూడారమ్మని సంజ్ఞ చేశాడు. ఎందుకో తెలియకుండా కండ్లు తుడుచుకుని అతని వెంబడే వెళ్లాను. రెండంతస్థులు మెట్లుదింపి అడుగున ఒక హాలులోనుంచి ఒక చిన్నగదిలోకి తీసుకువెళ్లి నా సామానుకేసి చూపించాడు. ఇదే నే నుండవలసిన గది కాబోలు ననుకున్నాను. గది చాలా చిన్నది. అందులో ఒక పక్కను ఒక దానిమీద రెండు మూడు పొడుగాటి బల్లలున్నాయి. వాట్లపైన పరుపులు పరిచివున్నాయి. ఒక పక్క గోడకి చిన్న పింగాణీ బూర్లె మూకుడూ అందులోకి కుళాయి వున్నవి. పక్కనే ఒక సబ్బుపెట్టి వున్నది. ఇంకోపక్క రెండు తువాళ్లు వున్నాయి. నా తలాపు దిక్కు నున్న గోడకి గుండ్రని రంధ్రముమూ, దానికో గాజుతలుపూ వున్నది. అదే మాగది కిటికీ. అందులోనుంచి సముద్రము చక్కగా కనపడుతుండేది. పై బల్లలమీది కెక్కడాని కొక చిన్న నిచ్చెన వున్నది. నేను గదిలోకి వచ్చేసరికే పై

🚩🚩-హరి కథ ల కథ -

Image
  “హరికధ అనేది సర్వ కళాసమాహారం. హరికథ చెప్పే దాసు గారికి సాహిత్యం, సంగీతం క్షుణ్ణంగా వచ్చి తీరాలి. రామాయణ,భారత,భాగవతాదులు కరతలామలకంగా వుండాలి. కొద్దో గొప్పో నాట్యం తెలిసి వుండాలి. వీటన్నితో పాటు సమయస్పూర్తి, చతురత, రక్తి కట్టించే సామర్ధ్యం అవసరం. అభినయ కళ తెలిసివుండడం కూడా ముఖ్యం. ఇన్ని వుంటేనే ఉంటేనే దాసుగారికి బంతిపూల దండలు దండిగా పడేది. హరి కథలు చెప్పే దాసుగారిని భాగవతార్ అని పిల్చేవారు. అమ్ముల విశ్వనాథ భాగవతార్ అలా. హరికథకి వయోలిన్, మృదంగం పక్క వాయిద్యాలు. దాసుగారు కుడిచేతిలో చిడతలు పట్టుకొని కీర్తనలు పాడేటప్పుడు తాళం వేస్తూ వుండే వారు. కాళ్ళకు గజ్జెలు. దాసు గారి ఆహార్యం పట్టు పంచె, పట్టు ఉత్తరీయం, నుదుట సింధూరం. అన్నట్టు దాసుగారు తనతో ఎప్పుడూ తీసుకు వెళ్ళేది శ్రుతి బాక్స్. “కథా ప్రారంభంలో దాసుగారు పక్క వాయిద్యాల సమేతంగా వేదిక మీద కూర్చునే గణపతి ప్రార్ధనతో మొదలుపెట్టి తాను ఏ కధ చెప్పదలచుకొన్నారన్నది సూచన ప్రాయంగా తెలియచేస్తూ రెండు మూడు కీర్తనలు పాడే వారు. తర్వాత లేచి నిలబడి, గజ్జెలు కళ్ళకు అద్దుకొని, వాటిని కాళ్ళకు కట్టుకొని, ‘శ్రీమద్రమారమణ గోవిందా’ అని తానంటూ, సభికులందరి చేతా గట్ట

 🚩🚩శ్రీరామరామరామేతి రమేరామే...

