🚩🚩"కరుణశ్రీ" జంధ్యాల పాపయ్య శాస్త్రి!🌹

 


🚩🚩"కరుణశ్రీ" జంధ్యాల పాపయ్య శాస్త్రి!🌹

❤జంధ్యాల పాపయ్య శాస్త్రి 20వ శతాబ్దములో బాగా జనాదరణ పొందిన తెలుగు కవులలో ఒకరు. వీరి కవిత్వము సులభమైన శైలిలో, సమకాలీన ధోరణిలో, చక్కని తెలుగు నుడికారముతో విన సొంపై యుండును. ఖండకావ్యములు వీరి ప్రత్యేకత. 

♦అందునా కరుణ రస ప్రధానముగా చాలా కవితలు వ్రాసి,

 "కరుణశ్రీ" అని ప్రసిద్దులైనారు.

జంధ్యాల పాపయ్య శాస్త్రి గుంటూరు జిల్లా, పెదనందిపాడు మండలములోని కొమ్మూరు గ్రామములో 1912, ఆగస్టు 4న జన్మించారు. తల్లి మహాలక్ష్మమ్మ, తండ్రి పరదేశయ్య. కొమ్మూరులో ప్రాథమిక, మాగధ్యమిక విద్య చదివిన పాపయ్యకు సంస్కృత భాషపై మక్కువ పెరిగింది. భమిడిపాటి సుబ్రహ్మణ్యశర్మ, కుప్పా ఆంజనేయశాస్త్రి వద్ద సంస్కృత కావ్యాలు చదివారు. రాష్ట్ర భాషా విశారద, ఉభయ భాషా ప్రవీణ, హిందీ భాషా ప్రవీణ పరీక్షలలో ఉత్తీర్ణుడై అమరావతి రామకృష్ణ విద్యాపీఠములోనూ, గుంటూరు స్టాల్ గర్ల్స్ హైస్కూలులోనూ, ఆంధ్ర క్రైస్తవ కళాశాలలోనూ అధ్యాపకునిగా పని చేశారు.

♦వీరి కలం పేరు ‘కరుణశ్రీ’. ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, ఉమర్‌ ఖయ్యూం వీరి రచనలు. కుంతి కుమారి, పుష్పవిలాపం (ఘంటసాల గానం చేశారు) మొదలైన కవితా ఖండికలు బహుళ జనాదరణ పొందాయి. 20వ శతాబ్దములో బాగా జనాదరణ పొందిన తెలుగు కవులలో ఒకరు. వీరి కవిత్వము సులభమైన శైలిలో, సమకాలీన ధోరణిలో, చక్కని తెలుగు నుడికారముతో విన సొంపై యుండును. ఖండకావ్యములు వీరి ప్రత్యేకత. అందునా కరుణ రస ప్రధానముగా చాలా కవితలు వ్రాసి, "కరుణశ్రీ" అని ప్రసిద్దులైనారు. మృదుమధురమైన పద్య రచనా శైలి వీరి ప్రత్యేకత. జూన్‌ 22, 1992లో పాపయ్య శాస్త్రి గారు  పరమపదించారు.

♦అంజలి పద్యాలు

సీ|| పుట్టబోయెడి బుల్లి బుజ్జాయి కోసమై

పొదుగు గిన్నెల పాలు పోసి పోసి

కలికి వెన్నెలలూరు చలువ దోసిళ్ళతో

లతలకు మారాకు లతికి యతికి

పూల కంచాలలో రోలంబములకు రే

పటి భోజనము సిద్ధ పరచి పరచి

తెల వారకుండ మొగ్గలలోనజొరబడి

వింత వింతల రంగు వేసి వేసి

తీరికే లేని విశ్వ సంసారమందు

అలసి పోయితివేమొ దేవాదిదేవ

ఒక నిమేషమ్ము కన్ను మూయుదువు గాని

రమ్ము! తెరచితి మా కుటీరమ్ము తలుపు

♦సీ||లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర

దీపాలు గగనాన త్రిప్పలేక

జగతిపై బడవచ్చు జలరాశి కెరటాలు

మామూలు మేరకు మడవలేక

పని మాలి ప్రతిరోజు ప్రాణికోటుల గుండె

గడియారముల కీలు కదపలేక

అందాలు చింద నీలాకాశ వేదిపై

చుక్కల మ్రుగ్గులు చెక్కలేక

ఎంత శ్రమ నొందుచుంటివో యేమొ స్వామి!

