🚩 మేలిమి బంగారం - నటి కాంచన 🌹🌹



❤కాంచన తెలుగు సినిమా నటీమణి.

♦ప్రకాశం జిల్లా కరవది గ్రామంలో సంపన్న కుటుంబములో జన్మించిన ఈమె అసలు పేరు పురాణం వసుంధరాదేవి. ఈమె చిన్న తనములోనే భరత నాట్యము, సంగీతములో శిక్షణ పొందినది. ఇవే ఆమె పెద్దయ్యాక నటిగా రాణించడానికి దోహదపడ్డాయి. ఈమె బ్రహ్మచారిణిగా జీవితాన్ని గడిపింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి తారుమారు కావడంతో కాంచన చదువు ఆపి ఎయిర్ హోస్టెస్ గా జీవితాన్ని ప్రారంభించింది.

♦1970వ దశకములో ప్రసిద్ధి చెందిన దర్శకుడు శ్రీధర్ ఈమెను చూసి ప్రేమించి చూడు సినిమాలో హీరోయిన్ అయ్యే అవకాశము ఇచ్చాడు. 1965 సంవత్సరం మధుసూధనరావు గారి వీరాభిమన్యులో కథానాయిక ఉత్తరగా నటించడం ఆమె జీవితానికి బంగారుబాట వేసింది. తర్వాత కె.విశ్వనాథ్ దర్శకత్వంలో ఆత్మ గౌరవంలో పోషించిన నాయిక పాత్రలో గ్లామర్ తో పాటు కొంత హెవీనెస్ కూడా ఉండటంతో ఆమె నటనకు మంచి మార్కులు లభించాయి. 

♦హీరో ఘట్టమనేని కృష్ణతో నటించిన అవే కళ్ళు, నేనంటే నేనే చిత్రాల్లో గ్లామరస్ పాత్రలు ధరించగా, స్విమ్మింగ్ డ్రస్ లో గ్లామరస్ స్టార్ గా కనిపించి ఓ రకమైన క్రేజ్ క్రియేట్ చేశారు. కాంచన సాంఘిక చిత్రాలే కాదు దేవకన్య, అందం కోసం పందెం, శ్రీకృష్ణావతారం వంటి జానపద, పౌరాణిక చిత్రాలలో మంచి నటనను ప్రదర్శించారు.

♦మనుషులు మారాలి, మంచి కుటుంబం చిత్రాల్లో కథకు కీలకమయిన పాత్రలు పోషించిన కాంచన నట జీవితానికి మిగిలిపోయే పాత్రను కళ్యాణ మండపంలో పొషించారు. ఈ చిత్రానికి మాతృక కన్నడంలో వచ్చిన 'గజ్జె పూజ'. ఒక వేశ్య కూతురుగా సంఘంలో గౌరవం పొందటం కోసం తండ్రి కాని తండ్రిని చూసి ఆనందం, ఆశ్చర్యం, తన్మయం, తృప్తి, అవ్యక్త మధురానుభూతితో మథనపడుతూ కాంచన పోషించిన నటనకు ప్రేక్షకుల కళ్ళు చమర్చాయి. 

♦హీరోయిన్ గా రిటైరైన తర్వాత ఆనంద భైరవి చిత్రంలో మంచి పాత్ర పోషించారు

♦ఆమె సినీ రంగాన్ని వదిలేసి,

సామాజిక సేవలో మునిగిపోయారు.

ఆమె బెంగళూరులో ఉంటూ దేవాలయాలను

శుభ్రం చేస్తూ,నిర్వహిస్తూ కాలం గడుపుతున్నారు.

..

సుదీర్షమైన న్యాయపోరాటం ద్వారా తల్లిదండ్రుల నుంచి

15 కోట్ల రూపాయల విలువ చేసే తన ఆస్తిని ఆమె పొందారు.

సోదరి గిరిజతో కలిసి ఆమె తన ఆస్తిని టిటిడికి అందించారు.

ఈవిడ నేటి తరం నటీమణులకు ఆదర్శప్రాయం కదా! —🌹🌹🌹

🌺🌺  చిత్రమాలిక

అర్జున్ రెడ్డి (2017)గాంధర్వం (1993)వక్త్ కా షెహెన్‌షా (1987)

శ్రీ దత్త దర్శనం (1985)ఆనంద భైరవి (1984)

గడసరి అత్త సొగసరి కోడలు (1981)సిగప్పు రోజాక్కళ్ (1978)

ఇంద్రధనుస్సు (1978) ఆ ర్జున గర్వభంగం (1979)

మహాకవి క్షేత్రయ్య (1976)సెక్రటరీ (1976)

ప్రేమనగర్ (1974)భక్త తుకారాం (1973)

దేవుడు చేసిన మనుషులు (1973) కళ్యాణ మండపం (1971)

ధర్మదాత (1970) భలే మాష్టారు (1969 నాటకాల రాయుడు (1969)

జరిగిన కథ (1969) వింత కాపురం (1968) నేనంటే నేనే (1968)

తీన్ బహురాణియా (1968)అత్తే కంగళ్ (1967)ఫర్జ్ (1967)

శ్రీకృష్ణావతారం (1967)ప్రాణమిత్రులు (1967)

ప్రైవేటు మాస్టారు (1967)

తంగై (1967)నవరాత్రి (1966)

ఆత్మ గౌరవం (1965)వీరాభిమన్యు (1965)

మంచి కుటుంబం (1965)ప్రేమించి చూడు (1965)

కాదలిక్క నేరమిల్లై (1964)

సీత (1961)సువర్ణ సుందరి (1957/I)

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