'శంకరాభరణం' #పారుపల్లి_రామకృష్ణయ్య గారు 🙏

 


కళాతపస్వి' డా.కె.విశ్వనాథ్ గారు రూపొందించగా సంచలన విజయం సాధించిన 
'శంకరాభరణం' సినిమాలో శంకరశాస్త్రిగారి పాత్రకు ప్రేరణ మరెవరో 
కాదు..'గాయకసార్వభౌమ' పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారే. ఆ సినిమా 
విజయవంతం అయిందని తెలియగానే విశ్వనాథ్ గారు విజయవాడ వచ్చి, గాంధీనగర్ 
లోని పంతులుగారి విగ్రహాన్ని దర్శించుకొని, పూలమాల వేసి, వారికి తన కృతజ్ఞత 
తెలుపుకున్నారు.
        పారుపల్లివారి కట్టు, బొట్టు, తలపాగా, కోటు,నడక,వారి 
హుందాతనం, మితభాషణ...ఒక్కటేమిటి?..అన్నిటికీ సజీవ రూపాన్నిచ్చారు. 
పంతులుగారి జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలు, వారి నిస్వార్థ సంగీత సేవ..వీటిని 
తన చిత్రంలో ఎంతో అందంగా మలచారు విశ్వనాథ్ గారు.  ఆఖరికి శంకరశాస్త్రిగారి     
శిష్యుడి పాత్ర కూడా పంతులుగారి శిష్యుడైన 'బాల'మురళిదే...ఆ సినిమా చివరిలో 
శంకరశాస్త్రిగారికి వయోభారం చేత కచేరీ చేయలేని పరిస్థితి వస్తే, వేదికపైకి 
శిష్యుడువచ్చి,గురువుగారు ఆగిన చోటునుండి అందుకొని, పాటని రసవత్తరంగా పూర్తి 
చేస్తాడు.దాదాపు అటువంటి సంఘటనే పంతులుగారి జీవితంలోనూ జరిగింద     
ఆరోజు 7-1-1942..సాయం సమయం..త్యాగయ్యగారి ఆరాధనోత్సవాలు 
తిరువయ్యారులో జరుగుతున్నాయి. అందులో గానం చేయడానికి పంతులుగారికి గంట 
సమయం కేటాయించబడింది.పంతులుగారు తనతో తన శిష్యుడు, 12 సంవత్సరాల 
మురళిని కూడా అక్కడికి తెచ్చారు.అప్పటికే తెలుగునాట బాల గాయకుడిగా     
పేరుతెచ్చుకున్న మురళిచేత ఆ పవిత్ర స్థలంలో పాడించి, పెద్దల ఆశీస్సులకు పాత్రుణ్ని చేయాలని నిశ్చయించుకున్న పంతులుగారు, నిర్వాహకులతో తనకు ఆరోగ్యం సరిగా లేదని,అందుచేత, తనకు బదులుగా తన శిష్యుడికి రెండు కీర్తనలు పాడే అవకాశం 
ఇవ్వవలసిందిగా విన్నవించుకొని, ఎలాగో ఒప్పించారు.ఎంతో అరుదైన తన 
అవకాశాన్ని శిష్యుడి కోసం త్యాగం చేశారాయన... మురళిని తానే వేదికనెక్కించారు.     
