🚩🚩-గౌతమ బుద్ధుడు.--సుగాధ బుద్ధుడు.!

-
          


✍️భూమి మీద బుద్ధుడు పేరుతో #ఇద్దరు ఉండేవారు.
ఒకరు సుగాధ బుద్ధుడు,
రెండవ వారు గౌతమ బుద్ధుడు.
పేర్లలో వ్యత్యాసం వలన, అసలు బుద్ధుడు హిందువా కాదా అని వాదించేవారు కూడా ఉన్నారు.
#గౌతమ_బుద్దుడు - ఈయన గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. అందరికీ తెలిసిన కథే.
అయితే గౌతమ బుద్దుడి జన్మ వృత్తాంతంలో గుర్తుంచుకోవలసిన విషయం, అతడు జన్మించింది ప్రస్తుత నేపాల్ దేశంలో లుంబినీ అనే ప్రాంతంలో. అసలు పేరు సిద్ధార్థ గౌతముడు. తల్లి పేరు మాయా దేవి. భారత దేశంతో ఏ సంబంధం లేని వాడు.
#సుగాధ_బుద్దుడు - కలియుగ ఆరంభంలో రాక్షస సంహారం కోసం భూమి పై అవతరించిన వాడు సుగాధ బుద్దుడు. భరత ఖండంలో కీకటేషు రాజ్యంలో (ప్రస్తుతం బీహార్) బోధ గయా అనే ప్రాంతంలో “అంజనా” అనే స్త్రీ మూర్తికి జన్మించాడు.
నిత్యం దైవస్మరణలో ఉంటూ బోధి వృక్షం కింద తపస్సు చేసి జ్ఞానోదయం పొందినవాడు. తపస్సులో ఉండగా తన శరీరంపై ఉన్న వస్తాలు జారిపోయునా గమనించని నిష్టాపరుడు.
👉 త్రిపురాసురుని సంహారం.
త్రిపురాసురుడి భార్య మహా పతివ్రత.
తన మనస్సులో భర్త రూపం ఉన్నంత వరకూ, వైధవ్యం ఉండదు అని ఆమెకు వరం ఉంది.
పరమేశ్వరుడు త్రిపురాసుడితో యుద్ధానికి సిద్ధమైన వేళ, త్రిపురాసురిడి భార్య... #తపస్సులో_నిమగ్నమై_దుస్తులు_జారిపోయున_సుగాధ_బుద్ధుడిని చూసి అతనికి ఆకర్షింపబడింది. అతని సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ కొద్ది క్షణాలు భర్తని మరిచింది. అదే సమయంలో పరమేశ్వరుడు త్రిపురాసురున్ని అంతం చేశాడు. ఈ విధంగా రాక్షస సంహారానికి సాయపడేందుకు మహా విష్ణువు తీసుకున్న అవతారమే సుగాధ బుద్ధుడు.
#జరిగిన_తప్పు ఏమిటి?
రెండు పేర్లలో సారూప్యత వలన వేరు వేరైన ఇద్దరి కథలను కలిపేసి ఒకటి చేసేశారు?
నేపాల్ లో పుట్టి, అక్కడ జరిగిన రాజ కుమారుడి కథని, బీహార్ లో పుట్టిన విష్ణు అవతారాన్ని కలిపేశారు. ఎక్కడో జరిగిన కథని, భారత దేశానికి ఆపాదించారు.
సనాతన ధర్మ రక్షకుడైన శ్రీమన్నారాయణుడి అవతారాన్ని అయోమయంలో పడేశారు. ఒక రకంగా చెప్పాలంటే, సుగాధ బుద్ధుడి కథని, గౌతమ బుద్ధుడి కథ తొక్కి పడేసిందనే అనుకోవాలి.
విష్ణు అవతారాలలోని బుద్ధుడు ,
నేపాల్ , చైనా బుద్ధుడు వేరు వేరు
భాగవతం: 1-3-24
తతః కలౌ సంప్రవృత్తే సమ్మోహాయా సురద్విషామ్।
బుద్ధో నామ్నాంజసుతః కీకటేషు భవిష్యతి॥
భావము: శ్రద్ధావంతులైన ఆస్తికులను ద్వేషించు వారిని సమ్మోహపరచు సుద్దేశ్యముతో కలియుగారంభమునందు భగవానుడు గయా ప్రాంతమున అంజనాసుతుడైన బుద్ధునిగా అవతరించును.
కీకటేషు(బీహార్) లోని గయా ప్రాంతములో అవతరించిన అంజనా పుత్రుడైన బుద్ధుడిని కనుమరుగు చేయడానికి, ఎక్కడో నేపాల్ లో మాయా దేవి పుత్రుడైన గౌతమ బుద్ధుడికి గయా ప్రాంతంలో జ్ఞానోదయం అయినట్లుగా కల్పించారు మన చరిత్రలో. కాని జ్ఞానోదయం అయిన గయా బుద్ధుడుకి మరియు బౌద్ధమతాన్ని స్థాపించిన గౌతమ బుద్ధుడికి సంబంధం లేదు, హిందువులను ఆకర్షించడానికి చేసిన ప్రయోగమే గౌతమ బుద్ధుడికి గయా ప్రాంతంలో జ్ఞానోదయమైందని వక్రీకరించుట.

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