🌹 కోడలే అత్తింటికి అసలు కాంతి 🌹 (ఆధ్యాత్మిక ఉపన్యాసం)
(ఆధ్యాత్మిక ఉపన్యాసం)
ఎందుకోతెలుసా...!!!
చీర మార్చుకున్నంత సులవుగా ఇంటి పేరును మార్చుకోగలిగే అసాధారణ 'త్యాగశీలి' కోడలు...!!!
కన్నవారు ఎంతటి ఉన్నతులైనా తన అభ్యన్నతిని అత్తవారింట్లో వెతుక్కునే 'గుణశీలి' కోడలు...!!!
తండ్రికి పంచభక్ష్యాలు పెట్టగలిగే స్తోమత ఉన్నా భర్త పెట్టే పచ్చడిమెతుకుల్లోనే కమ్మటి రుచిని వెతుక్కోగల 'భాగ్యశీలి' కోడలు...!!!
తాను మెట్టినింటి పట్టపురాణి. అయినా సరే ఒక దాసిలా అందరికీ సేవచేసి అలసిపోయి పచ్చిపుండులా మంచానికి ఒరిగి కష్టాన్ని మరచి మరునాడు ఉదయమే
"జీ హుజూర్" అంటూ అత్తింటి సేవకు సిద్ధమయ్యే 'శ్రమజీవి' కోడలు...!!!
అందుకే కాఁబోలు సీతమ్మ అశోకవనంలో శోకిస్తున్నప్పుడు కూడా తమ వనవాసానికి కారణమైన మామ దశరథుడిని తక్కువ చేసి ఎన్నడూ మాట్లడలేదు,
పైగా మీరెవరని హనుమ అడిగిన ప్రశ్నకి దశరథుడి కోడలినని చెప్పిందే తప్ప జనకుడి బిడ్డనని చెప్పలేదు, ఇది ఉత్తమ కోడలియుక్క నిష్ఠ...!!!
కుడికాలు పెట్టి కోడలు తన ఇంటిలోకి రాగానే, అమ్మకోసం బెంగపెట్టుకున్న పసివాడిలా ఎగిరిగంతులేస్తాడు ఆ కోడలి యొక్క మామ.ఎందుకోతెలుసా రేపట్నుంచి అందరికీ అన్నం పెట్టే అమ్మయే కోడలు...!!!
కొడుకు పెళ్ళికోసం వేసిన పందిరి ఆకులపై కూర్చున్న పితృదేవతల కోసం "నాంది శ్రాద్ధం" పెట్టి, మన వంశాన్ని ఉద్ధరించగలిగే సమర్థురాలైన గొప్పకోడలిని ఎంచుకున్నాను అని గర్వంతో చెపుతాడు మామయ్య.ఎందుకంటే కోడలే అత్తింటికి అసలు కాంతి...!!!
పెళ్లి అయ్యాక ఏడుస్తున్న పెళ్లికూతురిని చూసి ఇప్పుడు నీకెవరు దిక్కు మీ నాన్నయా.? అని ఎవరయినా అడిగితే "న న" (కాదు కాదు) అంటుంది. పెంచి పెద్దచేసిన నాన్న ఇప్పుడు 'నన' అయ్యాడు.
మరి ఎవరు దిక్కు అంటే , చేయి పట్టుకున్న భర్తపేరును కూడా చెప్పక "మా...! మా...! అయ్యా...!" అంటూ సమాధానమిస్తుంది. ఇదివిన్న పెళ్ళికొడుకు తండ్రికి మామయ్యా అని పిలిచినట్లనిపించి, ఎవడ్రా నాకోడలిని ఏడిపిస్తున్నది అని గర్జిస్తాడు.ఇక అప్పట్నుంచి కోడలిని బిడ్డలా కాపాడతాడు మామయ్య...!!!
ఏ ఇంట కొడలిని తక్కువ చేసి కూతురిని గొప్పగా కీర్తిస్తారో ఆ ఇంటి గృహలక్ష్మి చిన్నబుచ్చుకుని వెళ్ళిపోతుంది, ఎందుకోతెలుసా ...???
కోడలే అత్తింటి గృహలక్ష్మి...!!!
శుభం భూయాత్
Comments
Post a Comment