అడుగిడితి వెట్లొ నేడు మా గడపలోన;

గుండె కుదిలించి నీ ముందు కుప్పవోతు

అందుకోవయ్య హృదయ పుష్పాంజలులను

♦సీ||కూర్చుండ మా యింట కురిచీలు లేవు

నా ప్రణయాంకమే సిద్ధ పరచనుంటి

పాద్యమ్ము నిడ మాకు పన్నీరు లేదు

నా కన్నీళ్ళతో కాళ్ళు కడుగనుంటి

పూజకై మా వీట పుష్పాలు లేవు నా

ప్రేమాంజలులె సమర్పింప నుంటి

నైవేద్య మిడ మాకు నారికేళము లేదు

హృదయమే చేతి కందీయనుంటి

లోటు రానీయ నున్నంతలోన నీకు

రమ్ము! దయసేయు మాత్మ పీఠమ్ము పైకి

అమృత ఝురి చిందు నీ పదాంకముల యందు

కోటి స్వర్గాలు మొలపించుకొనుచు తండ్రి!

కవిత్వప్రక్రియలలో రెండవది, మధుర కవి

త్వం: మృదు మధురంగా సాగే పద్యాలు, మధుర భక్తిసంయుత పద్యాలు మధుర కవిత్వపు కోవలోనికి వస్తాయి. అలా అని కేవలం సులభమైన భాషలో వ్రాస్తేనే మధుర కవిత్వం అవదు. అది మధుర పద, శబ్ద సమన్విత భావ స్ఫోరకంగా వుండాలి. అధునాతన కవులలో చెప్పుకోదగ్గ మధుర కవిత్వం వ్రాసి

(జంధ్యాల పాపయ్యశాస్త్రి) గారు. ఊదాహరణంగా చూడండి

♦“నేనొక పూలమొక్క కడ నిల్చి, చివాలున కొమ్మవంచి, గో

రానెడు నంతలోన విరులన్నియు జాలిగ నోళ్ళువిప్పి ‘మా 

ప్రాణముతీతువా’ యనుచు బావురుమన్నవి – కృంగిపోతి, నా

మానసమందెదో తళుకుమన్నది, పుష్పవిలాపకావ్యమై!”

(చివరిమాట “కావ్యమై” అనే కరుణశ్రీగారు వ్రాశారు. అది శ్రీ ఘంటసాల వేంకటేశ్వరరావుగారు గ్రామఫోను రికార్డుగా పాడినపుడు “గీతియై” అనిమారింది)

వీరిదే ఇంకొక మధుర పద్యం:

“♦సంజవెలుంగులో పసిడిచాయల ఖద్దరు చీరకట్టి నా

రింజకు నీరువోయు శశిరేఖవె నీవు, సుభద్రసూతినై

రంజితపాణిపల్లవము రాయుదునా, నిను మౌళిదాల్చి మృ

త్యుంజయమూర్తినై జమునితో తొడగొట్టి సవాలుచేతునా!”

♦‘ఘంటసాల పాపయ్య శాస్త్రి’ అని ఆయన్ను హాస్యం పట్టించిన విద్యార్థులుగా 1954-58 మధ్య గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో మేము అందరి నోళ్ళలోనానే వాళ్ళం. మేము అంటే నేనూ, నా స్నేహితుడు సిద్ధాబత్తుని రామకృష్ణ. ఘంటసాల పాడినందున పాపయ్య శాస్త్రికి పేరు వచ్చిందనే వాళ్ళం. నాలుగేళ్ళపాటు కాలేజీలో మాకు పాఠాలు చెప్పిన పాపయ్యశాస్త్రిని అలా ఆట పట్టించిన వారు అరుదే. 

♦ఆవుల గోపాలకృష్ణమూర్తి ఆయన్ను` పాపశ్రీ` అనేవారు. కరుణ శ్రీ కి పారడీగా అలా పిలిచారేమో అనుకున్నాం. పాప అంటే పాము అని కూడా అర్థం వుందట. ఇవేవీ చాటున అన్నవిగావు. 

ఆయనకు తెలిసేటట్లే ఎదుటబడి అన్నప్పుడు, చిన్న బుచ్చుకున్నా మమ్మల్ని ఏమీ అనేవారు కాదు.

కాలేజీలో పాపయ్యశాస్త్రి గద్య, పద్యంతో బాటు, నాటకం, నాన్ డిటైల్డ్ చెప్పేవారు. కాని ఆయన రాయడంలో కనబరిచిన లాలిత్యం మాధుర్యం చెప్పడంలో కనబడేదిగాదు. 

అందుకే హాస్యం పట్టించగలిగాం.

పాపయ్యశాస్త్రికి అప్పట్లో ఒక స్నేహితురాలు వుండే విషయం తెలిసి, పోల్చుకున్నాములే నిన్ను వైష్ణవ పడతీ అని రాగాలు తీసేవాళ్ళం. పాపయ్యశాస్త్రి రచనలు ముఖ్యంగా బౌద్ధం, పూలు వస్తువుగా స్వేకరించి రాసినవి చదివాం.