Image
"శ్రీరామరామరామేతి రమేరామే మనోరమే  సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే." #శుభోదయం శ్రీపెయ్యేటి రంగారావు  గారి వివరణ . ✍️మన శాస్త్రాలు, మంత్రాలు, శ్లోకాలు అన్నీ మనం నేర్చుకోని సంస్కృతం లో ఉన్నాయి.  అరకొర జ్ఞానంతో ఎవరు పడితే వారు తలకొక రకంగా వక్రీకరిస్తూ పోతున్నారు.  ఒక పురోహితుల వారు తత్తుల్యం అన్నది తప్పు, తస్తుల్యం అని చదవాలి అని సెలవిచ్చారు. దానికి వారి సమాధానం: శ్రీ రామ రామ రామ ఇతి (ఇది) రమే ( ఓ రమా) రామే (రాముని యందు) మనోరమే ( మనోహరమైన దానా) సహస్ర నామ (సహస్రనామముల) తత్ తుల్యం( తో సమానము) రామనామ ( రామనామము) వరాననే (శోభనమైన ముఖము కలదానా.. .@@ వరాననే (శోభనమైన ముఖము కలదానా మనోరమే ( మనసుకు ఆనందము కలిగించు దానా) రమే ( ఓ రమా) (సంబోధన) శ్రీ రామ రామ రామ ఇతి (ఇది) రామనామ ( రామనామము) రామే (రాముని యందు) సహస్ర నామ (సహస్రనామముల) తత్ తుల్యం( తో సమానము) కనుక తత్తుల్యం అనాలి. తత్ +తుల్యం =తత్తుల్యం ☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️

 బారిష్టరు పార్వతీశం -(6.)  ప్రథమ భాగము (1957) రచించినవారు మొక్కపాటి నరసింహశాస్త్రి అధ్యాయము 5

Image
​ 5 సుమా రేడుగంట లైంది. అప్పుడే దిగవలసిన వాళ్ళంతా దిగారు. నేనే ఆఖరు. నేను నిమ్మళంగా దిగాను. కిందంతా మహా హడావిడిగా ఉంది ఇటు వెళ్ళేవాళ్ళూ అటు వెళ్ళేవాళ్లూ; స్టీమరుమీదనుంచి దిగినవాళ్ళకోసం వచ్చిన వాళ్ళూ, ఊరికే వేడుక చూడ్డానికి వచ్చినవాళ్ళూ, కూలివాళ్ళూ; ఒకళ్లేమిటి, సముద్రము ఒడ్డంతా కిటకిట లాడుతున్నది. హార్బరు నిండా స్టీమర్లు చాలా ఉన్నాయి. ఈ హడావిడి అంతా చూస్తూ నిమ్మళంగా సామాను దగ్గిరికి వెళ్ళాను. సామానంతా జాగ్రత్తగానే ఉంది. పాపము పెట్టెకూడా ఏమీ నలిగిపోకుండానే దింపారు, వాళ్ళ ధర్మాన్ని. ఒక కూలివాడిని కేకవేసి సామాను వాడినెత్తిమీద పెట్టి బండ్లదగ్గిరికి వస్తున్నాను. వెనుకనుంచి ఎవరో పిలుస్తున్నట్టు వినబడ్డది. నన్ను కాదనుకున్నాను మొదట. ఇక్కడ నన్నుపిలిచేవా రెవరుంటారని ముందుకి నడిచాను. మళ్ళీ కేక విన బడేసరికి ఆగి వెనక్కిచూశాను. రాత్రిస్టీమరులో బంట్రోతు ఆదిక్కుమాలిన దొరసాని టోపీ తీసుకుని పరుగెత్తుకుని వస్తున్నాడు. అది నాకు వదిలే ఉపాయము కనబడలేదు. మొదటనే రైలులోనుంచి ఎక్కడైనా పారేస్తే తీరిపోయేది; ఇంతబాధ లేకపోయేది. పోనీవృధాగా పారేయడ మెందుకు, రైలులో విడిచిపెడితే ఎవళ్ళయినా తీసుకుంటారని ఆలోచిస్తే అదేమీ ​సాగి

బారిష్టరు పార్వతీశం -(5.) ప్రథమ భాగము (1957) రచించినవారు మొక్కపాటి నరసింహశాస్త్రి అధ్యాయము 4