ఆజానుబాహులైన ప్రక్కవాద్య కళాకారుల మధ్య...అర్భకుడైన బాలమురళి ప్రేక్షకులకు 
కనిపించకపోవడంతో ఒక పీటను తెప్పించి, దానిపై కూర్చుండబెట్టారు.కచేరీ ప్రారంభం 
అయింది. మురళీగానానికి శ్రోతలు పరవశించిపోయారు.రెండు కీర్తనలు 
నాలుగయ్యాయి..మరొక పావుగంట..మరొక అరగంట..ఇలా మూడుసార్లు సమయం 
పొడిగించబడింది. జనం ఆ గంధర్వ గానానికి మంత్రముగ్ధులయ్యారు..బాలమురళికి 
బ్రహ్మరథం పట్టారు.పంతులుగారి ఆనందానికి అవధులు లేవు.తనకు సంగీత       
వారసుణ్ణి ఇచ్చి, తన అభీష్టాన్ని నెరవేర్చిన 'నాదయోగి' త్యాగయ్యకు మనసులోనే 
తృప్తిగా నమస్కారం చేసుకున్నారు...ఇంచుమించుగా ఈ యదార్థ సంఘటనే 
'శంకరాభరణం' చిత్రంలో ఆఖరి దృశ్యంగా ప్రేక్షకుల మనఃఫలకాలపై చెరగని ముద్ర 
పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు (1883-1951) కర్ణాటక సంగీత విద్వాంసులు. త్యాగరాజ శిష్య పరంపరకు చెందినవారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ యొక్క గురువు గారు
#గురుపరంపర
త్యాగరాజు ఒక గొప్ప కర్ణాటక సంగీత విద్యాంసులు. ఆయన తన జీవితంలో చాలాకాలం  తమిళనాడులోని తంజావూరు జిల్లాలో  నివసించి అనేకమంది మహా విద్వాంసులకు సంగీత శిక్షణనిచ్చి 1847 వ సంవత్సరంలో పరమపదించారు. అట్టివారిలో వారి జ్ఞాతి ఆకుమళ్ళ (మనంబుచావడి) వెంకటసుబ్బయ్య కూడా ఒకరు. వెంకటసుబ్బయ్య కూడా తన జీవితకాలంలో అనేక మంది శిష్యులను ఆకర్షించి సంగీతశిక్షణనిచ్చారు. వారిలో సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి (1860-1917) ఒకరు. శాస్త్రిగారి సంగీతానురక్తి ఆయన్ని స్వస్థలమైన కృష్ణా జిల్లా నుండి తమిళనాడు కాలినడక ప్రయాణం చేయించింది. వెంకటసుబ్బయ్య గారి వద్ద సంగీతం నేర్చుకున్న సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి గారు తిరిగి ఆంధ్రప్రదేశ్ చేరుకున్నారు. త్యాగరాజు సంగీత పరంపరను ఆంధ్ర ప్రాంతానికి పరిచయంచేసిన శాస్త్రిగారి వలన చాలామంది విద్యార్థులు లభ్ది పొందారు. వారిలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ యొక్క గురువుగా పేరుగాంచిన ప్రముఖ గాత్ర విద్వాంసుడైన పారుపల్లి రామక్రిష్ణయ్య (1883-1951) ఒకరు.
జీవిత సంగ్రహం 
వీరు కృష్ణా జిల్లా శ్రీకాకుళంలో పారుపల్లి శేషాచలం, రంగమ్మ దంపతులకు జన్మించారు. సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి గారి వద్ద శిక్షణ పొంది విజయవాడలో స్థిరనివాస మేర్పరచుకొని గురుకుల పద్ధతిలో ఉచితంగా విద్యాబోధన చేశారు.
పంతులుగారు జంత్రగాత్రములతో కచేరి చేసేవారు. సంగీత, సాహిత్య, లక్ష్యలక్షణాలను పోషిస్తూ బాగా పాడేవారు. వర్ణంతో ఆరంభమై, శ్రోతల అభిరుచిని గమనించి, రాగం, స్వరం, నెరవులు మోతాదు మించకుండా ఆద్యంతం కచేరీని రక్తిగా నడిపేవారు. ప్రక్కవాద్యాలను ప్రోత్సహిస్తూ పాడేవారు. కచేరీలో అన్ని అంశాలు ఉండేవి; అనగా తాళముల మార్పు, మధ్యమకాల కీర్తనలు, తక్కువకాల కీర్తనలు, రాగం, తానం, పల్లవి, శ్లోకం, రాగమాలిక, పదం, జావళి, తిల్లాన, మంగళంతో కచేరిని ముగించేవారు.
