🚩🚩-హిరణ్యాక్ష -హిరణ్యకశిపులు జననం .-🚩🚩 (పోతన భాగవత కధ .)
🚩🚩-హిరణ్యాక్ష -హిరణ్యకశిపులు జననం .-🚩🚩 (పోతన భాగవత కధ .) #కశ్యప ప్రజాపతికి పదమూడుమంది భార్యలు. ఆయన తన 13మంది భార్యలతోను ధర్మ బద్ధమయిన జీవితం కొనసాగిస్తున్నాడు. ఒకరోజు సాయంకాలం ఆయన అగ్నికార్యం చేసుకుంటున్నాడు. అసుర సంధ్యాసమయం ప్రారంభం అయింది. ఆయన సాక్షాత్తుగా రాశీ భూతమయిన తపశ్శక్తి. అటువంటి మహానుభావుడు. ఆయన దగ్గరికి "దితి" వచ్చి ఆయనతో ఒక మాట అంది - "నామీద మన్మథుడు బాణ ప్రయోగం చేశాడు. నేను ఆ బాణ ప్రయోగపు తాకిడికి తట్టుకోలేక నిలువెల్లా కదిలిపోతున్నాను. నీవు నా భర్తవి. అందుచేత నీవు నన్ను అనుగ్రహించి నాలో కలిగిన ఈ కామావేశమునకు ఉపశాంతిని కలిగించు" అని చెపుతూ ఆవిడ ఒకమాట చెప్పింది. "నేను ఇలా అడగడం వెనకాల ఒక రహస్యం ఉంది" అంది. "అదేమిటో చెప్పవలసింది" అని అడిగాడు కశ్యపుడు. ఆవిడా అంది "నీకు 13మంది భార్యలు ఉన్నారు. మేమందరం ఏకగర్భ సంజాతులం. 13 మందినీ ప్రజాపతి నీకిచ్చి వివాహం చేశాడు. అందులో 12మందికి సంతానం కలిగారు. ఇంకా నాకు సంతానం కలుగలేదు. సాధారణంగా భార్యాభర్తల అనుబంధంలో ఒక గొప్ప సిద్ధాంతం ఉంది. "ఆత్మావై పుత్రనామాసి" - భర్త భార్యకు అపురూపమ