🚩🚩#శ్రీసిరివెన్నల_గారి_జగమంతకుటుంబం.
*శ్రీ సిరివెన్నల సీతారామశాస్త్రి గారు
అద్వైత దృక్పధం లో వ్రాసిన పాట!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్న మహానుభావులైన పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు, సంగీత దర్శకులు చక్రి గారు భౌతికంగా దూరమైనప్పుడు
జగమంతా కుటుంబంనాది..ఏకాకి జీవితం నాది
పాటతో ఓదార్పు పొందేలా....
**ఈ పాట మనిషిని వెంటాడుతుంది, మనసుని వేటాడుతుంది, వేధిస్తుంది, నివేదిస్తుంది, 'వేదా'న్తిస్తుంది, విరహింపచేస్తుంది, విమోచనం చేస్తుంది. సిరివెన్నెల కలంకార్చిన కన్నీరు, శ్రోతల మనసుల్లో పారే పన్నీరు. తెలుగు పాటల ప్రస్థానంలో ఈ పాటది చిరస్థానం
@జగమంతకుటుంబం పాట!
*పల్లవి :
"జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
సంసార సాగరం నాదె సన్యాసం శూన్యం నావే
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది"
*కవినై కవితనై భార్యనై భర్తనై
కవినై కవితనై భార్యనై భర్తనై
మల్లెల దారిలో మంచు ఎడారిలో
మల్లెల దారిలో మంచు ఎడారిలో
పన్నీటి జయగీతాలో కన్నీటి జలపాతాల
నాతో నేను సంగమిస్తూ నాతో నేనే భ్రమిస్తూ
ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం
కలల్ని కధల్ని మాటల్ని పాటల్ని
రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్యల్ని ఆడ పిల్లల్ని
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
**మింటికి కంటిని నేనై
కంటను మంటను నేనై
మంటల మాటున వెన్నెల నేనై
వెన్నెల కూతల మంటను నేనై
రవినై శశినై దివమై నిశినై
నాతో నేను సహగమిస్తూ నాతో నేనే రమిస్తూ
ఒంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని
చరణాలచలనాన కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్ర జాలాన్ని
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది!
*గాలి పల్లకిలోన తరలి నాపాట పాప ఊరేగి వెడలె
గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలె
నా హృదయమే నా లోగిలి
నా హృదయమే నా పాటకి తల్లి
నా హృదయమే నాకు ఆలి
నా హృదయములో ఇది సినీ వాలి..
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది!!
**
శ్రీ సిరివెన్నల సీతారామశాస్త్రి గారు అద్వైత దృక్పధం లో వ్రాసిన
ఈ పాట ఆధారంగా చేసుకుని చిత్ర దర్శకుడు కృష్ణవంశీ ' చక్రం ' సినిమా నిర్మించారు .కానీ బ్రతికేవాడు ఎలా బ్రతకాలో తెలిపే పాటను చావబోయే వాడు చచ్చే ముందు చెప్పే ఫిలాసఫీ గా మార్చేసారు .
కానీ ఆ పాటను వెలుగులోకి తెచ్ఛిన ఘనత ఆయనదే .
*సృష్టిలో ఉన్నది ఒకటే నని అదే రెండుగా అనేకంగా మారిపోయిందని అద్వైత తత్వసారాంశం .
ఈ తత్వానికి ఆదిశంకరాచార్యలు ఆద్యులు.ఈ అద్వైత తత్వానికి ఫై సమీకరణం అయితే దానికి రక్త మాంసాలు కల్పించి ప్రాణం పోసింది శాస్త్రి గారి పాట. నవరసాలకు మూలమైన తత్వం ఈ పాటలో ఉంది .
జగమంతకుటుంబం ఏకాకిజీవితం నేను(నాది)
జగమంతకుటుంబం : (కవి ×కవిత),(భర్త × భార్య),(భగవంతుడు × భక్తుడు) ....ఇలా ఒకరికొకరు వరసైన జంటలను ఎన్నైనా ప్రతిక్షేపించుకోవచ్చు.
కానీ ఏవరసకావరసే.తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే, ఏమాటకామాటే . ఒక వరస పనిచ్తేస్తున్న సమయంలో రెండోది పనిచెయ్యదు . అలా ఏ వరసకు ఆ వరసను , ఏ రసానికి ఆ రసాన్ని విడివిడిగా గుర్తించడమే సామరస్యం .
అలాగే మనిషి మాటలకు చేతలకు పొంతన లేకపోతే అతడు ‘వ్యక్తి’ కాలేడు .‘వ్యక్తి’త్వ లోపం వంచనకు,ఆత్మవంచనకు,సంఘర్షణకు దారితీస్తుంది . ఐక్యమత్యమే బలం అన్నట్టు మనస్సు,వాక్కు,కర్మ మూడింటికి పొంతన కుదిరి ఐక్యం (ఒకటి)గా ఉంటేనే నైతిక బలం సిద్దిస్తుంది. మనోవాక్కయకర్మలలో ఏకత్వమే చిత్తశుద్ది ,నిజాయితీ.