#శంకరాభరణం
'కళాతపస్వి' డా.కె.విశ్వనాథ్ గారు రూపొందించగా సంచలన విజయం సాధించిన 'శంకరాభరణం' సినిమాలో శంకరశాస్త్రిగారి పాత్రకు ప్రేరణ..'గాయకసార్వభౌమ' పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారు.1980 లో ఆ సినిమా విజయవంతం అయిందని తెలియగానే,విశ్వనాథ్ గారు విజయవాడ వచ్చి, గాంధీనగర్ లోని పంతులుగారి విగ్రహాన్ని దర్శించుకొని, పూలమాల వేసి, వారికి తన కృతజ్ఞత తెలుపుకున్నారు.
పారుపల్లివారి కట్టు, బొట్టు, తలపాగా, కోటు, నడక, వారి హుందాతనం, మితభాషణ... ఒక్కటేమిటి? అన్నిటికీ సజీవ రూపాన్నిచ్చారు. పంతులుగారి జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలు, వారి నిస్వార్థ సంగీత సేవ..వీటిని తన చిత్రంలో ఎంతో అందంగా మలచారు విశ్వనాథ్ గారు.
శంకరశాస్త్రిగారి శిష్యుడి పాత్రకు కూడా పంతులుగారి శిష్యుడైన 'బాల'మురళి యే ప్రేరణ...ఆ సినిమా చివరిలో శంకరశాస్త్రిగారికి వయోభారం చేత పాడలేని పరిస్థితి వస్తే, వేదికపైకి శిష్యుడు వచ్చి, గురువుగారు ఆగిన చోటునుండి అందుకొని, పాటని రసవత్తరంగా పూర్తి చేస్తాడు.దాదాపు అటువంటి సంఘటనే పంతులుగారి జీవితంలోనూ జరిగింది.
ఆరోజు 7-1-1942..సాయం సమయం... త్యాగయ్యగారి ఆరాధనోత్సవాలు తిరువయ్యారులో జరుగుతున్నాయి. అందులో గానం చేయడానికి పంతులుగారికి గంట సమయం కేటాయించబడింది. పంతులుగారు తనతో తన శిష్యుడు, 12 సంవత్సరాల బాలమురళిని కూడా అక్కడికి తీసుకొచ్చారు.
అప్పటికే తెలుగునాట బాల గాయకుడిగా పేరుతెచ్చుకున్న మురళిచేత ఆ పవిత్ర స్థలంలో పాడించి, పెద్దల ఆశీస్సులకు పాత్రుణ్ని చేయాలని నిశ్చయించుకున్న పంతులుగారు, నిర్వాహకులతో తనకు ఆరోగ్యం సరిగా లేదని,అందుచేత, తనకు బదులుగా తన శిష్యుడికి రెండు కీర్తనలు పాడే అవకాశం ఇవ్వవలసిందిగా విన్నవించుకొని, ఎలాగో ఒప్పించారు.ఎంతో అరుదైన తన అవకాశాన్ని శిష్యుడి కోసం త్యాగం చేశారాయన... మురళిని తానే వేదికనెక్కించారు.
ఆజానుబాహులైన ప్రక్కవాద్య కళాకారుల మధ్య...అర్భకుడైన బాలమురళి ప్రేక్షకులకు కనిపించకపోవడంతో ఒక పీటను తెప్పించి, దానిపై కూర్చుండబెట్టారు.కచేరీ ప్రారంభం అయింది. మురళీగానానికి శ్రోతలు పరవశించిపోయారు.రెండు కీర్తనలు నాలుగయ్యాయి..మరొక పావుగంట..మరొక అరగంట..ఇలా మూడుసార్లు సమయం పొడిగించబడింది. జనం ఆ గంధర్వ గానానికి మంత్రముగ్ధులయ్యారు..బాలమురళికి బ్రహ్మరథం పట్టారు.
