ప్రసిద్ధి పొందిన పద -పల్లవాలు 🌹

 


ప్రసిద్ధి పొందిన పద -పల్లవాలు 🌹
🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
1. ‘‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు నా ఇచ్ఛయేగాక నాకేటి వెఱపు’’
-దేవులపల్లి కృష్ణ శాస్త్రి🌺
2. ‘‘కప్పివుంచితే కవిత్వం విప్పి చెబితే విమర్శ’’
డా.సి.నారాయణరెడ్డి🌺
3. ‘‘ఉదయం కానేకాదు అనుకోవడం నిరాశ ఉదయించి అట్లానే వుండాలనుకోవడం దురాశ’’
- కాళోజి🌺
4. ‘‘గత కాలము మేలు వచ్చుకాలముకంటెన్‌’’
- నన్నయ 🌺
5. ‘‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతినాపలేరు’’
-సుబ్బారావు పాణిగ్రాహి 🌺
6. ‘‘రాజే కింకరుడగు కింకరుడే రాజగు’’
-బలిజేపల్లి లక్ష్మీకాంతం🌺
7. ‘‘వలపెరుంగక బ్రతికి కులికి మురిసేకన్న వలచి విఫలమ్మొంది విలపింపమేలురా’’
-బసవరాజు అప్పారావు 🌺
8. ‘‘నిఖిలలోకమెట్లు నిర్ణయించినగాని తిరుగులేదు విశ్వనరుడ నేను’’
-గుర్రం జాషువా 🌺
9. ‘‘అత్తవారిచ్చిన అంటుమామిడితోటనీవు కోరగ వ్రాసి ఇచ్చినాను’’
- కాళ్ళకూరి నారాయణరావు 🌺
10. ‘‘గాయపడిన కవి గుండెల్లో వ్రాయబడని కావ్యాలెన్నో’’
- దాశరధి 🌺
11. ‘‘ప్రజకు రక్షలేదు పత్రికలేనిచో’’
-నార్ల వెంకటేశ్వర రావు 🌺
12. ‘‘బావా, ఎప్పుడు వచ్చితీవు’’
- తిరుపతి వెంకట కవులు🌺
13. ‘‘తాంబూలాలిచ్చేశాను, తన్నుకు చావండి’’
- గురజాడ 🌺
14. ‘‘మాకొద్దీ తెల్ల దొరతనము’’
- గరిమెళ్ళ సత్యనారాయణ 🌺
15. ‘‘పరమేశా గంగ విడుము పార్వతి చాలున్‌’’
- శ్రీనాథుడు 🌺
16. ‘‘ఇందు గలడందు లేడని సందేహము వలదు... ఎందెందు వెదకిచూచిన అందందే గలడు’’
- పోతన 🌺
17. ‘‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా’’
- గద్దర్ 🌺
18. ‘‘తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు’’
- శ్రీ శ్రీ 🌺
19. ‘‘చిరునవ్వుల వరమిస్తావా చితినుంచి లేచొస్తాను మరుజన్మకు మాటిస్తావా ఈ క్షణమే మరణిస్తాను’’
- వెన్నలకంటి 🌺
20. ‘‘రావోయి బంగారి మావా నీతోటి రాహస్యమొకటున్నదోయీ’’
- కొనకళ్ల వెంకటరత్నం 🌺
1. ‘‘వనిత తనంత తా వలచివచ్చిన చుల్కన కాదె యేరికిన్‌’’
- అల్లసాని పెద్దన 🌺
22. ‘‘ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరేగదా?’’
- చేమకూరి వేంకటకవి 🌺
23. ‘‘ఎందరో మహానుభావులు అందరికీ వందనములు’’
- త్యాగయ్య
24. ‘‘రాజుల్‌ మత్తులు, వారిసేవ నరకప్రాయంబు......’’
- ధూర్జటి 🌺
25. ‘‘ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురు......’’
- బద్దెన 🌺
26. ‘‘భూమినాదియనిన భూమి ఫక్కున నవ్వు దానహీను జూచి ధనము నవ్వు’’
- వేమన🌺
27. ‘‘నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ’’
- కంచర్ల గోపన్న 🌺
28. ‘‘పల్లెటూరి పిల్లగాడా పసులగాసే మొనగాడా’’
- సుద్దాల హనుమంతు 🌺
29. ‘‘నువ్వు ఎక్కదలచుకున్న రైలు ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు’’
