🚩🚩సత్యహరిశ్చంద్రీయము!
#విశ్వామిత్రుడడుగగా #హరిశ్చంద్రుడు రాజ్యమును పరిదానము ఒసగి భార్యాసుతులతో కట్టుబట్టలతో వెడలుటకు ఉద్యుక్తుడు కాగా, విశ్వామిత్రుడు తనకానాడు ఇత్తునన్న ద్రవ్యము ఇవ్వమనును. హరిశ్చంద్రుడు ఒక నెల గడువడుగును. తన శిష్యుడు నక్షత్రకుని తన ఋణము వసూలు చేయుటకు హరిశ్చంద్రుని వెంట పంపును. #కాలకౌశికుని ఇంట దాసిగా #చంద్రమతి , #వీరబాహుని సేవకునిగ వీరదాసు అను పేరుతో #హరిశ్చంద్రుడు కుదిరినారు. చితుకలు తెచ్చుటకు కాలకౌశికుని శిష్యులతో అడవికి వెళ్లిన # లోహితాస్యుడు పాము కాటుకు మరణించును. పని పూర్తగు వరకు కదలరాదని కాలకౌశికుని భార్య ఆజ్ఞాపించుటతో అర్ధరాత్రి వరకు ఇంటి పనులు చేసి పిమ్మట చంద్రమతి కుమారుని తీసుకొని హరిశ్చంద్రుడు కావలిగా ఉన్న సశ్మానమునకు కొని వచ్చి శవదహనము నకు పూనుకొనును. హరిశ్చంద్రుడు అది గమనించి కాటి సుంకము చెల్లింప కుండా శవదహనము కానింప రాదని గద్దించును. తన వద్ద సొమ్మేమి లేదనగా నగనేదైనా అమ్మి కాటిసుంకం చెల్లింప మనును. అంతట హరిశ్చంద్రుడు ఆమ మెడలో ఉన్న మాంగళ్యాన్ని ఏ ధరకైనా అమ్మమనును. వసిష్ఠుని వరము వలన భర్తకు దక్క తన మాంగల్యము ఎవరికి కనిపించదని, అందు చేత ఆ