🚩🚩సత్యహరిశ్చంద్రీయము!
#విశ్వామిత్రుడడుగగా #హరిశ్చంద్రుడు రాజ్యమును పరిదానము ఒసగి భార్యాసుతులతో కట్టుబట్టలతో వెడలుటకు ఉద్యుక్తుడు కాగా, విశ్వామిత్రుడు తనకానాడు ఇత్తునన్న ద్రవ్యము ఇవ్వమనును. హరిశ్చంద్రుడు ఒక నెల గడువడుగును. తన శిష్యుడు నక్షత్రకుని తన ఋణము వసూలు చేయుటకు హరిశ్చంద్రుని వెంట పంపును.
#కాలకౌశికుని ఇంట దాసిగా #చంద్రమతి, #వీరబాహుని సేవకునిగ వీరదాసు అను పేరుతో #హరిశ్చంద్రుడు కుదిరినారు.
చితుకలు తెచ్చుటకు కాలకౌశికుని శిష్యులతో అడవికి వెళ్లిన #
లోహితాస్యుడు పాము కాటుకు మరణించును. పని పూర్తగు వరకు కదలరాదని కాలకౌశికుని భార్య ఆజ్ఞాపించుటతో అర్ధరాత్రి వరకు ఇంటి పనులు చేసి పిమ్మట చంద్రమతి కుమారుని తీసుకొని హరిశ్చంద్రుడు కావలిగా ఉన్న సశ్మానమునకు కొని వచ్చి శవదహనము నకు పూనుకొనును.
హరిశ్చంద్రుడు అది గమనించి కాటి సుంకము చెల్లింప కుండా శవదహనము కానింప రాదని గద్దించును. తన వద్ద సొమ్మేమి లేదనగా నగనేదైనా అమ్మి కాటిసుంకం చెల్లింప మనును. అంతట హరిశ్చంద్రుడు ఆమ మెడలో ఉన్న మాంగళ్యాన్ని ఏ ధరకైనా అమ్మమనును. వసిష్ఠుని వరము వలన భర్తకు దక్క తన మాంగల్యము ఎవరికి కనిపించదని, అందు చేత ఆమె అతని భర్త హరిశ్చంద్రునిగా గుర్తించును. ఇద్దరూ కుమారుని మరణమునకు వగచి, ఆమె యజమానురాలిని అడిగి సొమ్ము తీసుకురామని హరిశ్చంద్రుడు పలుకును.
ఇంతలో విశ్వామిత్రుడు సృష్టించిన దొంగలు కాశీ రాజు కుమారుని వధించి సొమ్ములపహరించి, కాటి సుంకమును యజమానురాలి వద్ద తీసుకొనుటకు వచ్చుచున్న చంద్రమతి పై వడవైచి మాయమగుదురు. దొంగలను వెంబడించు రాజభటులు ఆమెనే దొంగగా, హంతుకురాలిగా భావించి రాజు వద్దకు కొనిపోవుదురు. ఆమె వద్ద దొంగసొత్తును చూసి, ఆమెను దోషిగా నిర్ధాకరించి రాజు, శిరచ్చేదము శిక్షగా విధించును.
ఆమెను వధించు బాధ్యత కాటి కాపరిధి కావున ఆమెను హరిశ్చంద్రున వద్దకు కొనితెత్తురు. ఆమెను రాజాజ్ఞ ప్రకారము పధించబోవగా, విశ్వామిత్రుడు వచ్చి మాతంగ కన్యలను వివాహమాడిన హరిశ్చంద్రుని కష్టములన్నియు తొలగిపోవునని ప్రలోభ పెట్టును.
కానీ, స్ధిరచిత్తుడైన హరిశ్చంద్రుడు చంద్రమతిని వధింపబోవగా, పార్వతీ పరమేశ్వరులు ప్రతక్ష్యమై హరిశ్చంద్రుని సత్యసంధతకు ప్రసన్నులగుదురు. చంద్రమతి కాశీ రాకుమారుని సజీవుని చేయమనగా వారు లోహితుని కూడా సజీవుని చేతురు. విశ్వామిత్రుడు ఇది అంతయూ హరిశ్చంద్రుని సత్యసంధతను లోకులకు ఎరిగించుటకు పరీక్షించితినని పలికి వీరబాహుడు యమధర్మరాజని, హరిశ్చంద్రుడున్నది మరుభూమికాదని తెలిప అతని రాజ్యమునతనికి ఒసగి, తన తపఃఫలమును హరిశ్చంద్రునికి ధారపోయును.
Comments
Post a Comment