- ఆరుద్ర
30. ‘‘తల్లి ఒక్కతె మనకు తెలుగోడా సవతిబిడ్డల పోరు మనకేలా’’
- వేముల శ్రీ కృష్ణ 🌺
31. ‘‘వీరగంధము తెచ్చినారము, వీరుడెవ్వడొ తెల్పుడీ’’
- త్రిపురనేని రామస్వామి 🌺
32. ‘‘మాదీ స్వతంత్రదేశం మాదీ స్వతంత్ర జాతి’’
- బాలాంత్రపు రజనీకాంతరావు 🌺
33. ‘‘ఉప్పొంగిపోయింది గోదావరీ తాను తెప్పున్న ఎగిసింది గోదావరీ’’
- అడవి బాపిరాజు 🌺
34. ‘‘కూర్చుండ మా యింట కురిచీలు లేవు’’
- కరుణశ్రీ 🌺
35. ‘‘ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనమురా నడుమ దొర ఏందిరో వాని దూకుడేందిరో’’
- గుడ అంజయ్య🌺
36. ‘‘తను శవమై - ఒకరికి వశమై తనువు పుండై - ఒకరికి పండై ఎప్పుడూ ఎడారై - ఎందరికో ఒయాసిస్సై’’
- అలిసెట్టి ప్రభాకర్ 🌺
37. ‘‘మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే మమ్మల్ని విభజించి పాలిస్తోంది’’
- సావిత్రి 🌺
38. ‘‘నేను పుట్టకముందే దేశద్రోహుల జాబితాలో నమోదై వుంది నా పేరు’’
- ఖాదర్ మొహియుద్దీన్ 🌺
39. ‘‘నా దేశాన్ని గూర్చి పాడలేను నీ ఆదేశాన్ని మన్నించలేను
- బాలగంగాధర తిలక్ 🌺
40. ‘‘ఎక్కువ కులజుడైన హీనకులజుడైన నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు’’
- అన్నమయ్య 🌺
41. ‘‘ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాససంత్రస్తులై’’
- ఏనుగు లక్ష్మణ కవి 🌺
42. ‘‘అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ’’
- పాలగుమ్మి విశ్వనాథం 🌺
43. ‘‘క్రిష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ
- చెలం🌺
44. ‘‘వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి అయినా, గిన్నెలన్నిటిపైనా మా నాన్న పేరే’’
- విమల 🌺
45. ‘‘గుండె గొంతుకలోన కొట్లాడుతాది కూకుండనీదురా కూసింతసేపు’’
-నం డూరి సుబ్బారావు 🌺
46. ‘‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా కానరాడు మానవత్వం ఉన్నవాడు’’
- అందెశ్రీ 🌺
47. ‘‘చెరువులో దూకనా చెరువయ్యిపోదునా ఉరిపోసుకొందునా ఉరితాడు అవుదునా’’
- చెరబండరాజు 🌺
48. ‘ఎంత చక్కనిదోయి ఈ తెలుగుతోట! ఎంత పరిమళమోయి ఈ తోటపూలు!’
- కందుకూరి రామభద్రరావు 🌺
49. నాగేటి చాల్లల్ల నా తెలంగాణ నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ
- నందిని సిధారెడ్డి 🌺
50. ‘‘రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీవు ఎరుగవురా’’
- మిట్టపల్లి సురేందర్ 🌺
-
"తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ...
దేశభాషలందు తెలుగు లెస్స".
(శ్రీకృష్ణదేవరాయలు) 🌺
.🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
No photo description available.
Vinjamuri Venkata Apparao
6 shares
Love
Love
Comment
Share


Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