Image
      బారిష్టరు పార్వతీశం -(5.) ప్రథమ భాగము (1957) రచించినవారు మొక్కపాటి నరసింహశాస్త్రి అధ్యాయము 4 ​ 4 ప్లాటుఫారముమీద పోర్టర్లు, 'తూత్తు కుడై' అని కేకలు వేస్తున్నారు. కొలంబో పోయే వాళ్ళంతా ఇక్కడ దిగండి అని కొందరు కేకలువేశారు. సెకండు క్లాసులోనుంచి దిగేసరికి దర్జాగా వుండాలని నేను కొత్త సూటు తొడుక్కుని ఎర్రసిల్కు తలగుడ్డ చుట్టుకుని చెన్నపట్నంలో కొన్న దొరసాని టోపీమట్టుకు రైలులో విడిచిపెట్టి తక్కిన సామాను తీసుకుని పెట్టెలోనుంచి దిగాను. కూలివాడొకడు వచ్చి సామాను తీసుకుంటానన్నాడు. సరేనని నేను వాడితో బేరమాడి ముందుకు సాగాను. గేటుదగ్గిరికి వెళ్ళడంతోటే టిక్కట్టు కలెక్టరు చూసి, అలా దయచేయండని దారి చూపించాడు. అలా వెళ్లే టప్పటికి అక్కడొక పెద్దమనిషి సామాను చూపించమన్నాడు. కూలివాడి నెత్తిమీదవుంది, కనబడడం లేదా' అన్నాను. అలాకాదు పెట్టితీసి చూపించాలన్నాడు. మీరు కొలంబో ఎందుకు వెళుతున్నా రన్నాడు. నాగుండె బద్దలయించి. ఇంటి దగ్గర చెప్పకుండా వచ్చిన సంగతి వీడి కెలా తెలిసిందా అనుకున్నాను. అయినా కొంత ధైర్య స్థైర్యములు కలవాడిని గనుక వెర్రిమొహము వేయకుండా, ఎందుకయితే నీ కెందుకన్నాను. సరే పోనీలెండి నా కక్కరలే

బారిష్టరు పార్వతీశం - (4.)-ప్రథమ భాగము (1957)  రచించినవారు మొక్కపాటి నరసింహశాస్త్రి అధ్యాయము 3

Image
  ​ 3 రైలు బయలుదేరింది. ఇంకో పది నిమిషాలకు 'ఎగ్మూరు' స్టేషనులో ఆగింది. అక్కడ బంట్రోతు నడిగితే, ఇదంతా చెన్నపట్నమే నన్నాడు. ఎంత గొప్ప పట్న మని ఆశ్చర్య పోతూ, ఊరు మధ్యనుండి కూడా రైలు వేశారు, ప్రజలకేమీ ప్రమాద ముండదుగదా అనుకున్నాను. ఇంతట్లోకే నా పెట్టెలోకి, నలుగురు అరవవాళ్ళు రాబోయారు. 'చిలకల్లా వస్తున్నారా నాయనా, అవతలికి దయ చెయ్యం' డన్నాను. వాళ్ళు నామాట వినుపించుకోలేదు. మాట్లాడకుండా తలుపు తీస్తున్నారు. 'అబ్బాయి, మీకు తెలియదు. ఇది సెకండుక్లాసు, ఇందులో ఎక్కితే జుల్మానా వేస్తారు. అవతలికి వెళ్ళి యింకో పెట్టిలో ఎక్కం' డన్నాను. అందులో ఒకడు నా ముఖముకేసి చూసి 'నువ్వు ఇక్కడున్నావే. ఫోర్తుక్లాసు పెట్టెలో ఎక్కవలసిన మనిషివలె వున్నావు, దయ చేయ' మని వచ్చీ రాని తెలుగులో అన్నాడు. వాళ్ళ సాహసము చూస్తే నా కాశ్చర్యము వేసింది. 'చిత్తము, పెంకెతనానికి సౌందర్యానికి మీది పుట్టిల్లు. ఇంక కబుర్లకేమి లోటు గనుక, అధిక ప్రసంగము చెయ్యకు. దయ చెయ్య' మన్నాను. నేను అన్నదంతా వాళ్లకు బాగా అర్థము కాలేదని తోస్తుంది. అందుచేత నామాట వినిపించుకోనట్టు నటించారు. ​'సరిగదా అయ్యా, నీవు జాస్తి వాయా