శోభనాచల: వింజమూరి అనసూయా దేవి గారి గేయాలు
శోభనాచల: వింజమూరి అనసూయా దేవి గారి గేయాలు: vinjamuri anasuya devi అవసరాల (వింజమూరి) అనసూయా దేవి గారు ఆలపించిన రెండు గేయాలు వినండి. vinjamuri anasuya devi ఏమే చి..
.🚩🚩శిథిలాలయమ్ములో శివుడు లేడోయి!🚩🚩
.🚩🚩శిథిలాలయమ్ములో శివుడు లేడోయి!🚩🚩
.............
లోక మందిరమునకు పునాది రూపాన్ని
అన్వేషించ యత్నించిన భావుకుడు మన దేవుల పల్లి క్రిష్ణ శాస్త్రి.
ఆ అన్వేషణా భారంతో ఎంతగా డస్సి పోయాడో కదా
పాపం! ఆ భావ కవీంద్రుడు.
"భావనా" గవేషణా లాలిత్య లయలతో
సాగిన ఆయన గీతం ఇది.
( లైబ్రరీలలో 4 నెలల పాటు గాలించీ ........ గాలించీ .......
హమ్మయ్య! ఇప్పటికి దొరికింది నాకు, ఈ పాట! )
పాఠక మిత్రులకై ఇదిగో! స్వీకరించండి! )
****************************************
శిథిలాలయమ్ములో శివుడు లేడోయి!
ప్రాంగణమ్మున గంట పలుక లేదోయీ!
దివ్యశంఖము గొంతు తెరవ లేదోయి
పూజారి గుడి నుండి పోవ లేదోయి!
చిత్ర చిత్రపు పూలు – చైత్ర మాసపు పూలు
ఊరూరా, ఇంటింట ఊరకే పూచేయి -
శిథిలాలయమ్ములో శిల కెదురుగా కునుకు
పూజారి కొకటేని పువ్వు లేదోయి
వాడ వాడల వాడె, జాడలన్నిట వాడె
వీడు వీడున వాడె, వీటి ముంగిట వాడె
శిథిలాలయమ్ములో శిల కెదురుగా కునుకు
పూజారి వానికై పొంచి ఉన్నాడోయి
************************************
Comments
Post a Comment