Posts

🚩🚩-గుర్రం జాషువా -పాపాయి పద్యాలు.❗️

Image
  ❤మహాకవి గుర్రం# జాషువా రచించిన నాలుగు పాపాయి పద్యాలను సంగీత దర్శకుడు, ఆంధ్రుల అమర గాయకుడు శ్రీ #ఘంటసాల వెంకటేశ్వరరావు నాలుగు విభిన్న రాగాల్లో స్వరపరచి గానం చెయ్యటం తెలుగువారి అరుదైన అదృష్టమే. అప్పుడే పుట్టిన పాపాయిపై ఇంత రసాత్మకంగా కట్టిన పద్యాలు బహుశా తెలుగులో మరింక లేవేమో! ఈ పాపాయి పద్యాలలో ఇంత మంచి సాహిత్య సృష్టి జరిగింది. కానీ, ఆ సాహిత్యాన్ని అనుభవించి, పలవరించకపోతే అద్భుతమైన సంగీత సృష్టి అసాధ్యం. ఆ పని చేసి ఘంటసాల ఈ పద్యాలకు చిరాయువు కల్పించాడు. ❤మొదటి పద్యం: #నవమాసములు .! (నాయనా! పురిటింటి తెరువరి! కులజ్యోతి! నీకు దీర్ఘాయువురా!) ♥️రాగం: హిందూస్తానీ సంగీతంలో దుర్గా    (కర్నాటక సంగీతంలో శుద్ధ సావేరి) ♦️#నవమాసములు భోజనము నీరమెరుగక, పయనించు పురిటింటి బాటసారి చిక్కు చీకటి చిమ్ము జానెడు పొట్టలో, నిద్రించి లేచిన నిర్గుణుండు నును చెక్కిళుల బోసినోటి నవ్వులలోన, ముద్దులు చిత్రించు మోహనుండు అక్షయంబైన మాతృక్షీర మధుధార లన్నంబుగా తెచ్చుకొన్న యతిథీ ♦️#బట్ట కట్టడు, బిడియాన బట్టువడడు, ధారుణీ పాఠశాలలో చేరినాడు, (కానీ) వారమాయెనో లేదో మా ప్రకృతి కాంత కరపి యున్నది వీని కాకలియు నిద్ర! -...

🚩🚩-శ్రీకృష్ణ లీలలు – ప్రలంబాసుర వధ (శ్రీగర్గభాగవతము లోని కథ)

Image
♦️యమునాతీరములో ఉన్న పొగడ చెట్టు మీదకూర్చుని మధుర వేణుగానముతో శ్రీకృష్ణపరమాత్మ సామవేదసారాన్ని బోధించెడివాడు. ఎంతో ప్రియముగా లేలేత పసిరికను మేస్తున్న గోమాతలు ఆ మధుర వేణురవం వినగానే పసిరికను వదిలి నిశ్చేష్టులై బొమ్మలవలె నందబాలునివైపు చూస్తూ వేణుగానమును ఆస్వాదించెడివి. హంసలు బెగ్గురుపక్షులు సమాధినిష్ఠులవలె వేణుగానమును గ్రోలుచుండెడివి. ♦️పరమాత్మ గోపబాలులతో ఆడుచు పాడుచు నృత్యములు చేసెడివాడు. వారు గంతులువేస్తూ పరుగులెడుతూ పందెములు వైచుచూ కలహములాడుచూ క్రీడించుచుండ ♦️ఒకసారి వారు రెండు పక్షములుగా బారులుదీరి ఒకపక్షమునకు బలరాముని రెండవ దానికి శ్రీకృష్ణుని నాయకులుగా ఎంచుకొని ఆడుచుండిరి ♦️గెలిచిన పక్షమువారిని ఓడినవారు భాండీరకమను వటవృక్షము కడకు మోయవలెనని పందెము. ఆటలో శ్రీకృష్ణుని పక్షము ఓడిపోయెను. భక్తుల వద్ద ఓడిపోవుట భగవంతునికి పరిపాటి కదా! పరమాత్మ ప్రియసఖుడైన శ్రీధాముని మోసెను. మారువేషములో వచ్చి శ్రీకృష్ణుని పక్షాన ఉన్నట్టు నటించి కంస ప్రేరితుడైన ప్రలంబాసురుడు అవతల పక్షములో ఉన్న బలరామదేవుని మోసెను. ♦️ప్రలంబుని కపటము గ్రహించి బలరామస్వామి తన బరువు పెంచుకొనెను. మోయలేక దానవుడు నిజరూపము దాల్చెను. ప్రలంబ...

