🚩🚩*"నేఁడు భీష్మునిఁ జంపుదు నిన్నుఁ గాతు *"అంటున్న బాపు గారి కోపగించిన కృష్ణుడు .


 

🚩🚩*"నేఁడు భీష్మునిఁ జంపుదు నిన్నుఁ గాతు *"అంటున్న
బాపు గారి కోపగించిన కృష్ణుడు .
సీ. *కుప్పించి ఎగసినఁ గుండలంబుల కాంతి
గగన భాగంబెల్లఁ గప్పి కొనఁగ
నుఱికిన నోర్వక యుదరంబులోనున్న
జగముల వ్రేఁగున జగతి గదలఁ
జక్రంబుఁ జేపట్టి చనుదెంచు రయమునఁ
బైనున్న పచ్చని పటము జాఱ
నమ్మితి నాలావు నగుఁబాటు సేయక
మన్నింపు మని క్రీడి మఱల దిగువఁ
తే. *గరికి లంఘించు సింహంబు కరణి మెఱసి
నేఁడు భీష్మునిఁ జంపుదు నిన్నుఁ గాతు
విడువు మర్జున! యనుచు మద్విశిఖ వృష్టిఁ
దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు.
*కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి అంటూ సాగే పద్యం పోతన రచించిన శ్రీమదాంధ్రమహాభాగవతం లోనిది. భాగవతంలోని ఈ పద్యం మరో నాలుగు పద్యాలతో పాటు భీష్మస్తుతిగా పేరొందింది.
*కురుక్షేత్రంలో ఆయుధం పట్టను అన్న ప్రతిజ్ఞ ను, అర్జునుడిపైన ఉన్న వాత్సల్యంతో, పక్కనపెట్టి తనను చంపేందుకు దూకిన కృష్ణుణ్ణి భీష్ముడు వర్ణిస్తూ స్తుతిస్తున్న సందర్భంలోని పద్యం ఇది.

Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