❤️🚩గీతాంజలి స్వీయ కధ .🚩❤️
❤️🚩గీతాంజలి స్వీయ కధ .🚩❤️ ✍🏿నా జన్మస్థలం రాజమండ్రి. మా నాన్నగారి పేరు శ్రీరామ్మూర్తి. అమ్మ శ్యామలాంబ. మేం ఇద్దరు అక్కా చెల్లెళ్ళం. నాన్నగారు నాకు పెట్టిన అసలు పేరు మణి, మా అక్క పేరు స్వర్ణ. నా తొలి చిత్రం నన్ను సినిమాల్లో చేర్పించాలని నాన్నగారికి కోరిక ఉండేది. ప్రముఖ నృత్య కళాకారుడు, నృత్య దర్శకుడు వెంపటి సత్యం గారి దగ్గర నేను భరత నాట్యం నేర్చుకునేదాన్ని. అదే సమయంలో దర్శకులు బి.ఎ.సుబ్బారావుగారు ‘రాణీరత్నప్రభ’ చిత్రం నిర్మిస్తున్నారు. ఆ చిత్రంకోసం నాట్యకళాకారులు కావాలని సుబ్బారావుగారు అడగటంతో, మా గురువు వెంపటి సత్యం గారు నాతో సహా నలుగురిని పంపించారు. మా నలుగురిచేతా బిట్లు బిట్లుగా డ్యాన్స్ చేయించారు. ఇందులో నాది భరత నాట్యం పాత్ర. హీరోయిన్‌గా తొలి చిత్రం ‘రాణీరత్నప్రభ’ చిత్రంలో రామారావుగారు కథానాయకుడు. అంజలీదేవి గారు కథానాయిక. ఈ సినిమాలో నా భరతనాట్యం చిత్రీకరణ కోసం మా నాన్నగారు నా వెంట సహాయంగా వచ్చారు. నా నృత్య ప్రదర్శన షాట్ల చిత్రీకరణ పూర్తయింది. అప్పుడే ఎన్.టి.రామారావుగారు నన్ను చూశారు. అప్పటికప్పుడే. రామారావుగారు, కమలాకర కామేశ్వరర