🔻💥 ద్రౌపది నవ్వుకు కారణం .💥🔻

Image
  🚩 💥ధర్మం తెలిసిన #భీష్ముడు కురుక్షేత్ర సంగ్రామం జరిగినప్పుడు మాత్రం పాండవ పక్షమునకు వెళ్ళలేదు. దుర్యోధనుని పక్షంలో ఉండిపోయారు. 💥భీష్ముడిని ముళ్ళపంది ఎలా అయితే ముళ్ళతో ఉంటుందో అలా అంగుళం మాత్రం చోటులేకుండా అన్ని బాణములతో కృష్ణుడు ఎందుకు కొట్టించాడు? 💥భీష్మం చ ద్రోణం చ జయద్రథం చ” అని పరమాత్మ వాళ్ళందరినీ తానే సంహరిస్తున్నానని గీతలో చెప్పాడు. 💥భీష్ముడిని అన్ని బాణములతో ఎందుకు కొట్టాడు? ఈ రెండూ భీష్మాచార్యుల వారి జీవితమునకు సంబంధించి చాలా గహనమయిన ప్రశ్నలు. 💥#భీష్ముడు తన జీవితం మొత్తం మీద ఒక్కసారే ధర్మం తప్పాడు. అదికూడా పూర్తిగా ధర్మం తప్పాడు అని చెప్పడం కూడా కుదరదు. ధర్మరాజుకి, శకునికి మధ్య ద్యూతక్రీడ జరుగుతోంది. అలా జరుగుతున్నప్పుడు శకుని మధువును సేవించి ఉండడంలో మరచిపోయి ముందు ధర్మరాజుని ఒడ్డాడు. ధర్మరాజుని నిన్ను నీవు పణంగా పెట్టుకో అనిన తరువాత, ధర్మరాజు ఓడిపోయాడు. 💥ఓడిపోయినా తరువాత శకునికి గుర్తువచ్చింది “నీ భార్య ద్రౌపది ఉన్నది కదా, ఆవిడని ఒడ్డు” అన్నాడు. అప్పటికే ధర్మరాజు శకుని దాస్యంలోకి వెళ్ళిపోయాడు. ధర్మరాజు అనుకున్నాడు “దౌపదిని ఒడ్డడంలో ఏదైనా దోషం ఉంటే అది ఒడ్డమన్న శకు...

🌹💥🙏 -భజ గోవిందం వివరణ(2.) -.🙏💥🌹 ( #శ్లోకాలకు తెలుగు అర్ధము.... 16నుండి 33 వరకు.)

Image
  🔔🔔 ♦#అంగం గలితం పలితం ముండం దశన విహీనం జాతం తుండమ్ | వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి న ముంచత్యాశా పిండమ్ || 16 || ♦సత్తువ ముసలివాని శరీరం వదిలిపోయింది, తల బట్టబుర్ర అయ్యింది, పళ్ళు పోయి బోసినోరు వచ్చింది, ఊతకర్రపై వాలినా అతని కోరికలు మాత్రం బలంగానే ఉన్నాయి 🔔🔔 ♦#అగ్రే వహ్నిః పృష్ఠే భానుః రాత్రౌ చుబుక సమర్పిత జానుః | కరతల భిక్షస్-తరుతల వాసః తదపి న ముంచత్యాశా పాశః || 17 || ♦తన శరీరం వేడెక్కేలా ముందు నిప్పు మరియు వెనుక సూర్యుడుతో కూర్చుని ఉన్న మనిషి అక్కడ ఉన్నాడు. రాత్రి చలి నుంచి తప్పించుకోవటానికి వణకుతాడు. ఆటను తన చేతి చిప్పలోని భిక్షం తిని చెట్టుకింద పొడుకుంటాడు. ఇంకా మానసికంగా, అతను కోరికల చేతిలో ఒక దౌర్భాగ్య తోలుబొమ్మ. 🔔🔔 కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలనమ్-అథవా దానమ్ | జ్ఞాన విహీనః సర్వమతేన భజతి న ముక్తిం జన్మ శతేన || 18 || ఒకడు గంగకు పోయినా ఉపవాసాలున్నా, దానధర్మాలు చేసినా, జ్ఞానం లేకుంటే వేయి జన్మలైనా ముక్తి లేదు. 🔔🔔 ♦#సురమందిర తరు మూల నివాసః శయ్యా భూతలమ్-అజినం వాసః | సర్వ పరిగ్రహ భోగత్యాగః కస్య సుఖం న కరోతి విరాగః || 19 || ♦గుడిలోనో, చెట్టుకిందో నివసించు, జింక చర్మం ధ...

🚩 - ఒక పాలఘాట్ అమ్మయి కధ.!-🚩

Image
  #సుబ్బారావు ఆఫీసు నుంచి ఇంటికొచ్చి, కాస్త స్థిమిత పడ్డాడో లేదో అతని భార్య సావిత్రి వచ్చి, అతనితో నెమ్మదిగా, ” అత్తగారు మీతో ఏమన్నా మాట్లాడాలి కాబోలు. ఇందాకటి నుంచీ కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతున్నారు” అంది. ‘ఎందుకు?’ అన్నట్టు ప్రశ్నార్థకంగా చూశాడు సుబ్బారావు. ‘ ఏమో’ , అన్నట్టు పెదవి విరిచింది సావిత్రి. సుబ్బారావు తల్లికి ఈమధ్య సుస్తీ చేసి, ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. సాధారణంగా అతను ఆఫీసు నుంచి వచ్చాకా, స్నానమూ ,భోజనమూ అయ్యాకా వెళ్ళి, కాసేపు ఆవిడ పక్కన కూచుని మంచీ చెడూ మాట్లాడి వస్తాడు. ఆవేళ– సాయంత్రం నుంచే “అబ్బాయి ఇంకా రాలేదా?” అని చాలాసార్లు అడిగింది కోడల్ని నాగలక్ష్మి. అందుకే సుబ్బారావు ఇంటికి రాగానే అతనితో మాట్లాడడానికి తల్లి ఆతృత పడుతున్నట్టు చెప్పింది సావిత్రి. ఎందుకో అని అతను భోజనం కూడా చెయ్యకుండా తల్లి దగ్గరకెళ్లేడు. “ఎలా ఉందమ్మా ఒంట్లో?” అడిగేడు సుబ్బారావు తల్లి పక్కనే మంచం మీద కూచుంటూ. “ఎంతసేపైందిరా నువ్వింటికొచ్చి?” అందామె సమాధానంగా. తల్లి గొంతుకెందుకో కొత్తగా వినిపించింది సుబ్బారావుకి. ” ఇప్పుడే పది నిముషాలైంది…. నువ్వు మందు పుచ్చుకున్నావా….?” అన్నాడు. “ఊ….” అన...

🚩-నాలో నేను ! (#భానుమతి గారి ఆత్మ కధ నుండి . .)

