Posts

Showing posts from December, 2021

🌹-పెద్దాపురం పెళ్లి !- భోగం మేళం !🌹

Image
🌹-పెద్దాపురం పెళ్లి !- భోగం మేళం !🌹 . ♦నాకు ఎనిమిదేళ్ళ వయసులో జరిగిన ఆ పెద్దాపురం పెళ్లి  నాకు బాగా జ్జాపకం ఉండడానికి మూడు నాలుగు కారణాలు ఉన్నాయి. ♦ఒకటేమో పెళ్లి ముందు రోజు రాత్రి చిట్టెమ్మ బామ్మ గారు అనే వితంతువు  ఒక విడిది గదిలో మూల తెల్ల ముసుగు వేసుకుని ముడుచుకుని పడుకుంది. నేను ఏదో పని మీద ఆ గది లోకి వెళ్లి ఆవిడని చూసి, హడిలి చచ్చి పోయి “బాబోయ్ దెయ్యం” అని అరుచుకుంటూ బయటకి పారిపోయాను. ఎందుకంటే అంతకు ముందు వారం పది రోజుల ముందు ఏ చందమామ లోనో దెయ్యాలు తెల్ల ముసుగులు వేసుకుని, అరికాళ్ళు వెనక్కి తిప్పి ముడుచుకుని మూల దాక్కుంటాయి అని చదివాను. అదీ సంగతి. అసలు సంగతి తెలుసుకుని అందరూ నన్ను చూసి కోప్పడ లేదు కానీ అందరిలోనూ నవ్వుల పాలు కావడం నాకు బాగా గుర్తు. ♦మరొక విశేషం ఏమిటంటే చిన్న అమ్మలు ..అంటే మా అక్క ….అదే గదిలో రాత్రి పడుకుంటే ఎవరో జడ కొంచెం కత్తిరించి, మా అక్క పెట్టుకున్న బంగారం పాపిడి పిందెలు, చేమంతి పువ్వు దొంగతనం చేశారు.  మర్నాడు పొద్దున్న మా అమ్మ మా అక్కకి జడ వేస్తూ చూసి అనుమానం వచ్చి అందరి పెట్టెలూ చూస్తుంటే ఈ చిట్టెమ్మ బామ్మ గారి కూతురి పెట్టె లోపల సగం, పైన వేళ్ళాడుతూ సగం కత్త

❤-బుడుగు గాడి .జాలి గాధ-❤

Image
-- ♦నాకు 1956 లో ఏడేళ్ళు..మరి ఇప్పుడు.. 70 దాటాయి.. ♦నన్ను సృష్టించిన దేవుళ్లిద్దరూ.. దేవుడుదగ్గరకు వెళిపోయారు.. ♦నాకు అసలు నచ్చటం లేదు..ఇక్కడ..  ఈకాలప్పిల్లలు.. గోళీలు అడరు.. పెంకితనం చెయ్యరు.. నాలా అందరికీ హెల్ప్ మంచి మనసుతో చెయ్యరు..వీళ్ళకి స్వార్ధం పెరిగిపోయింది..వీళ్ళకి ఉన్నన్ని ప్రైవేట్లు నాకుండేవి కాదు.. నా ప్రేవేట్లు వేరు.వీళ్ళ ప్రేవేట్లు వేరు..వీళ్ళెప్పుడూ పుస్తకాలతో కుస్తీ పడుతూఉంటారు.  ♦ఇంగ్లీష్లో మాట్లాడుతూఉంటారు..సున్నుండలు తినరు. కురుకురేలు..చిప్సూ,బర్గర్లూ.పీజ్జాలూ తింటారు. మొబైల్ గేమ్స్.కార్టూన్లు ..ఆడుకుంటారు.వీళ్ళకి కోతి కొమ్మచ్చ్చి ఆడడం రాదు.. ♦ సీగానపెసూనాంబలు పరికిణీలు వేసుకోరు.. అసలు రెండుజెళ్ళసీతలు లేనేలేరు... మొన్నో నిన్నో కల్యాణి రెండుజెళ్ళ ఫుటో చూసాను...ఈమధ్య ఇంకెవరూ వేసుకోటల్లేదు..అసలు వొంటిజడ.వాలు  జడ కూడా కనపడట్లేదు.. ♦అమ్మలు రాధ లా ఇంట్లో ఉండట్లేదు..వుద్యోగాలకిపోతున్నారు..  ఇంకా చాల చెప్పాలి... బామ్మలు ఇంట్లో ఉండట్లేదు.. ఎక్కడో పల్లెటూళ్ళో ఉంటున్నారు..లేదా ఆశ్రమాల్లో.... ♦బాబాయ్ లు సీతలకి డైరెక్ట్ గ లౌలెటర్ లు ఇచ్చేస్తున్నారు..వాట్స్ అప్ లో మెస్సేజ్లు ఇచ్చ

