❤️❤️-అద్వైతము.-❤️❤️
-అద్వైతము.- చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || శంకరస్తోత్రాలు : నిర్వాణషట్కమ్ || మనోబుద్ధ్యహంకారచిత్తాని నాహం న చ శ్రోత్రజిహ్వే న చ ఘ్రాణనేత్రే | న చ వ్యోమభూమిః న తేజో న వాయుః చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || 1 || మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము, నేను కాను. చెవి, నాలుక, ముక్కు, కన్ను నేను కాను. ఆకాశము, భూమి, నిప్పు, గాలి నేను కాను. చిదానందరూపుడైన శివుడను నేను. శివుడను నేను. ----- న చ ప్రాణసంజ్ఞో న వై పంచవాయుః న వా సప్తధాతుర్న వా పంచకోశః | న వాక్ పాణిపాదౌ న చోపస్థపాయూ చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || 2|| ప్రాణమనబడునది నేను కాను. పంచప్రాణములు (ప్రాణ - అపాన - వ్యాన - ఉదాన - సమానములు) నేను కాను. ఏడు ధాతువులు (రక్త - మాంస - మేదో - అస్థి - మజ్జా - రస - శుక్రములు) నేను కాను. ఐదు కోశములు (అన్నమయ - ప్రాణమయ - మనోమయ - విజ్ఞానమయ - ఆనందమయములు) నేను కాను. వాక్కు - పాణి - పాద - పాయు - ఉపస్థలు నేను కాను .చిదానందరూపుడగు శివుడను నేను. శివుడను నేను. ---- న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ మదో నైవ మే నైవ మాత్సర్యభావః | న ధర్మో న చార్థో న కామో న మోక్షః చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || 3|| నాకు ద్వేషము- అనురా