🚩🚩శ్రీరామరామరామేతి రమేరామే...



"శ్రీరామరామరామేతి రమేరామే మనోరమే
 సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే."
#శుభోదయం
శ్రీపెయ్యేటి రంగారావు  గారి వివరణ .
✍️మన శాస్త్రాలు, మంత్రాలు, శ్లోకాలు అన్నీ మనం నేర్చుకోని సంస్కృతం లో ఉన్నాయి.
 అరకొర జ్ఞానంతో ఎవరు పడితే వారు తలకొక రకంగా వక్రీకరిస్తూ పోతున్నారు.
 ఒక పురోహితుల వారు తత్తుల్యం అన్నది తప్పు, తస్తుల్యం అని చదవాలి అని సెలవిచ్చారు.
దానికి వారి సమాధానం:
శ్రీ రామ రామ రామ ఇతి (ఇది)
రమే ( ఓ రమా)
రామే (రాముని యందు)
మనోరమే ( మనోహరమైన దానా)
సహస్ర నామ (సహస్రనామముల)
తత్ తుల్యం( తో సమానము)
రామనామ ( రామనామము)
వరాననే (శోభనమైన ముఖము కలదానా..
.@@
వరాననే (శోభనమైన ముఖము కలదానా
మనోరమే ( మనసుకు ఆనందము కలిగించు దానా)
రమే ( ఓ రమా) (సంబోధన)
శ్రీ రామ రామ రామ ఇతి (ఇది)
రామనామ ( రామనామము)
రామే (రాముని యందు)
సహస్ర నామ (సహస్రనామముల)
తత్ తుల్యం( తో సమానము)
కనుక తత్తుల్యం అనాలి.
తత్ +తుల్యం =తత్తుల్యం
☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