అరాళ కుంతలా .🌹

Image
🌺 ఒక రోజు నేను శ్రీ కృష్ణ తులాభారం సినిమా చూస్తున్నప్పుడు అందులో ఎన్ టీ రామారావు, జమున కాళ్ళు పట్టుకుంటే ఆవిడ తన్నిన సన్నివేశం లో ఘంటసాల గారు ఒక పద్యం పాడారు. నను భవదీయ దాసుని మనంబున నెయ్యపుకిన్‌కబూని తాచిన అది నాకు మన్ననయా చెల్వగు నీ పద పల్లవంబు మత్తనుపులకాగ్ర కంటకవితానము తాకిన నొచ్చుననుచు నేనయిద అల్క మానవు కదా ఇకనైన అరాళ కుంతలా ........... పద్యం అంతా బానే అర్ధం అయ్యింది కానీ .... అరాళ కుంతలా ... అంటే ఏంటో అర్ధం కాలేదు. మా పితృ పాదుల వారు పక్కనే ఉన్నారు కదా అని ఆయన్ని అడిగాను. నేను చదువుకోకుండా సినిమా చూస్తున్నానన్న కోపం లో ఆయన పక్కనే ఎప్పుడూ రెడీ గా ఉంచుకునే కమండలం లో కాసిని నీళ్ళు తీసి "నీకు ఆ పదానికి అర్ధం తెలియకుండు గాక" అని శపించారు. యధా విధి గా నేను శాపవిమోచన మార్గం అడిగాను. అప్పుడు ఆయన "ఆ పదానికి అర్ధం వేరొకరి ద్వారా నువ్వు తెలుసుకుంటావు." అని సెలవిచ్చారు. పితృపాదుల వారి శాపం కారణం గా నా అంతట నేను దానికి అర్ధం తెలుసుకోలేకపోయాను. సరే అప్పటినుండీ చాలమంది ని అడిగి చూసాను. ఎవరూ అంత స్పష్టమైన సమాధానం చెప్పలేదు. మా పవన్ గాడ్నీ అడిగాను. వాడు "సంస్కృతం లో అరాళ

🚩 మేలిమి బంగారం - నటి కాంచన 🌹🌹

Image
❤కాంచన తెలుగు సినిమా నటీమణి. ♦ప్రకాశం జిల్లా కరవది గ్రామంలో సంపన్న కుటుంబములో జన్మించిన ఈమె అసలు పేరు పురాణం వసుంధరాదేవి. ఈమె చిన్న తనములోనే భరత నాట్యము, సంగీతములో శిక్షణ పొందినది. ఇవే ఆమె పెద్దయ్యాక నటిగా రాణించడానికి దోహదపడ్డాయి. ఈమె బ్రహ్మచారిణిగా జీవితాన్ని గడిపింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి తారుమారు కావడంతో కాంచన చదువు ఆపి ఎయిర్ హోస్టెస్ గా జీవితాన్ని ప్రారంభించింది. ♦1970వ దశకములో ప్రసిద్ధి చెందిన దర్శకుడు శ్రీధర్ ఈమెను చూసి ప్రేమించి చూడు సినిమాలో హీరోయిన్ అయ్యే అవకాశము ఇచ్చాడు. 1965 సంవత్సరం మధుసూధనరావు గారి వీరాభిమన్యులో కథానాయిక ఉత్తరగా నటించడం ఆమె జీవితానికి బంగారుబాట వేసింది. తర్వాత కె.విశ్వనాథ్ దర్శకత్వంలో ఆత్మ గౌరవంలో పోషించిన నాయిక పాత్రలో గ్లామర్ తో పాటు కొంత హెవీనెస్ కూడా ఉండటంతో ఆమె నటనకు మంచి మార్కులు లభించాయి.  ♦హీరో ఘట్టమనేని కృష్ణతో నటించిన అవే కళ్ళు, నేనంటే నేనే చిత్రాల్లో గ్లామరస్ పాత్రలు ధరించగా, స్విమ్మింగ్ డ్రస్ లో గ్లామరస్ స్టార్ గా కనిపించి ఓ రకమైన క్రేజ్ క్రియేట్ చేశారు. కాంచన సాంఘిక చిత్రాలే కాదు దేవకన్య, అందం కోసం పందెం, శ్రీకృష్ణావతారం వంటి జానపద, పౌరాణి

