❤️❤️-అద్వైతము.-❤️❤️

 

❤️❤️-అద్వైతము.-❤️❤️

చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ 🔱 🔱
|| శంకరస్తోత్రాలు : నిర్వాణషట్కమ్ ||
🖤 మనోబుద్ధ్యహంకారచిత్తాని నాహం
న చ శ్రోత్రజిహ్వే న చ ఘ్రాణనేత్రే |
న చ వ్యోమభూమిః న తేజో న వాయుః
చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || 1 ||
🚩🚩మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము, నేను కాను.
చెవి, నాలుక, ముక్కు, కన్ను నేను కాను. ఆకాశము, భూమి, నిప్పు,
గాలి నేను కాను.
చిదానందరూపుడైన శివుడను నేను. శివుడను నేను.
-----
🖤 న చ ప్రాణసంజ్ఞో న వై పంచవాయుః
న వా సప్తధాతుర్న వా పంచకోశః |
న వాక్ పాణిపాదౌ న చోపస్థపాయూ
చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || 2||
🚩🚩ప్రాణమనబడునది నేను కాను. పంచప్రాణములు
(ప్రాణ - అపాన - వ్యాన - ఉదాన - సమానములు) నేను కాను.
ఏడు ధాతువులు (రక్త - మాంస - మేదో - అస్థి - మజ్జా - రస - శుక్రములు) నేను కాను. ఐదు కోశములు (అన్నమయ - ప్రాణమయ - మనోమయ - విజ్ఞానమయ - ఆనందమయములు) నేను కాను.
వాక్కు - పాణి - పాద - పాయు - ఉపస్థలు నేను కాను
.చిదానందరూపుడగు శివుడను నేను. శివుడను నేను.
----
🖤 న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ
మదో నైవ మే నైవ మాత్సర్యభావః |
న ధర్మో న చార్థో న కామో న మోక్షః
చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || 3||
🚩🚩
నాకు ద్వేషము- అనురాగము లేవు. నాకు లోభము - మోహము లేవు. మదము లేదు. మాత్సర్యము లేదు. ధర్మము లేదు. అర్థము లేదు.
కామము లేదు. మోక్షము లేదు.
చిదానందరూపుడగు శివుడను నేను. శివుడను నేను.
-----
🖤 న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం
న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞాః |
అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా
చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || 4||
🚩🚩
నాకు పుణ్యము లేదు పాపము లేదు. సుఖము లేదు.
దుఃఖము లేదు. మంత్రము లేదు. తీర్థము లేదు. వేదములు లేవు. యజ్ఞములు లేవు. నేను భోజనము కాను. తినదగిన పదార్థము కాను. తినువాడను కాను.
చిదానందరూపుడగు శివుడను నేను. శివుడను నేను
.----
🖤 న మే మృత్యుశంకా న మే జాతిభేదః
పితా నైవ మే నైవ మాతా న జన్మ |
న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః
చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || 5||
🚩🚩
నేను మృత్యువును కాదు. సందేహము లేదు
. నాకు జాతిభేదము లేదు. నాకు తండ్రిలేడు, తల్లిలేదు, జన్మలేదు, బంధువులేడు, మిత్రుడు లేడు. గురువులేడు, శిష్యుడులేడు.
చిదానందరూపుడగు శివుడను నేను. శివుడను నేను.
--
🖤 అహం నిర్వికల్పో నిరాకారరూపో
విభుర్వ్యాప్య సర్వత్ర సర్వేన్ద్రియాణామ్ |
సదా మే సమత్వం న ముక్తిర్న బన్ధః
చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || 6||
🚩🚩
నేను నిర్వికల్పుడను. ఆకారము లేనివాడను.
అంతటావ్యాపించి ఉన్నాను. అన్ని ఇంద్రియములతో నాకు సంబంధములేదు. మోక్షములేదు. బంధములేదు.
చిదానందరూపుడగు శివుడను నేను. శివుడను నేను.
|| ఇతి శ్రీమచ్ఛఙ్కరాచార్యవిరచితం నిర్వాణషట్కం సమ్పూర్ణమ్ ||
🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