♦తెలుగువారికి యిష్టమైన పూలన్నిటిపైనా ఆయన కవితలు అల్లారు. బౌద్ధం ఆయన పై పరిమితంగానే ప్రభావం చూపెట్టినా, కరుణ రస ప్రధానంగా రాసి, ఆకట్టుకున్నారు. బౌద్ధ బోధనలు, తత్వం ఆయన్ను వశ పరచుకోలేదు. పాపయ్య శాస్త్రితో పరిచయం, కాలేజీ రోజుల తరువాత కూడా సాగింది. 

సాహిత్య అకాడమీ సంబంధాల వలన తరచు హైదరాబాద్ వస్తుండటంతో, కలిసేవాళ్ళం, మృదువుగా, లాలిత్యంతో సంభాషించేవారు. గురు-శిష్య సంబంధం కాస్తా స్నేహంగా మారింది. ఆయన కుటుంబంతో ఎన్నడూ పరిచయం కాలేదు.

♦భువన విజయంలోనూ ఉగాది వేడుకల కవిసమ్మేళనాలలో పాపయ్య శాస్త్రి పాల్గొన్నారు. ఆయన కవితల రచనలు అందంగా ఆకర్షణీయంగా వుండేవి. క్రమేణా ఒకదశలో జంధ్యాల వారు సత్య సాయిబాబా పాదాక్రాంతు లయ్యారు. అంతటితో ఆగక, విశ్వంజీ అనే అర్థాంతపు స్వామి భక్తులయ్యారు. ఇంకా ఇతర స్వాములును కూడా ఆరాధించారేమో తెలియదు. ఏ దశలో ఆయనకు భక్తి ముదిరిందో కూడా గమనించలేదు. పూల నుండి పూజల్లోకి దిగజారారనుకున్నాం. 

పాపయ్యశాస్త్రి గురువు జమ్మల మడక మాధవ రాయశర్మ ఎ.సి. కాలేజీలోనే మాకు తెలుగు పాఠాలు చెప్పారు. ఆయన సంస్కృత పండితుడైనా, తెలుగు నాటకం చక్కగా, హృద్యంగా చెప్పేవారు. ఆయన పాపయ్య శాస్త్రికి పాఠాలు చెప్పారని తరువాత తెలుసుకున్నాం.

♦ఆవుల గోపాలకృష్ణ మూర్తి ఉపన్యాసం ఎ.సి. కాలేజీలో ఏర్పాటు చేస్తే, పాపయ్య శాస్త్రి కూడా వచ్చి, మెచ్చుకున్నారు. అది విశేషం. చెట్లకు ప్రాణం వుంది, అవి స్పందిస్తాయనే జగదీష్ చంద్ర, సైంటిస్టు ఎంత వరకు పాపయ్య శాస్త్రిని ప్రభావితం చేశాడో తెలియదు. కాని ఆయన కవితల్లో పూలపట్ల కదలించే తీరు గొప్పది.

బౌద్ధ ప్రభావం పాక్షికంగానే యీయన స్వీకరించి, కరుణతో ఆపేసినట్లున్నది. పాపయ్యశాస్త్రి రచనలు – 

ఉదయశ్రీ, విజయశ్రీ, అరుణ కిరణాలు, కరుణామయి, కరుణశ్రీ, వీరభారతి, ఉదయభారతి, చారుమిత్ర, తెనుగుసేతు, కళ్యాణకాదంబరి, ప్రేమ మూర్తి (బుద్ధుని గురించి) స్వప్న వాస్తవ దత్తం, మహతి, కళ్యాణ కల్పవల్లి, మందిరము, బాల భారతి (కథలు), గురు దక్షిణ, బంగారు పద్మం (పిల్లల నాటకం), ఇంద్రధనుస్సు (పిల్లల కథలు), కళ్యాణ దంపతులు (పిల్లల కథలు), చందమామలో కుందేలు (పిల్లల కథలు), తెలుగు బాల (నీతి శతకం), శ్రీనివాస వాచకం (పిల్లల పాఠ్య గ్రంథం), నలుగురు మిత్రులు (నవల), సింహం మెచ్చిన బట్టి ఒక (పిల్లల కథలు), వసంత సేన (నవల), ఆది కవి వాల్మికి (పిల్లల కథలు), త్యాగమూర్తి (ఏసు జీవితం), దమయంతి (నవల), మహావీరుడు (నవల), భగీరథుడు (నవల), విశ్వ దశలహరి (కథలు), పద్మావతి శ్రీనివాసం (కథలు), ముద్దు బాలశిక్ష (పిల్లలకు), సాయి సుధా లహరి (కావ్యం), ఉమర్ ఖయాం (కావ్యం), ఆకాశవాణి గేయ నాటికలు (20).

ఆ రోజులలో పిల్లల సాహిత్యం యింత రాశారని నేటితరాల వారు గమనించాలి.

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺


Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