'శంకరాభరణం' #పారుపల్లి_రామకృష్ణయ్య గారు 🙏

Image
  కళాతపస్వి' డా.కె.విశ్వనాథ్ గారు రూపొందించగా సంచలన విజయం సాధించిన  'శంకరాభరణం' సినిమాలో శంకరశాస్త్రిగారి పాత్రకు ప్రేరణ మరెవరో  కాదు..'గాయకసార్వభౌమ' పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారే. ఆ సినిమా  విజయవంతం అయిందని తెలియగానే విశ్వనాథ్ గారు విజయవాడ వచ్చి, గాంధీనగర్  లోని పంతులుగారి విగ్రహాన్ని దర్శించుకొని, పూలమాల వేసి, వారికి తన కృతజ్ఞత  తెలుపుకున్నారు.         పారుపల్లివారి కట్టు, బొట్టు, తలపాగా, కోటు,నడక,వారి  హుందాతనం, మితభాషణ...ఒక్కటేమిటి?..అన్నిటికీ సజీవ రూపాన్నిచ్చారు.  పంతులుగారి జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలు, వారి నిస్వార్థ సంగీత సేవ..వీటిని  తన చిత్రంలో ఎంతో అందంగా మలచారు విశ్వనాథ్ గారు.  ఆఖరికి శంకరశాస్త్రిగారి      శిష్యుడి పాత్ర కూడా పంతులుగారి శిష్యుడైన 'బాల'మురళిదే...ఆ సినిమా చివరిలో  శంకరశాస్త్రిగారికి వయోభారం చేత కచేరీ చేయలేని పరిస్థితి వస్తే, వేదికపైకి  శిష్యుడువచ్చి,గురువుగారు ఆగిన చోటునుండి అందుకొని, పాటని రసవత్తరంగా పూర్తి  చేస్తాడు.దాదాపు అటువంటి సంఘటనే పంతులుగారి జీవితంలోనూ జరిగింద      ఆరోజు 7-1-1942..సాయం సమయం..త్యాగయ్యగారి ఆరాధనోత్సవాలు 

🚩🚩"కరుణశ్రీ" జంధ్యాల పాపయ్య శాస్త్రి!🌹

Image
  🚩🚩"కరుణశ్రీ" జంధ్యాల పాపయ్య శాస్త్రి!🌹 ❤జంధ్యాల పాపయ్య శాస్త్రి 20వ శతాబ్దములో బాగా జనాదరణ పొందిన తెలుగు కవులలో ఒకరు. వీరి కవిత్వము సులభమైన శైలిలో, సమకాలీన ధోరణిలో, చక్కని తెలుగు నుడికారముతో విన సొంపై యుండును. ఖండకావ్యములు వీరి ప్రత్యేకత.  ♦అందునా కరుణ రస ప్రధానముగా చాలా కవితలు వ్రాసి,  "కరుణశ్రీ" అని ప్రసిద్దులైనారు. జంధ్యాల పాపయ్య శాస్త్రి గుంటూరు జిల్లా, పెదనందిపాడు మండలములోని కొమ్మూరు గ్రామములో 1912, ఆగస్టు 4న జన్మించారు. తల్లి మహాలక్ష్మమ్మ, తండ్రి పరదేశయ్య. కొమ్మూరులో ప్రాథమిక, మాగధ్యమిక విద్య చదివిన పాపయ్యకు సంస్కృత భాషపై మక్కువ పెరిగింది. భమిడిపాటి సుబ్రహ్మణ్యశర్మ, కుప్పా ఆంజనేయశాస్త్రి వద్ద సంస్కృత కావ్యాలు చదివారు. రాష్ట్ర భాషా విశారద, ఉభయ భాషా ప్రవీణ, హిందీ భాషా ప్రవీణ పరీక్షలలో ఉత్తీర్ణుడై అమరావతి రామకృష్ణ విద్యాపీఠములోనూ, గుంటూరు స్టాల్ గర్ల్స్ హైస్కూలులోనూ, ఆంధ్ర క్రైస్తవ కళాశాలలోనూ అధ్యాపకునిగా పని చేశారు. ♦వీరి కలం పేరు ‘కరుణశ్రీ’. ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, ఉమర్‌ ఖయ్యూం వీరి రచనలు. కుంతి కుమారి, పుష్పవిలాపం (ఘంటసాల గానం చేశారు) మొదలైన కవితా ఖం