🚩🚩తెనాలి వారి కవితా విన్యాసం!🚩🚩


🚩🚩తెనాలి వారి కవితా విన్యాసం!🚩🚩
👉🏿విన్నవేయైనా కొన్ని మరల మరల వినాలనిపిస్తుంది. అందులో మనవికటకవి తెనాలి రామకృష్ణుని కవితా విన్యాస మొకటి. 
అలాంటి సంఘటనే యొకసారి రాయల సభలో జరిగింది. దానిని వారెలా యెదుర్కొన్నారో మన మిప్పుడు తెలిసికొందాం.
 "#ప్రగడ రాజు నరసరాజనే" గొప్ప పండితుడు ఒకనాడు రాాయల సభకు వచ్చాడు.రాయలకు నమస్కరించి,"ప్రెభూ నేనెరుగని గ్రంధములేదు, యేపద్యమునకైనను సునాయాసముగా నర్ధమును జెప్పగలను. మీయాస్థానమున పెద్దనాది కవీంద్రులు కలరుగదా వారెవరైన నాతో వాదముచేయగలరా?లేనిచోృజయ పత్రమిప్పించుడు" అనిపలికెను.
అంత రాయలు తెనాలిివారివంక జూచి కన్నుగీటెను. అంతే మన వికటకవిలేచి విజృభించెను. " నరసరాజా! పెద్దలు వారిదాకాయెందుకు? ముందు నన్నుగెల్వజాలిన నాపై వారి విషయమును జూచికొనవచ్చును. ఏమీ తామెరుంగవిగ్రంధములేదా?మాయొద్దనొకగ్రంధమున్నది.*దానినిప్పుడే దంప్పింతును ."అనిసేవకులకేదోఞచెప్పిపంపెను.వారొక పల్లకీలో నొకగ్రంధమును చీనాంబరమున గప్పి దెచ్చిరి. " అయ్యాగ్రంధమువచ్చివది. దీనిపేరు మీరెరుగుదురేమో చెప్పుడు.ఆపైగ్రంధవివరణ మొనర్పవచ్చుననెను." గ్రంధముపేరడుగ ' #తిలకాష్ఠ మహిషబంధనము ' అనిచెప్ప నాపండితుడు దిక్కులుచూడసాగెను.

సరే అయినదిగదా యీ గ్రంధముపేరైనను తమరెరుంగరు. ఇక దానివివరములేమి చెప్పగలరు? ఇకమీరేదైనాృపద్యమునకు సునాయాసముగా నర్ధమును చెప్పగలననిగదాయనినారు. యేదీ తమరీపద్యమునకు అర్ధమును దెల్పుడు?

సీ:
#మేకతోకకుమేక తోకమేకాతోక
తోకమేకకుతోక మేకతోక;
మేకతోకకుమేక తోకనేకామేక
తోకమేకకుమేక తోకమేక;
మేకతోకకుమేక మేకతోకామేక
మేకతోకామేక మేకతోక;
మేకతోకకుమేక మేకతోకామేక
మేకతోకామేకృ మేకతోక;

గీ: మేకమెకనేకతొకతోక మేకమేక
మేక మెకనేక తొకతోక మేక మేక
మేక మెకమేక తొకతోక మేకమేక
మేకమెకమేక తొకతోక మేక మేక;

అయ్యా!యిదీ పద్యం. అర్ధంసెలవియ్యండీ! అన్నాడు.పాపం! లౌక్మం తెలియనియాపమడితుడు తెల్లబోయాడు.యేంచెయ్యాలో తెలియక చేతులు జోడించాడు." ెఓహో!యిదేనా తమపాండిత్యం?ఇంతమాత్రానికే యింతమిడిసిపాటా? నీవేమి పండితుడవయ్యా!

" #తెలియనివన్ని తప్పులని దిట్టతనాన సభాంతరమ్మునన్
పలుకగరాదు రోరి పలుమార్లు, పిశాచపు పాడిగట్ట! నీ
పలికిన నోట దుమ్ముపడ;! భావ్యమెరుంగగ నేర వైతి పె
ద్దలనిరసింతువా? ప్రగడ రాణ్ణరసా!విరసా!తుసా! బుసా!

అనియెక పద్యంతో రామకృష్ణుడాతవిదుమ్ముదులిపాడు". పండితుని దురవస్థగాంచి రాయలు దయతో కొంతద్రవ్యమొసంగిపంపెను.నాటి సభముగియనున్నది. రాయలవారడిగినారు" తెనాలివారూ యేదాగ్రంధము?యిటుదెప్పింపుడు? మేమును ఇంతవరకాగ్రంధమును వినలేదు కనలేదు" అనిపలుక దానిదేమున్నది,చూడుడని,పల్లకీలో దుకూలమును దొలగించి కొన్ని నువ్వుకట్టెలను, గేదెనుగట్టు పలుపుత్రాడును దెచ్చిరాయల ముందుంచెను. యిదియేమనియడుగ" యివితిలకాష్ఠములు- అదిమహిషబంధనము." అనినాడు.రాయలవారు ఔరాయనివిస్తుబోయినారు.

#ఇక తెనాలి వారు చెప్పిన పద్యార్ధమును వివరింపుమన" అందేమున్నదిప్రభూ!మేకలమందయే! ఒకదానివెనుక నొకటిగా బేవుచున్నవనెను. తెనాలివారి సమయస్ఫూర్తికి,తెలివితేటలకు రాయలబ్బురపడి యఖండ సన్మానమొనరిమచెనట!
ఇదీ తెనాలి రామకృష్ణుని కవితా విన్యాసములలోృనొకటి!

🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