పంతులుగారి ఆనందానికి అవధులు లేవు.తనకు సంగీత వారసుణ్ణి ఇచ్చి, తన అభీష్టాన్ని నెరవేర్చిన 'నాదయోగి' త్యాగయ్యకు మనసులోనే తృప్తిగా నమస్కారం చేసుకున్నారు...ఇంచుమించుగా ఈ యదార్థ సంఘటనే 'శంకరాభరణం' చిత్రంలో ఆఖరి దృశ్యంగా ప్రేక్షకుల మనఃఫలకాలపై చెరగని ముద్ర వేసుకొంది.
#శిష్యవర్గం
వీరి శిష్యవర్గంలో అనేకులు, దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా కూడా ఖ్యాతి వహించారు. వారిలో గాత్ర విద్వాంసులు, వాద్య విద్వాంసులు, ఉత్తమ బోధకులు ఉన్నారు. పంతులుగారి శిష్యులలో కొందరు:
మంగళంపల్లి బాలమురళీకృష్ణ, చిలకలపూడి వెంకటేశ్వర శర్మ, అద్దంకి శ్రీరామమూర్తి, పారుపల్లి సుబ్బారావు, మంగళంపల్లి పట్టాభిరామయ్య, వంకదారి వేంకటసుబ్బయ్య గుప్త, అన్నవరపు రామస్వామి, నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు, శిష్ట్లా సత్యనారాయణ, దాలిపర్తి పిచ్చహరి, పరిదే సుబ్బారావు, దాలిపర్తి సూర్యుడు, భమిడిపాటి నరసింహశాస్త్రి, మద్దులపల్లి లక్ష్మీనరసింహ శాస్త్రి, చల్లపల్లి పంచనద శాస్త్రి, అడుసుమల్లి వేంకట కుటుంబ శాస్త్రి, పువ్వుల ఆంజనేయులు, గుంటూరు సుబ్రహ్మణ్యం, చదలవాడ సత్యనారాయణ, లంక వేంకటేశ్వర్లు, ప్రపంచం కృష్ణమూర్తి, నేతి లక్ష్మీనారాయణ భాగవతార్ , ములుకుట్ల సదాశివశాస్త్రి, వేదాంతం సుబ్రహ్మణ్య కవి, రాజనాల వేంకట రామయ్య, సింగరాజు సూర్యనారాయణ రాజు, ఉండవల్లి కృష్ణమూర్తి, పాతూరి సీతారామయ్య చౌదరి, వంకమామిడి వీరరాఘవయ్య, ముసునూరి వేంకట రమణయ్య, దత్తాడ పాండురంగరాజు, ఏలూరు శ్రీరాములు, అలగోలు ఆంజనేయులు, బేతనబొట్ల సుబ్బయ్య, బేతనబొట్ల వేంకటరామయ్య, గొల్లపూడి వేంకటాచలపతి, అడుసుమిల్లి సూర్య వెంకట కుటుంబయ్య, శ్రీకాకుళం రాఘవులు, శ్రీకాకుళం వేంకటరాముడు, శ్రీకాకుళం సుబ్బారాయుడు, నేతి శ్రీరామశర్మ, వెలగలేటి భద్రయాచార్యులు, మంత్రవాది గంగాధరం, మండ రాఘవయ్య, మద్దిపట్ల శ్రీరాములు, మేడూరి రాధాకృష్ణ, గద్దె వెంకట రామకుమారి, తిరుపతి పొన్నారావు, చల్లపల్లి పురుషోత్తమశాస్త్రి, టి.కె.యశోదాదేవి, కొర్నెపాటి నరసింహారావు, చల్లపల్లి కృష్ణమూర్తి, మంత్రాల గోపాలకృష్ణమూర్తి.
♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦


Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