Image
  -నాలో నేను ! ( #భానుమతి గారి ఆత్మ కధ నుండి . .) నాకు మధ్య తరగతి జీవనమే ఇష్టం. పెళ్ళైన కొత్తలో మాంబళం (మద్రాసు) మహాలక్ష్మి స్ట్రీట్ ఇంటి నెంబరు 12లో ఉండేవాళ్ళం. పదిహేను రూపాయలు అద్దె. ఆ రోజుల్లో మేమిద్దరం చూసిన ఇంగ్లీష్, హిందీ సినిమాలు, తిన్న ఐసుక్రీములు , తిరిగి ఇంటికి రావడానికి మౌంట్ రోడ్డులో పదకొండో నెంబరు బస్సుకోసం వెయిట్ చేయడం, అది రాకపోతే మళ్ళి సినిమాకెళ్ళడం ఇప్పటికి నా స్మృతి పధంలో మెదులుతాయి. ఈ రోజుల్లో కార్లు, బంగళాలు ఇవ్వలేని సుఖశాంతులు ఆ రోజులు నాకందించాయని ఇప్పటికీ నమ్ముతుంటాను. . రామారావుగారంటే నాకు చాలా గౌరవం. చాలాసార్లు నా దగ్గర సలహాలు తీసుకొనేవారు.నాకు రఘుపతి వెంకయ్య అవార్డు ఇచ్చినప్పుడు నా చేతికి బంగారు కంకణాన్ని తోడిగారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత హైదరాబాదులో నన్ను ఘనంగా సన్మానించారు. ఇంటికి ఎప్పుడు వెళ్ళినా అత్తయ్య వచ్చిందంటూ పిల్లలందరినీ పిలిచి కాళ్ళకు నమస్కారం చేయించేవారు. . నాకు మొదటినుంచి కర్ణాటక సంగీతం అంటే చాలా ఇష్టం. మా సొంత సినిమాల్లో కచ్చితంగా క్షేత్రయ్య పదమో, త్యాగరాజ కీర్తనో, జయదేవాష్టపదో పెట్టేదాన్ని. అది నేను మా నాన్నగారికి చేసిన వాగ్దానం. అదొక శ...

- ❤️-సాని--దొరసాని-❤️

Image
సాహిత్యమరమరాలు #సురవరం ప్రతాపరెడ్డి ఒకసారి విశ్వనాథ సత్యనారాయణకు కొంత ఆర్థిక సహకారం అందిద్దామనే సదుద్దేశంతో ఆయనను ఒక సంస్థానాధీశురాలి దగ్గరికి తీసుకెళ్లారు. నాడు సంస్థానాధీశులకు సివిల్, క్రిమినల్‌ అధికారాలు ఉండేవి. నాటి మర్యాదలను అనుసరించి ఆమె పరదాకు ఆవైపు, ఇవతలివైపు విశ్వనాథ కూర్చున్నారు. ‘‘మీరు చాలా సంప్రదాయికులనీ, మంచి కవిత్వం వ్రాస్తారనీ విన్నాను. కానీ మీరు ‘సాని’ పాటలు కూడా వ్రాశారేమిటండీ?’’ అని ప్రశ్నించిందామె. ఆమె తన #కిన్నెరసాని’ పాటలను గూర్చి అడుగుతున్నదని విశ్వనాథకు అర్థమైంది. ‘‘అమ్మా! అది ఈ ప్రాంతంలో ఒక వాగు పేరు. ఆ పేరుతో పాటలు వ్రాశానే గాని, వాటిల్లో ఎలాంటి అశ్లీలమూ లే’’దని ఎంతచెప్పినా ఆమె వినిపించుకోలేదు. ‘మీరు ఎన్నైనా చెప్పండి సాని సానే’ అని ముక్తాయించింది. ఇది విశ్వనాథ అహాన్ని దెబ్బ తీసింది. ‘‘అమ్మా, ఇందాకటినుంచీ పనివాళ్లు మిమ్మల్ని #దొరసానీ! అని పిలుస్తున్నారు గదా, దాని సంగతేవిటి? ఇక వస్తాను, సెలవు’’ అని లేచి వచ్చేశారు. ఇది చూస్తున్న ప్రతాపరెడ్డి, ‘‘ఎంతపని చేశావయ్యా, ఆమె కోపిస్తే ఏమైనా చేయవచ్చు’’ అన్నారట. అందుకు విశ్వనాథ, ‘‘ఆ ఏం చేస్తుంది, చంపుతుందా? నిజం చెప్పడానికి భ...