**అలాగే ఏ ఇద్దరి జీవితాలు ఒకలా ఉండవు . ఉదాహరణకు శ్రీరాముడు,శ్రీకృష్ణుడు.వీరిద్దరిలోను, ఫై సమీకరణాల్లో లాగే ఏకత్వం-మనోవాక్కయకర్మలలో ఏకత్వం -ఉంది . కానీ ఇద్దరి జీవితమార్గాలు ఒకలాలేవు . విలక్షణంగా ఉన్నాయి. కారణం వారు ఏకత్వానికి,చిత్తశుద్దికి ప్రాధాన్యత యిచ్చి,అలావుండడానికి నిరంతర సాధన చెయ్యడం వల్ల ఆసాధన ఫలితం ఒక విలక్షణ జీవితవిధానంగా దానంతట అదే రూపుదిద్దుకుంది .ఈ విలక్షణత అంతవరకు కొనసాగుతూ వస్తున్న సాంప్రదాయాన్ని సమర్ధించవచ్చు ,లేదా వ్యతిరేకించవచ్చు . అలాకాకుండా ముందే ఏదో ఒక జీవితవిధానాన్ని ఆదర్శంగా పెట్టుకుని తదనుగుణంగా జీవించడం మొదలుపెడితే అది స్వభావానికి,పరిస్థితులకు విరుద్ధమై , మనోవాక్కయకర్మలలో ఏకత్వాన్ని (integrity)పోగొట్టి అస్థిత్వాన్నే భంగపరుస్తుంది.అస్తిత్వంతో ఉండడమంటే ఏకత్వంతో ఉండడమే .అప్పుడే వ్యక్తిత్వము,విలువలు ,స్వేఛ్చ సిద్ధిస్తాయి . “Is it true?” అని కాక “Is it true for me?” అనేది ఇక్కడ ప్రాధాన్యత వహిస్తుంది .
**ఏకాకిజీవితం : ‘జగమంతకుటుంబం నాది’ అనుకునేవాడికి
ఏకాకిజీవితం తప్పదు . ఎందుకంటే అతడు ఏ వర్గంలోను,వ్యవస్థలోను,వ్యక్తులతోను చేరడు . కాబట్టి అతడు ఏకాకి, సన్యాసి. ఎందులోనూ చేరడు కాబట్టే అందర్నీ కలుపుకుపోగలడు . అందువల్ల అతనిది జగమంతకుటుంబం ,సంసారసాగరం .
నేను (సృష్టికర్త ): సూక్ష్మరూపంలో వుండే విత్తనం స్థూలరూపం పొంది వృక్షం అవుతున్నట్టు ,ఏకాకిగా వున్న 'నేను' ఇంతితై వటుడింతయై అన్నట్టు విశ్వమంత అయ్యాను . ఏకాకియైన శ్రీకృష్ణుడు ,తన విశ్వరూపాన్ని అర్జునుడికి చూపించాడు .
విత్తనంలో వృక్షం దాగి వున్నట్టు , ఏకాకి లో విశ్వం ఇమిడి వుంది .
ఏకాకి ఐన శ్రీకృష్ణుడు తన తల్లి యశోదకు తనలోనే (నోట్లోనే ) విశ్వాన్ని చూపించాడు .
విశ్వం నాలో నుండే సృష్టి అవుతోంది(evaluation)కనుక జగమంతకుటుంబం నాది . విశ్వం నాలో లీనం (లయం ) అయినపుడు నేను తప్ప ఎవరూ వుండరు కనుక ఏకాకిజీవితం నాది . ఏకత్వంలో భిన్నత్వం జగమంతకుటుంబం. భిన్నత్వంలో ఏకత్వం ఏకాకిజీవితం.
ఏకాకిగా వున్నసృష్టికర్త కవిగా ,కవితగా ,భార్యగా ,భర్తగా ............సృష్టిగా మారి జగమంత అయ్యాడు . మట్టి, కుండగా మారినట్టు సృష్టికర్తే సృష్టిగా మారాడు . మాధవుడే మానవుడయ్యాడు . నరనారాయణులు ఒక్కరే . నరుడే నారాయణుడు .
నరుడు ప్రేమికుడిగా,భావుకుడిగా ,భక్తుడిగా ఉన్నపుడు పాడుకోవడానికి ప్రేమగీతాల్ని, భావగీతాల్ని,భక్తిగీతాల్ని ఇంతవరకు కవులందరూ వ్రాసారు . కానీ నరుడు నారాయణుడిగా వున్నపుడు పాడుకునే భగవద్ గీత శాస్త్రి గారి 'జగమంతకుటుంబం'
ఉన్నది ఒకటే నని ,రెండుగా కనిపిస్తున్నవన్నీ ఒకే దానికున్న రెండు పార్శ్వాలని అద్వైతతత్వ సారాంశం.మనిషి ఏ పార్శ్వంలో ఉన్నా,జ్ఞాననేత్రంతో రెండో పార్శ్వం యొక్క ఉనికిని,దాని విలువను గుర్తించగలడు .
లౌకిక జీవితాన్ని ,ఆధ్యాత్మికతను వేరు వేరుగా చూసేవారికి ఆ రెండిట్లో ఏ ఒక్కటీ, ఎప్పటికీ పూర్తిగా అవగాహనకు రాదు . అద్వైతం లౌకికజీవితానికి అధ్యాత్మికతను జోడిస్తుంది . ఇహపరాలను రెంటినీ ఒక్కటి చేస్తుంది
@followers @ Vinjamuri Venkata Apparao















Comments
Post a Comment